AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cash Withdrawal: బ్యాంకులో క్యాషియర్ పొరపాటున మీకు ఎక్కువ డబ్బు ఇచ్చాడా..? ఇలా చేయండి.. లేకుంటే కేసుల్లో చిక్కుకుంటారు!

ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరుపుతుంటారు. రకరకాల అవసరాల నిమిత్తం బ్యాంకులకు వెళ్లి విత్‌డ్రా వంటివి చేస్తుంటారు. చిన్న మొత్తం అయితే ఏటీఎం నుంచి తీసుకోవచ్చు గానీ, పెద్ద అమౌంట్‌ ఉన్నవారు బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు డబ్బులు విత్‌ డ్రా చేసుకున్న తర్వాత మొత్తాన్ని లెక్కించుకోవడం ఉత్తమం. ఎందుకంటే అందులో ఎక్కువ వచ్చినా.. తక్కువ వచ్చినా తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవచ్చు..

Cash Withdrawal: బ్యాంకులో క్యాషియర్ పొరపాటున మీకు ఎక్కువ డబ్బు ఇచ్చాడా..? ఇలా చేయండి.. లేకుంటే కేసుల్లో చిక్కుకుంటారు!
Cash Withdrawal
Subhash Goud
|

Updated on: Aug 05, 2023 | 3:36 PM

Share

ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరుపుతుంటారు. రకరకాల అవసరాల నిమిత్తం బ్యాంకులకు వెళ్లి విత్‌డ్రా వంటివి చేస్తుంటారు. చిన్న మొత్తం అయితే ఏటీఎం నుంచి తీసుకోవచ్చు గానీ, పెద్ద అమౌంట్‌ ఉన్నవారు బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు డబ్బులు విత్‌ డ్రా చేసుకున్న తర్వాత మొత్తాన్ని లెక్కించుకోవడం ఉత్తమం. ఎందుకంటే అందులో ఎక్కువ వచ్చినా.. తక్కువ వచ్చినా తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవచ్చు.

మీరు బ్యాంకులో డబ్బులు విత్‌ డ్రా చేసిన తర్వాత నగదు తీసుకోవడానికి వెళ్లిన తర్వాత పొరపాటున క్యాషియర్ మీకు మరింత డబ్బు అందజేసినట్లు మీకు ఎప్పుడైనా జరిగిందా..? అవును అయితే డబ్బును తిరిగి ఇవ్వడం మీ కర్తవ్యం. కానీ మీరు కూడా పొరపాటున ఆ మొత్తాన్ని లెక్కించకుండా, అంతకు మించి వేరే చోటికి బదిలీ లేదా చెల్లించినట్లయితే, మీరు ఆ మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో బ్యాంకుకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉన్నాయో తెలుసుకుందాం..?

బ్యాంకుకు మీకు క్యాషీయర్‌ పొరపాటున మీరు చేసిన విత్‌డ్రా కంటే ఎక్కువ డబ్బుల ఇచ్చినట్లయితే మీ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు పూర్తి హక్కు ఉంది. మీరు అదనపు డబ్బు మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి ఇవ్వడం మంచిదని గుర్తించుకోండి. మీకు బ్యాంకు నుంచి ఎక్కువ వచ్చిన డబ్బును తిరిగి ఇవ్వకుంటే మీపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ మీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. మీరు దీన్ని నివారించాలనుకుంటే, మీ వద్ద ఉన్న పరిష్కారాలు ఏమిటిటో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఎల్లప్పుడూ ఈ జాగ్రత్తలు తీసుకోండి

  • మీ లావాదేవీ ఎక్కువ నగదు రూపంలో ఉంటే, మీరు ఈ రకమైన పొరపాటును నివారించాలనుకుంటే, ఈ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయి.
  • బ్యాంక్ క్యాష్ కౌంటర్ నుంచి బయలుదేరే ముందు ఎల్లప్పుడూ నగదును లెక్కించుకోవడం మంచిది.
  • ఎల్లప్పుడూ మీ ఇంటికి లేదా దుకాణానికి వెళ్లి బ్యాంకు నుంచి వచ్చిన నగదును మరోసారి లెక్కించుకోవడం ఉత్తమం. ఆ తర్వాత మాత్రమే తదుపరి చెల్లింపు చేయడానికి ఉపయోగించుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
  • బ్యాంక్ క్యాషియర్ పొరపాటున మీకు ఎక్కువ డబ్బు ఇచ్చినట్లు మీకు బ్యాంకు సిబ్బంది సమాచారం అందించినట్లయతే వెంటనే ఆ డబ్బును బ్యాంకుకు ఇవ్వడం మంచిది. లేకుంటే మీరు పోలీసు కేసులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

బ్యాంకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు:

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో తెలుసుకుందాం.

  • అన్నింటిలో మొదటిది బ్యాంక్ మీకు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. మీకు చేసిన విత్‌డ్రా కంటే ఎక్కువ ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని మిమ్మల్ని అడగవచ్చు.
  • ఒకే వేళ బ్యాంకు నుంచి ఎక్కువ డబ్బు తీసుకున్న తర్వాత ఎక్కవగా వచ్చిన డబ్బు బ్యాంకుకు తిరిగి ఇవ్వకపోతే బ్యాంక్ మీ ఖాతాను స్తంభింపజేయవచ్చు.
  • ఇది కాకుండా బ్యాంకు మీపై పోలీసు కేసును కూడా నమోదు చేయవచ్చు. అక్రమంగా డబ్బును తీసుకున్నందుకు మీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. అందుకు బ్యాంకు లావాదేవీలు జరిపే ముందు ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తప్పిదం జరిగినప్పుడు మీరు స్పందించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి