Rs 2000 Notes: 2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేకపోతే ఆదాయపు పన్ను నోటీసు వస్తుంది
మీ దగ్గర కూడా 2000 రూపాయల నోట్లు ఉంటే, వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. సెప్టెంబర్ 30, 2023లోపు ఏదైనా బ్యాంకు శాఖలో రూ.2,000 నోట్లను డిపాజిట్ చేయాలని ఆర్‌బీఐ కోరింది..

మీ దగ్గర కూడా 2000 రూపాయల నోట్లు ఉంటే, వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. సెప్టెంబర్ 30, 2023లోపు ఏదైనా బ్యాంకు శాఖలో రూ.2,000 నోట్లను డిపాజిట్ చేయాలని ఆర్‌బీఐ కోరింది. అయితే ఆర్బీఐ ఆదేశాలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. మీరు బ్యాంకు నుంచి 2000 రూపాయల (20000 రూపాయలు విలువ) నోట్లను ఒకేసారి మార్చుకోవచ్చు. ఇది కాకుండా, నగదు డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే నోట్లను డిపాజిట్ చేసే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి నోటీలు వచ్చే అవకాశాలున్నాయి.
ఇవి తప్పకుండా ఉండాలి:
ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉండి బ్యాంకు ఖాతాలో జమ చేయాలనుకునే వారు ఏం చేయాలి? దీని కోసం, వారు డబ్బు ఆధారాలను నిరూపించడానికి ఖచ్చితమైన రికార్డులు, పత్రాలను తప్పకుండా ఉండాలి. దీనితో మీరు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలనైనా నివారించవచ్చు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసిన వారి రికార్డును నిర్వహిస్తారు.
నగదు డిపాజిట్ చేయడానికి పరిమితి:
బ్యాంకు నుంచి పెద్ద సంఖ్యలో లావాదేవీలు జరిగినప్పుడు ఆర్థిక లావాదేవీల వివరాల గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడం జరుగుతుంది. ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసే వారి ఫారమ్ 26ASలో ఈ సమాచారం చూపబడుతుంది. ఆర్థిక లావాదేవీ ప్రకటనలో, ఖాతాలో నగదు జమ చేయడానికి పరిమితి నిర్ణయించారు.




పొదుపు ఖాతాలో ఏటా 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందుతుంది. అదేవిధంగా కరెంట్ ఖాతాలో 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే ఈ పరిస్థితిలో అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)తో సరిపోలకపోతే మీరు దీనిపై ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు పొందవచ్చు.
ఆదాయపు పన్ను శాఖ పంపిన నోటీసులో నగదు డిపాజిట్ మొత్తానికి సంబంధించి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తుంటే దాని వివరాలను రికార్డ్ చేయడం ముఖ్యం. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి