Warren buffett quotes: వ్యాపారంలో విజయానికి పంచతంత్రం..వారెన్ బఫెట్ చెప్పిన ఐదు సూత్రాలు
ప్రతి ఒక్కరూ తాము ఉన్నత స్థాయికి ఎదగాలని, డబ్బులు బాగా సంపాదించాలని, వ్యాపారంలో ప్రగతి సాధించాలని కోరుకుంటారు. ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి రేయింబవళ్లు కష్టబడతారు. వారిలో కొందరు విజయతీరాలకు చేరుకుంటారు. మరికొందరు మధ్యలోనే ఆగిపోతారు. ఏదైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ, ఓర్పు, సహనం, ముందు చూపు అవసరం.

మన కళ్ల ముందే విజయాలు సాధించిన వ్యక్తులు మనకు ఆదర్శంగా నిలుస్తారు. వారిలో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త వారెన్ బఫెట్ ఒకరు. ఆయన పెట్టుబడి దారుడు, పరోపకారి, బెర్క్ షైర్ హాత్ వే కంపెనీ చైర్మన్. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. మంచి పెట్టుబడులు పెట్టాలంటే తెలుసుకోవాల్సిన ఐదు విషయాలను ఆయన వెల్లడించారు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బును పోగొట్టుకోకూడదు
మూలధనాన్ని రక్షించుకోవడం పెట్టుబడిదారుల ప్రధాన బాధ్యతని బఫెట్ తెలిపారు. డబ్బును పోగొట్టుకుంటే మీరు రేసులో వెనుకబడిపోతారు. దాని నుంచి కోలుకోవడం కష్టంగా మారుతుంది. ఒక స్టాక్ లో 50 శాతం నష్టపోతే, మరో దానిలో లాభాలు సంపాదించాలి. ముఖ్యంగా పెట్టుబడిలో నష్టాలను నివారించడానికి కష్టబడి పనిచేయడమే సరైన మార్గమని ఆయన నమ్మకం.
కంపెనీల కొనుగోలు
ఎక్కువ డబ్బులు పెట్టి ఒక మంచి కంపెనీని కొనడం కంటే, తక్కువ డబ్బులతో మధ్యస్త కంపెనీ కొనడం ఉత్తమమని బఫెట్ చెబుతారు. దీని వల్ల తక్కువ ధరకు నాణ్యత కలిగిన కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశం కలుగుతుంది. ఇది వ్యాపార రంగంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. దీర్ఘకాలంలో లాభాల బాటలో పయనించే అవకాశం కలుగుతుంది.
భావోద్వేగాలు
భావోద్వేగాలను దూరంగా ఉండడం పెట్టుబడి దారుడి ప్రధాన లక్షణం. దీనినే బఫెట్ వ్యతిరేక పెట్టుబడి కళగా అభివర్ణించారు. మార్కెట్ బాగున్నప్పుడు ధరలు పెరుగుతాయి. దీని వల్ల నష్టాలు కలుగుతాయి. అయితే భయాందోళనలు తలెత్తినప్పుడు స్టాక్ ల ధరల తగ్గే అవకాశం ఉంది. ఆ సమయంలో మంచి డీల్ లను అందుకోవచ్చు.
ఓర్పు
పెట్టుబడిదారుడికి ఓర్పు అనేది చాాలా అవసరం. పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాల కోసం ఆలోచించడం సరి కాదు. మంచి కంపెనీలో ఏళ్ల తరబడి డబ్బులను నిల్వ ఉంచాలి. అసహనంగా ఉండే వారు తరచూ అధిక ధరలకు స్టాక్ లను కొనుగోలు చేసి, మార్కెట్లు పెరిగినప్పుడు తక్కువ ధరకు అమ్మేస్తారు. తద్వారా ఓపికతో వేచి ఉండే ఇన్వెస్టర్లు లాభాలు పొందుతారు.
కొత్త మార్గాలు
డబ్బులను సంపాదించడానికి నిరంతరం కొత్త మార్గాలను అన్వేషించాలి. ఒక రకంగా చెప్పాలంటే నిద్ర పోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించడానికి మార్గం ఆలోచించాలి. లేకపోతే మీరు చనిపోయే వరకూ పని చేస్తూనే ఉంటారని వారెన్ బఫెట్ చెప్పారు. అంటే స్టాక్ లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా అవి పెరుగుతూనే ఉంటాయి. కొత్త మార్గాలను అన్వేషించడం పెట్టుబడి దారుడికి చాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి