AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrogen Fuel: హైడ్రోజన్ ఇంధనంతో నడిచే స్కూటర్‌.. మైలేజీ ఎంతో తెలుసా?

ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. సింగిల్‌ ఛార్జింగ్‌తో అధిక మైలేజీ ఇచ్చే వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. స్కూటర్లే కాకుండా కార్లను కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో కూడా అద్భుతమైన ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు. ముందుగా ఓలా కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత వివిధ కంపెనీలు కూడా అదే మార్గాల్లో వెళుతూ సరికొత్త వెర్షన్‌లతో ఈవీ..

Hydrogen Fuel: హైడ్రోజన్ ఇంధనంతో నడిచే స్కూటర్‌.. మైలేజీ ఎంతో తెలుసా?
Joy E Bike
Subhash Goud
|

Updated on: Feb 11, 2024 | 8:33 AM

Share

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల కారణంగా మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ వాహనాల తయారీ కంపెనీలు కూడా ఈవీ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో స్కూటర్ల నుంచి కార్ల వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటి తక్కువ రేంజ్, ఎక్కువ ఛార్జింగ్ సమయం కారణంగా వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

అటువంటి పరిస్థితుల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ఖచ్చితంగా ఒక ఆశాకిరణం ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనం లేదా పెట్రోల్-డీజిల్‌తో నడిచే వాహనం కాదు. వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఎక్స్‌పోలో హైడ్రోజన్‌తో నడిచే స్కూటర్‌ను ప్రదర్శించింది. ఇది ఒక లీటర్ ఇంధనంలో 55 కి.మీ మైలేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఈ స్కూటర్‌లో పెడల్స్ కూడా అందించబడ్డాయి. అవసరమైతే సైకిల్ లాగా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

హైడ్రోజన్ ఇంధనంతో కూడిన స్కూటర్ ఎలా పని చేస్తుంది?

ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీతో నడిచే మొదటి స్కూటర్ కాన్సెప్ట్ వెర్షన్‌ను వార్డ్‌విజార్డ్ ఆవిష్కరించింది. ఈ స్కూటర్ భవిష్యత్తులో క్లీన్, ఎఫెక్టివ్ మొబిలిటీకి పునాది వేయగలదు. కానీ ప్రస్తుతం పరిశోధన, అభివృద్ధి దశలో ఉంది. కానీ హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ కాన్సెప్ట్ తదుపరి తరం యూజర్ యుటిలిటీ వాహనాల్లో పెద్ద పాత్ర పోషిస్తుంది. కంపెనీ ఇటీవల ఏఅండ్‌ఎస్‌ పవర్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా కంపెనీ తదుపరి తరం Li-ion సెల్ టెక్నాలజీ, GAJA సెల్‌లో పని చేస్తుంది.

ఇదిలా ఉండగా, పెరిగిపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా వాహనదారులు సతమతమవుతున్నారు. ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. సింగిల్‌ ఛార్జింగ్‌తో అధిక మైలేజీ ఇచ్చే వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. స్కూటర్లే కాకుండా కార్లను కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో కూడా అద్భుతమైన ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు. ముందుగా ఓలా కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత వివిధ కంపెనీలు కూడా అదే మార్గాల్లో వెళుతూ సరికొత్త వెర్షన్‌లతో ఈవీ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ ఈవీ స్కూటర్లలో కూడా మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్స్‌, రివర్స్‌ ఆప్షన్‌, డిజిటల్‌ డిస్‌ప్లేలతో పాటు ఎన్నో సరికొత్త ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?