AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BH సిరీస్ నంబర్ ప్లేట్ అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

BH Series Number Plate: వాహనం కొనుగోలు చేసే సమయంలో డీలర్ BH నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీలర్‌షిప్ ద్వారా ఫారం 20 నింపి, అవసరమైన అన్ని పత్రాలతో పాటు RTOకి సమర్పిస్తారు. అధికారులు అర్హతను తనిఖీ చేస్తారు..

BH సిరీస్ నంబర్ ప్లేట్ అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Subhash Goud
|

Updated on: Jun 05, 2025 | 9:42 AM

Share

మీ ఉద్యోగం లేదా పోస్టింగ్ తరచుగా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతుంటే BH (ఇండియా) సిరీస్ నంబర్ ప్లేట్ మీకు గొప్ప ఆప్షన్‌గా ఉంటుంది. మరి దీని గురించి మీకు తెలుసా..? ఈ ప్రత్యేక నంబర్ ప్లేట్ దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. మీ వాహన రిజిస్ట్రేషన్‌ను పదే పదే మార్చుకునే ఇబ్బంది ఉండదు. వాహన యజమానుల సౌలభ్యాన్ని పెంచడానికి, ముఖ్యంగా రాష్ట్రాల మధ్య పని లేదా ఉద్యోగం మారే వారికి ప్రభుత్వం దీనిని 2021లో అమలు చేసింది.

ఈ పథకం ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, కనీసం నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. BH సిరీస్ నంబర్ ప్లేట్‌తో రోడ్డు పన్నును ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతి రెండు సంవత్సరాలకు చెల్లిస్తారు. ఇది వాహన యజమానులపై ఒకేసారి భారీ పన్ను భారాన్ని మోపదు. అయితే దాని అవసరం, దరఖాస్తు ప్రక్రియ, ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Auto Driver: ఈ ఆటో డ్రైవర్ నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇవి కూడా చదవండి

BH సిరీస్ అవసరం, దాని ప్రయోజనాలు ఏమిటి?

ప్రస్తుతం దేశ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో రిజిస్టర్ చేయబడిన వాహనాన్ని మరొక రాష్ట్రంలో 12 నెలలకు పైగా నడిపితే, అతను ఆ వాహనాన్ని కొత్త రాష్ట్రంలో తిరిగి నమోదు చేసుకోవాలి. దీనికి సమయం, డబ్బు రెండూ ఖర్చవుతాయి. కానీ BH సిరీస్ నంబర్ ప్లేట్ అటువంటి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది భారతదేశం అంతటా చెల్లుతుంది. కొత్త రాష్ట్రానికి బదిలీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ను మార్చాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: IRCTC: ప్రయాణికులకు అలర్ట్‌.. ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. ఇలా చేయకపోతే తత్కాల్‌ టికెట్స్‌ బుక్‌ చేయలేరు

BH నంబర్ ప్లేట్ ఎవరు పొందవచ్చు?

  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
  • సైనిక లేదా పారామిలిటరీ దళ సిబ్బంది
  • ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు
  • కనీసం నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు కలిగిన ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు

ఏ పత్రాలు అవసరం?

  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డు
  • ఉద్యోగి ID
  • యజమాని జారీ చేసిన ఫారం 60 లేదా వర్కింగ్ సర్టిఫికేట్

ఎలా దరఖాస్తు చేయాలి?

వాహనం కొనుగోలు చేసే సమయంలో డీలర్ BH నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీలర్‌షిప్ ద్వారా ఫారం 20 నింపి, అవసరమైన అన్ని పత్రాలతో పాటు RTOకి సమర్పిస్తారు. అధికారులు అర్హతను తనిఖీ చేస్తారు. BH సిరీస్ నంబర్ ప్లేట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు పన్ను కూడా జమ చేస్తారు.

రోడ్డు పన్నులో తేడా ఏమిటి?

  • BH సిరీస్ నంబర్ ప్లేట్ పై మీరు ఒకేసారి 15 సంవత్సరాలు రోడ్డు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఇందులో ప్రతి 2 సంవత్సరాలకు లేదా దాని గుణకాలకు రోడ్డు పన్ను చెల్లించాలి.
  • దీనివల్ల వాహనం కొనుగోలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయవలసిన అవసరం ఉండదు.
  • 14 సంవత్సరాల తరువాత ఏటా పన్ను చెల్లించాలి.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా…? ఇలా చెక్‌ చేసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి