Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nominee: బ్యాంకు ఖాతాలకు నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? దాని వల్ల ఉపయోగం ఏమిటి?

మీరు ఏదైనా బ్యాంకు ఖాతా తీసినా.. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టినా.. లేక జీవిత బీమా, ఈపీఎఫ్‌ తదితరాలలో నామినీ పేరు నమోదు చేయడం..

Nominee: బ్యాంకు ఖాతాలకు నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? దాని వల్ల ఉపయోగం ఏమిటి?
Bank Account
Follow us
Subhash Goud

|

Updated on: Mar 22, 2023 | 4:06 PM

మీరు ఏదైనా బ్యాంకు ఖాతా తీసినా.. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టినా.. లేక జీవిత బీమా, ఈపీఎఫ్‌ తదితరాలలో నామినీ పేరు నమోదు చేయడం తప్పనిసరి. అయితే.. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ రాదు కానీ.. పెట్టుబడిదారుడికి అనుకోనిది ఏదైనా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

వాస్తవానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.

యజమాని మరణించిన సందర్భంలో..

పెట్టుబడుల విషయంలో అసలు యజమాని మరణించిన సందర్భంలో.. వాటిని అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందించేందుకు నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డీమ్యాట్‌ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ పేరు తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం.. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పవచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము దాదాపు వేల కోట్లల్లో ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే కారణమని ఆర్బీఐ చెబుతోంది.

నామినీ పేరును మార్చుకోవచ్చు..

ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.

నామినీలు ఎంత మంది ఉండవచ్చు..

బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. అలాగే ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా పేర్కొనవచ్చు. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..