AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RERA: మీరు బిల్డర్‌కు డబ్బు చెల్లించి సంవత్సరాలు గడిచిపోతున్నాయా.. అయితే మీకిది శుభవార్తే..

రవి గత 22 సంవత్సరాలుగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నివసిస్తున్నారు. చాలా మంది లానే రవి కూడా తానూ ఒక స్వంత ఇల్లు కొనుక్కోవాలని కళలు కన్నాడు...

RERA: మీరు బిల్డర్‌కు డబ్బు చెల్లించి సంవత్సరాలు గడిచిపోతున్నాయా.. అయితే మీకిది శుభవార్తే..
House
Srinivas Chekkilla
|

Updated on: Feb 24, 2022 | 6:51 AM

Share

రవి గత 22 సంవత్సరాలుగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నివసిస్తున్నారు. చాలా మంది లానే రవి కూడా తానూ ఒక స్వంత ఇల్లు కొనుక్కోవాలని కళలు కన్నాడు. దానికోసం అతను ప్రయత్నాలు ప్రారంభించాడు. కష్టపడి డబ్బు దాచి రవి 2011లో హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో రూ.48 లక్షలు ఖరీదైన ప్లాట్(Plot) బుక్ చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బు డౌన్ పేమెంట్(Down Payment) కట్టి.. బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. మొత్తం డబ్బు బిల్డర్‌కు కట్టేశాడు. త్వరగా తన ఇంటికి మారి, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనేది అతని కల. కానీ అతని నిరీక్షణ ఇప్పటికీ ముగియలేదు. బిల్డర్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న రుణాలు(Loans) డిఫాల్ట్ చేసి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాడు. శ్రీకాంత్ ఇంటి రుణం కోసం EMI చెల్లిస్తున్నాడు. మరో పక్క ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దె కూడా చేల్లిస్తున్నాడు. దీంతో ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమస్య రవి ఒక్కడికే కాదు.

చాలామంది ఇదే ఇబ్బందిలో పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ RERA చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితిని చాలా మంది ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. బిల్డర్లకు కట్టి.. తమ స్వంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు బ్యాంక్ వాటాతో పోల్చితే, గృహ కొనుగోలుదారుల సంక్షేమం చాలా ముఖ్యమని సూచించింది. ఇది గృహ కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అంటే, బిల్డర్ తన ప్రాజెక్టు విషయంలో డిఫాల్టర్ అయి.. కొనుగోలు దారునికి ఇంటిని స్వాధీనం చేయకపోతే.. బ్యాంకుల కంటే గృహ కొనుగోలుదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

బ్యాంకుల రికవరీ ప్రక్రియ ప్రారంభిస్తే RERA నియమాలు అమలు అవుతాయి. అంటే వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యత ఉంటుందన్న మాట. దేశంలోని లక్షలాది మంది ప్రజలు తమ ఇంటి డెలివరీ కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా కోర్టులు పదే పదే ఆదేశాలు ఇస్తున్నాయి. రాష్ట్రాలు అమలు చేస్తున్న RERA నిబంధనలను పరిశీలించాల్సిందిగా కోర్టులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అవి కేంద్రం 2016 రెరా చట్టానికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు కూడా దేశవ్యాప్తంగా ఇదే విధమైన బిల్డర్-బైయర్ రూల్స్‌ను కోరుతోంది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత వినియోగదారుల విశ్వాసం మరింత పెరగనుంది. ఇది బిల్డర్ల డిఫాల్ట్‌ల తగ్గించి.. డెలివరీలు త్వరగా చేసేలా చేయ్యొచ్చు.

ఇది రియల్టీ రంగంలో కొత్త పెట్టుబడులకు కూడా ద్వారాలు తెరుస్తుంది. రికార్డుల ప్రకారం, 20% మంది గృహ కొనుగోలుదారులు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి నిర్దేశిత గడువు కంటే 10 సంవత్సరాల పాటు వేచి ఉన్నారు. 50% కంటే ఎక్కువ మంది గృహ కొనుగోలుదారులు నిర్దేశిత గడువు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ వేచి ఉన్నారు. రెరా అమల్లోకి వచ్చిన తర్వాత, దేశంలోని ప్రతి చోట బిల్డర్లపై ఫిర్యాదులు నమోదయ్యాయి. రాష్ట్రాల రెరాలకు 50,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 42,000 ఫిర్యాదులు పరిష్కరించారు. మహారాష్ట్ర, యూపీలో గరిష్ఠ సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక కొన్ని ఆశ్చర్యకరమైన గణాంకాలను వెల్లడించింది. 2021లో దేశంలో నిర్మాణంలో ఉన్న 6 లక్షల ఇళ్లు నిలిచిపోయాయి లేక ఆలస్యమయ్యాయి. సుప్రీం కోర్టు తాజా నిర్ణయం శ్రీకాంత్, అతనిలాంటి లక్షల మంది ప్రజలు త్వరగా తమ ఇళ్లను పొందడంలో సహాయపడనుంది.

Read Also..  Gas prices Hike: సామాన్యులకు గుదిబండగా మారనున్న గ్యాస్ బండ.. త్వరలో రెండితలు కానున్న వంటగ్యాస్ ధర..