LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓ సూపర్ ప్లాప్ ఎందుకు అయింది?

|

Jun 23, 2022 | 1:33 PM

LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అంటే ఎల్‌ఐసీ ఐపీఓపై గత దాదాపు ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నా... ప్రభుత్వం అందుకు..

LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓ సూపర్ ప్లాప్ ఎందుకు అయింది?
Follow us on

LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అంటే ఎల్‌ఐసీ ఐపీఓపై గత దాదాపు ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నా… ప్రభుత్వం అందుకు సిద్ధం చేసిన తీరు, కంపెనీ సైజు చూస్తుంటే ఈ ఐపీఓ ఎన్నో రికార్డులను బద్దలు కొడుతుందేమో అనిపించింది. ఎల్‌ఐసీ ఐపీఓలో పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో చాలా డబ్బు నిలిచిపోతుందని, ఆ తర్వాత ఇతర ఐపీఓలకు ఇబ్బందులు తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ అంచనాలు తలలకిందులు అయ్యాయి.

LIC IPO సబ్స్క్రిప్షన్ మే 9న ముగిసింది. అయితే చివరకు దీని కోసం దాదాపు రూ.43,933 కోట్ల రూపాయల బిడ్స్ వచ్చాయి. ఈ IPO దాదాపు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడిదారులను బ్లాక్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఇష్యూ 2.95 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. IPO పరిమాణం 16.2 కోట్ల ఈక్విటీ షేర్లు, అయితే మొత్తం 47.83 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు అందాయి.

పాలసీదారులకు స్థిర వాటా 6.12 రెట్లు, ఉద్యోగుల వాటా 4.4 రెట్లు, రిటైల్ అంటే చిన్న పెట్టుబడిదారుల వాటా 1.99 రెట్లు బిడ్స్ వచ్చాయి. మరోవైపు, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల వాటా అంటే QIBల వాటా 2.83 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 2.91 రెట్లు బిడ్స్ దాఖలు అయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇష్యూ ఈ పార్ట్ వరకూ రికార్డులు సృష్టించింది. ఇందుకోసం 73.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2008లో రిలయన్స్ పవర్ ఐపీఓ కోసం 46.44 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే, విలువ పరంగా చూస్తే, LIC IPO పనితీరు మందకొడిగా ఉంది. దాని దరఖాస్తు కోసం బ్యాంక్ ఖాతాలలో కేవలం రూ. 43,933 కోట్లు మాత్రమే బ్లాక్ అయ్యాయి. అయితే జూలై 2021లో, Zomato IPO దరఖాస్తు కోసం రూ. 2,09,095 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది.

LIC, IPO మార్కెట్‌లో పెద్ద మొత్తంలో డబ్బును ట్రాప్ చేస్తుందని చాలా మంది మార్కెట్ నిపుణులు ఆశించారు. అయితే ఈ ఇష్యూ ఎన్‌ఎస్‌ఈ క్యాష్ మార్కెట్ విభాగంలో ఒక్క రోజు టర్నోవర్‌ను కూడా పెంచలేకపోయిందనేది వాస్తవం. NSE క్యాష్ మార్కెట్ విభాగంలో, 1 మే 2022 నుంచి 09 మే 2022 మధ్య, సగటున, ఒక రోజులో దాదాపు రూ. 66,400 కోట్ల టర్నోవర్ ఉంది.

వ్యక్తిగత కంపెనీల వ్యాపార అవకాశాలు, ఫండమెంటల్స్‌పై రానున్న ఐపీఓ పనితీరు ఆధారపడి ఉంటుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెబుతున్నారు. అనేక గ్లోబల్ కారకాల కారణంగా స్టాక్ మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయి. మన మార్కెట్లలో ఇది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, చిన్న మదుపర్లు కొనుగోళ్లకు మద్దతు ఇచ్చారు. మొత్తం మీద, LIC IPO సెకండరీ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు.

ఈ సందర్భంగా LIC IPO పనితీరు ఎందుకు అస్థిరంగా ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ IPO విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు అంటే FIIలకు నచ్చలేదు. ఈ ఐపీఓలో ఎఫ్‌ఐఐలు మొత్తం 2.41 కోట్ల షేర్లకు దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం రూ.2,292.37 కోట్లు మాత్రమే డిపాజిట్ అయ్యాయి. ఇష్యూ పరిమాణంలో ఇది 11 శాతం మాత్రమే.

దీనిపై అన్‌లిస్టెడ్ ఎరీనా వ్యవస్థాపకుడు అభయ్ దోషి మాట్లాడుతూ, మార్కెట్ గందరగోళ పరిస్థితుల కారణంగా, ఎఫ్‌ఐఐ ఎల్‌ఐసి ఐపిఓపై తక్కువ ఆసక్తిని కనబరిచింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ పెంపు ఆందోళనను మరింత పెంచింది. అందువల్ల, ఆకర్షణీయమైన ధర ఉన్నప్పటికీ, IPO పట్ల ఉత్సాహం కనిపించలేదు.

అందుకే ఈ విధంగా ఎక్కువ ఆసక్తి రేకెత్తించిన LIC IPO కోసం సేకరించిన నిధులు ఇతర IPO సబ్‌స్క్రిప్షన్‌ను ప్రభావితం చేయలేదు లేదా స్టాక్ మార్కెట్ ప్రస్తుత వ్యాపారాన్ని ప్రభావితం చేయలేదు. మొత్తం మీద IPO కోణం నుండి LIC ఒక హై-ఎండ్ దుకాణం లాంటిదని నిరూపణ అయ్యింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి