AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meesho: మీషో విజయ రహస్యం.. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి? సీక్రెట్‌ ఇదే!

Meesho Business Secrets: ఇతర ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సైట్ల కంటే మీ షోలో ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. ఇలా ఎందుకు తక్కువ ధరల్లో అందిస్తుందనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? దీని వెనుక మీషో విజయ రహస్యంగా ఉంది. అసలైన సీక్రెట్‌దాగి ఉంది. అదేంటో తెలుసుకుందాం..

Meesho: మీషో విజయ రహస్యం.. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి? సీక్రెట్‌ ఇదే!
Meesho Products
Subhash Goud
|

Updated on: Aug 04, 2026 | 9:40 AM

Share

Meesho Business Secrets: ఆన్‌లైన్ షాపింగ్ ప్రపంచంలో మీషో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. Amazon, Flipkart వంటి పెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో వెయ్యి రూపాయలు ఉన్న ఒకే రకమైన ఉత్పత్తి మీషోలో కేవలం 500 లేదా 600 రూపాయలకే లభించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. చూడటానికి ఒకేలా ఉన్నా, ధరలలో ఈ భారీ వ్యత్యాసం ఎలా సాధ్యమవుతోంది? మీషో తన విజయ రహస్యాన్ని మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి నిర్మించింది. జీరో కమిషన్ పాలసీ, బ్రాండింగ్ ఖర్చుల లేకపోవడం, లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించడం.

ఇది కూడా చదవండి: లారీల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే!

1. జీరో కమిషన్ పాలసీ: విక్రేతలకు ప్రయోజనం, కస్టమర్లకు తక్కువ ధరలు:

మీషో తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించడానికి ప్రధాన కారణం దాని “జీరో కమిషన్ పాలసీ”. Amazon లేదా Flipkart వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వస్తువును అమ్మినప్పుడు, విక్రేతలు ఆయా కంపెనీలకు విక్రయంపై కొంత శాతం (సుమారు 10 నుండి 20 శాతం) కమిషన్‌గా చెల్లించాలి. ఉదాహరణకు 100 రూపాయల వస్తువుపై 10 నుండి 20 రూపాయలు యాప్ కంపెనీకి చెల్లించాల్సి వస్తుంది. సహజంగానే విక్రేత ఈ కమిషన్ భారాన్ని ఉత్పత్తి ధరలో చేర్చి కస్టమర్లపై మోపుతాడు. దీనివల్ల వస్తువు ధర పెరుగుతుంది. అయితే, మీషోలో విక్రేతలకు ఈ బాధ లేదు. వారు అమ్మిన వస్తువుపై మీషో ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోదు. దీనివల్ల విక్రేతలకు మిగిలే అదనపు లాభాన్ని వారు ఉత్పత్తి ధరను తగ్గించి కస్టమర్లకు బదిలీ చేయగలుగుతారు. ఇది నేరుగా కస్టమర్లకు తక్కువ ధరల రూపంలో ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి

2. బ్రాండింగ్ ఖర్చులు లేకపోవడం: చిన్న వ్యాపారులకు అవకాశం, సరసమైన ఉత్పత్తులు:

రెండవ ముఖ్యమైన కారణం బ్రాండింగ్. Amazon, Flipkart వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఎక్కువగా Nike, Puma, Samsung వంటి పెద్ద, సుస్థిర బ్రాండ్‌ల ఉత్పత్తులను విక్రయిస్తాయి. ఈ బ్రాండ్‌లు మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, షోరూమ్‌ల నిర్వహణ కోసం భారీగా ఖర్చు చేస్తాయి. ఈ ఖర్చలన్నీ చివరికి ఉత్పత్తి ధరలో చేర్చబడతాయి. తద్వారా ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీషో లక్ష్యం అది కాదు. మీషోలో ఎక్కువగా సూరత్, తిరుప్పూర్ వంటి నగరాలలోని చిన్న తరహా తయారీదారులు లేదా హోల్‌సేల్ వ్యాపారులు ఉత్పత్తులను విక్రయిస్తారు. వీరికి బ్రాండ్ ఇమేజ్ అవసరం లేదు. భారీ మార్కెటింగ్ ఖర్చులు ఉండవు. వారు తమ ఉత్పత్తులను నేరుగా ఫ్యాక్టరీల నుండి లేదా హోల్‌సేల్ స్థలాల నుండి సరఫరా చేస్తారు. మధ్యవర్తులు లేదా బ్రోకర్ల అవసరం ఉండదు. ఇది ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా కస్టమర్లకు మరింత తక్కువ ధరలకు లభిస్తాయి.

3. లాజిస్టిక్స్, రిటర్న్స్ ఖర్చులను తగ్గించడం: తక్కువ ధర – నెమ్మదిగా డెలివరీ:

మూడవ కారణం లాజిస్టిక్స్, రిటర్న్స్ విధానాలు. Amazon వంటి కంపెనీలు తమ కస్టమర్లకు వేగవంతమైన డెలివరీని అందించడానికి భారీ గిడ్డంగులను (వేర్‌హౌస్‌లను) దేశవ్యాప్తంగా నిర్వహిస్తాయి. ఈ గిడ్డంగుల నిర్వహణ, సిబ్బంది, రవాణా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇది అంతిమంగా ఉత్పత్తి ధరలను పెంచుతుంది. అయితే మీషో దీనికి భిన్నంగా వ్యవహరిస్తుంది. మీషో ఆర్డర్ వచ్చిన తర్వాత విక్రేత నుండి వస్తువును ప్యాక్ చేయించి, నిదానంగా డెలివరీ చేస్తుంది. మీషో లక్ష్యం వేగవంతమైన డెలివరీ కాదు. తక్కువ ధరలు. డెలివరీ లేట్ అయినా పర్వాలేదు. కానీ ధర తక్కువగా ఉండాలనుకునే సామాన్య ప్రజలే మీషో ప్రధాన టార్గెట్ కస్టమర్‌లు. ఈ ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీషో ఆ లాభాన్ని కస్టమర్లకు తక్కువ ధరల రూపంలో అందిస్తుంది. కమిషన్లు లేకపోవడం, బ్రాండ్ల గోల లేకపోవడం, ఆడంబరమైన లాజిస్టిక్స్ ఖర్చులు లేకపోవడం వల్లనే మీషోలో ధరలు అంత తక్కువగా ఉంటాయి. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ ధర కాబట్టి నాణ్యత విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం. ఇదే మీషో విజయం వెనుక ఉన్న అసలు కథ.

ఇది కూడా చదవండి: House Construction Cost: 100 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: QR కోడ్‌ మూలల్లో ఆ 3 బాక్స్‌లు ఎందుకుంటాయి? వాటి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us