Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రాణిస్తున్న ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు..
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 305 పాయింట్ల పెరిగి 52,128 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్ల పెరిగి 15,507 వద్ద ట్రేడవుతోంది.
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 305 పాయింట్ల పెరిగి 52,128 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ఆరంభించిన మార్కెట్లు.. కాసేపటికే లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్ల పెరిగి 15,507 వద్ద ట్రేడవుతోంది. హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, టీసీఎస్ లాభాల్లో ఉన్నాయి.
అపోలో అస్పిటల్స్, టైటాన్, యూపీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.91 శాతం పెరిగాయి. సబ్ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ ఆటో 1.71, నిఫ్టీ బ్యాంక్ 0.95, నిఫ్టీ ఐటీ 0.71, నిఫ్టీ ఫార్మా 0.44 శాతం పెరిగాయి.