AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్లలో ‘AB’ కోచ్ ఎప్పుడైనా చూశారా..? చాలామందికి దీని స్పెషాలిటీ తెలియదు.. అసలు ఎందుకుంటుంది..?

ట్రైన్లలో అనేక కోచ్‌లు ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రతీ కోచ్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. జనరల్, ఏసీ, స్లీపర్ కోచ్‌లు లాంటివి ఉంటాయి. ట్రైన్లలో టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఏ కోచ్‌లో సీటు కావాలనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలు చూస్తే..

Indian Railways: ట్రైన్లలో 'AB' కోచ్ ఎప్పుడైనా చూశారా..? చాలామందికి దీని స్పెషాలిటీ తెలియదు.. అసలు ఎందుకుంటుంది..?
Indian Railways Coaches
Venkatrao Lella
|

Updated on: Jul 18, 2026 | 7:34 AM

Share

భారతదేశంలో రైళ్లు ఎన్నో ఏళ్ల నుంచి ఉండగా.. అనేక ప్రత్యేకతలను కూడా కలిగి ఉంది. అనేక విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి. కోచ్‌లతో పాటు వాటిపై ఉండే నెంబర్లు ఎంతో ప్రత్యేకతలను కూడి ఉంటాయి. అలాగే ట్రైన్ పట్టాల పక్కన ఉండే సిగ్నల్స్, నెంబర్లకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ట్రైన్లలో అనేక కోచ్‌లు అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వంటి కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని రైళ్లలో AB కోచ్‌లు కూడా ఉంటాయి. చాలామంది ప్రయాణికులు ఈ కోచ్‌ల విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఈ కోచ్‌ల సీట్ల విషయంలో కన్‌ప్యూజన్‌ పడుతుంటారు. ఎందుకంటే కొన్ని సీట్ నెంబర్లు రెండుసార్లు కనిపిస్తాయి. ఈ బోగీలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ క్లాసులు ఒకేచోట కలిసి ఉంటాయి. కోచ్‌ను పంచుకున్నప్పటికీ.. ప్రతి విభాగానికి సొంత సీటింగ్ ఉంటుంది. అసలు ఈ కోచ్ ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏబీ కోచ్ అంటే ఏంటి..?

ఏబీ కోచ్ అనేది ఒక హైబ్రిడ్ కంపార్ట్‌మెంట్. ఈ కంపార్ట్‌మెంటులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ క్లాసులు ఒకేచోట కలిసి ఉంటాయి. అయితే ప్రతి విభాగానికి సొంత సీటింగ్ ఉంటుంది. దీంతో సీట్ల నెంబర్ల విషయంలో ప్రయాణికులు కన్‌ప్యూజ్ అవుతుంటారు. ఒకే సీటు నెంబర్ రెండుసార్లు కనిపించడం వల్ల ప్రయాణికులకు ఎక్కడ కూర్చోవాలనేది తెలియదు. ఒకే నెంబర్ సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ రెండు సెక్షన్లలోనూ కనిపించడం వల్ల బెర్త్‌ను గుర్తు పట్టడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ బెర్త్‌ను ఎలా గుర్తు పట్టాలంటే.. మీ టికెట్ క్లాసును చెక్ చేసుకోవాలి. థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే మీబేలో మధ్య బెర్త్ ఉంటుంది. అదే సెకండ్ ఏసీలో కేవలం పైన, కింద బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. ఇక సెకండ్ ఏసీలో ప్రతీ బెర్త్‌కు కర్టెన్లు ఉంటాయి. థర్డ్ ఏసీలో కర్టెన్లు ఉండవు. ఈ తేడాలను గమనించి మీరు బెర్త్‌ను సులువుగా గమనించవచ్చు. ఒకవేళ మీకు ఏబీ కోచ్ కేటాయిస్తే.. సీటులో కూర్చునే ముందు మీ టికెట్ వివరాలను సరిగ్గా చెక్ చేస్కోండి. ఏ సెక్షన్‌లో మీ బెర్త్ ఉందనేది సరిగ్గా గమనించండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే టీటీఈని అడగండి. మీకు టీటీఈలు సహాయం అందిస్తారు. అయితే  ఈ కోచ్‌లు కొన్ని రైళ్లల్లోనే ఉంటాయి. భారత రైల్వే అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. అందులో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్