Gold vs Silver: బంగారం, వెండి.. ఈ రెండింటిలో పెట్టుబడికి ఏది బెస్ట్.. ఇన్వెస్టర్లు ఏమంటున్నారంటే..

కంచు మోగినట్టు కనకంబు మోగునా... అంటారు. కానీ... కనకంబు మోగినట్టు కంచు కూడా మోగేటట్టు లేదు. ఇప్పుడు మండుతున్న బంగారం ధరల్ని చూస్తే... కన్జ్యూమర్ గుండెలు గుభేల్‌మంటున్నాయి. ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది పసిడి ధర. ఇలాంటి సమయంలో మీరు కూడా చిన్న చిన్నగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అయితే బంగారంపై పెడితే మంచిదా.. వెండిపై పెట్టుడి పెట్టాలా అనేదే అందరి ప్రశ్న..

Gold vs Silver: బంగారం, వెండి.. ఈ రెండింటిలో పెట్టుబడికి ఏది బెస్ట్.. ఇన్వెస్టర్లు ఏమంటున్నారంటే..
Gold Vs Silver
Follow us

|

Updated on: May 01, 2023 | 9:55 PM

అతివల మదిని దోచే ఆభరణాలు.. స్వర్ణకాంతులే..! కానీ.. ఆ స్వర్ణం.. ఇప్పుడు కొనే స్థితిలో లేకుండా.. పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది పసిడి ధర.. నేటి కాలంలో వేళ పసిడి కొనాలని మగువుల సెంటిమెంట్‌..! కానీ.. బంగారం ధర.. రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఈ రోజు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి ఒక శుభ సందర్భముగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది. గత 50 రోజుల్లో బంగారం ధరలు దాదాపు 10 శాతం లేదా గ్రాముకు రూ.5,000 పెరిగాయి. ఫిబ్రవరి 28న బంగారం ధర రూ.55,550గా ఉంది.

బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా పెరిగాయి. ఫిబ్రవరి 28 నుంచి కిలో వెండి ధర దాదాపు రూ.13,000 పెరిగింది. దీని ధరలు గత ఫిబ్రవరి 28న రూ.63,007గా ఉన్నాయి. కానీ ఇప్పుడు దాని ధర కిలో రూ.74,000. అయితే, రాబోయే సంవత్సరాల్లో విలువైన లోహాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం అస్థిర మార్కెట్ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం కోసం పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

గత 20 ఏళ్లలో బంగారం, వెండి సగటున 12 శాతం CAGR రాబడిని ఇచ్చిందని నిపుణులు చెప్పారు. బంగారం, వెండిలో సమానంగా పెట్టుబడి పెట్టాలి.

దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు 10 శాతం మేర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా వెండి ధరలు కేవలం 7 శాతం మాత్రమే పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు 15 శాతం, గత సంవత్సరం 2022 అక్షయ తృతీయ కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. గత 20 ఏళ్లలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 5,800 నుంచి రూ. 60,800కి 10 రెట్లు పెరిగాయని నిపుణులు చెప్పారు.

నిపుణులు అందించిన సమాచారం ప్రకారం, “గత 20 ఏళ్లలో బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రతికూల రాబడులు వచ్చాయి. అంటే ఏడాది ప్రాతిపదికన 80 శాతం సానుకూల రాబడి, ఇది చాలా మంచి అవకాశం అని తెలిపారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!