AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Energy Lockdown: ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది!

Energy Lockdown: భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రీమియం ఇంధనాల ధరలు పెరిగినట్లు సమాచారం. ఇంధనం..

Energy Lockdown: ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది!
Energy Lockdown
Subhash Goud
|

Updated on: Mar 26, 2026 | 10:25 AM

Share

Energy Lockdown: ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాలపై దాడులు వంటి పరిణామాల కారణంగా ఆయిల్, గ్యాస్ సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిందని అంటున్నారు. దీనితో భారత్‌లో కూడా ఎల్‌పీజీ కొరత, ఆపై పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. కరోనా మహమ్మారి సమయంలో ఉన్నట్లుగా పరిస్థితులు మారవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో “ఎనర్జీ లాక్‌డౌన్” అనే కొత్త పదం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Bank Holidays: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఏమిటి?

ఇంధన వనరులు – పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ – కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకునే కఠిన చర్యలను “ఎనర్జీ లాక్‌డౌన్” అంటారు. ఇందులో ప్రజలపై కొన్ని పరిమితులు విధించబడతాయి. ఉదాహరణకు:

  • వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం
  • పరిశ్రమల పనివేళలను కుదించడం
  • ఎయిర్ కండీషనర్లు, లైట్ల వినియోగంపై నియంత్రణ
  • అవసరం లేని ప్రయాణాలను తగ్గించడం ` ఇవి సాధారణ సూచనలు కాకుండా, అవసరమైతే తప్పనిసరి నియంత్రణలుగా అమలు చేయబడవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం:

పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయిల్ ఉత్పత్తి, రవాణా మార్గాలు ప్రభావితమయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిణామాలతో అనేక దేశాలు ఇంధన కొరతపై ఆందోళన చెందుతున్నాయి.

ఇది కూడా చదవండి: Fuel Price: వాహనదారులకు తీపికబురు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన!

కొన్ని దేశాలు ఇప్పటికే ఇంధన ఆదా చర్యలు ప్రారంభించాయి. వారంలో కొన్ని రోజులు ఆఫీసులు మూసివేయడం, స్కూళ్లకు తాత్కాలిక సెలవులు ఇవ్వడం, పబ్లిక్ ప్రదేశాల్లో AC వినియోగాన్ని తగ్గించడం, ఇంటి నుంచే పని (Work From Home) ప్రోత్సహించడం, కార్ పూలింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: సీన్‌ రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

అంతర్జాతీయ సూచనలు:

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఇంటర్నెషన్‌ ఎనర్జీ ఏజన్సీ పలు సూచనలు చేసింది. వాటిలో:

  • వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు
  • హైవేలపై వాహనాల వేగ పరిమితి తగ్గించడం
  • అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయడం
  • పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచడం వంటి చర్యలు ఉన్నాయి.

భారత్‌పై ప్రభావం

భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రీమియం ఇంధనాల ధరలు పెరిగినట్లు సమాచారం. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో సరుకుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. చివరకు ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెంచే అవకాశముంది.

మొత్తం మీద “ఎనర్జీ లాక్‌డౌన్” అనేది కేవలం ఒక పదం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే ఇంధన సంక్షోభ పరిస్థితులకు సంకేతంగా భావిస్తున్నారు. పరిస్థితులు ఎలా మారుతాయన్నది అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉండగా, ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us