Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unclaimed Deposits: పిలిచి మరీ డబ్బులు ఇస్తామంటున్న బ్యాంకులు.. ఖాతాదారులు, నామినీలు, వారసులు ఎవరైనా తీసుకోవచ్చు..

బ్యాంకులు తమ వద్ద ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి మొదలవుతుంది.

Unclaimed Deposits: పిలిచి మరీ డబ్బులు ఇస్తామంటున్న బ్యాంకులు.. ఖాతాదారులు, నామినీలు, వారసులు ఎవరైనా తీసుకోవచ్చు..
Rbi 100 Days 100 Pays
Follow us
Madhu

|

Updated on: May 22, 2023 | 6:00 PM

మీ ఇంట్లో ఎవరిదైనా బ్యాంకు ఖాతా వినియోగించకుండా అలాగే వదిలేశారా? లేక అసలు ఆ బ్యాంకులో ఖాతా ఉందని.. కొంతకాలం దానిలో మీ ఇంట్లో వారు నగదు బదిలీ చేశారని మీకు తెలియదా? మరేం ఫర్వాలేదు. అటువంటి ఖాతాలన్ని క్లియర్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు తమ వద్ద ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది.

ట్రేస్ అండ్ సెటిల్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఉన్న టాప్ 100 అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను ఆ ఖాతాదారులు, లేదా నామినీలకు లేదా ఆ ఖాతాదారుల బంధువులకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం అనేక బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను సులభంగా గుర్తించేందుకు కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అన్ క్లయిమ్ డిపాజిట్లు అంటే..

పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లు, గడువు ముగిసిపోయి పదేళ్లు అయినా తీసుకోకుండా ఉండిపోయిన టర్మ్ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంక్ లు అన్ క్లయిమ్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అటువంటి రూ. 10.24 కోట్ల ఖాతాలకు చెందిన రూ. 35,012 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకు మరలించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎస్బీఐ అత్యధికంగా రూ. 8,086 కోట్లు ఉండగా.. రూ. 5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. పదేళ్లు ముగిసిన అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను బ్యాంక్ లు డిపాజిటర్ ఎడ్యూకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా బ్యాంక్ లు ప్రతి జిల్లా పరిధిలో టాప్ 100 అక్ క్లయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడతాయని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

డిపాజిట్ దారుడు ఉంటే ఇలా పొందొచ్చు..

ఖాతాదారులు తప్పనిసరిగా వారి డిపాజిట్ నిర్వహించబడే బ్రాంచ్‌ను సందర్శించి, వారి అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ గురించి అందుబాటులో ఉన్న సమాచారంతో పాటు క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించాలి.

వారు ఇటీవలి ఫోటోగ్రాఫ్‌లు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పాస్‌బుక్, టర్మ్ డిపాజిట్/స్పెషల్ టర్మ్ డిపాజిట్ రసీదులు, బ్యాంకుకు అవసరమైన ఏవైనా ఇతర పత్రాలను కూడా సమర్పించాలి. పత్రాలు క్రమంలో ఉంటే, రుణదాత క్లెయిమ్ చేయని డిపాజిట్ నుండి నిధులను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.

నామినీ లేదా బంధువులు ఎలా పొందొచ్చంటే..

నామినీ లేదా వారసుడు డిపాజిటర్ మరణించిన తర్వాత బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ల క్లెయిమ్ ఫారమ్‌తో నింపి సంతకం చేసి డిపాజిట్‌ను క్లెయిమ్ చేయవచ్చు. నామినీ/వారసుడికి చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు, డిపాజిటర్ మరణ ధ్రువీకరణ పత్రం, పాస్‌బుక్/స్పెషల్ టర్మ్ డిపాజిట్/టర్మ్ డిపాజిట్ రసీదులు కూడా అవసరం. అన్ని పత్రాలను క్రమంలో స్వీకరించిన తర్వాత క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం బ్యాంక్ బ్రాంచ్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..