Voter ID: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా!

ఆధార్ కార్డు ఆధారంగా ఓటరు కార్డు రూపొందించబడని పౌరులు. వారు ఆధార్ కార్డు, ఓటరు కార్డును లింక్ చేయాలి. ఓటింగ్ సమయంలో అక్రమాలు, బోగస్ ఓటర్లను గుర్తించడానికి లేదా మీ పేరుపై నకిలీ ఓటరు కార్డులను వెలికితీసేందుకు అవసరం అవుతుంది. మీరు మీ ఓటరు కార్డు, ఆధార్..

Voter ID: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా!
Voting Card
Follow us
Subhash Goud

|

Updated on: Jan 28, 2024 | 9:30 PM

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఓట్లు వచ్చాయంటే ఓటర్‌ ఐడి కార్డు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు ఓటు వేయాలంటే ఓటర్‌ లిస్ట్‌లో పేరు ఉండాలి. అప్పుడే ఓటు వేసేందుకు అర్హులు. ఎన్నికల సమయంలో, ప్రతి ఏడాది కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రకటన జారీ చేస్తుంటుంది ఎన్నికల కమిషన్‌. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 50 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి ఒక్కరూ తమ లోక్‌సభ ప్రతినిధిని పార్లమెంటుకు పంపేందుకు ఓటును వినియోగించుకోవాలి. అయితే ఓటింగ్ కార్డును రూపొందించడం సులభం. దాని కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ ఎలాగో తెలుసుకుందాం.

ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • ఆ తర్వాత ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP)పై క్లిక్ చేయండి.
  • కొత్త ఓటరు నమోదు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి
  • ఇప్పుడు పుట్టిన తేదీ, చిరునామా, పుట్టిన తేదీ సర్టిఫికేట్‌ తదితర వివరాలను అందించాలి.
  • ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి

దరఖాస్తు చేసిన తర్వాత ఏమి చేయాలి?

ఇవి కూడా చదవండి

అయితే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ ఈ-మెయిల్ ఐడీకి ఇమెయిల్ వస్తుంది. అందులో ఓ లింక్‌ ఉంటుంది. దాని ఆధారంగా అభ్యర్థి ఓటరు గుర్తింపు కార్డును రూపొందించడానికి ఆ లింక్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత నెల రోజుల్లో కార్డు మీ అడ్రస్‌కు వస్తుంది.

ఒక వేళ ఓటరు కార్డు రాకపోతే ఏం చేయాలి?

కొన్ని సందర్భాల్లో వివరాలు సరిగ్గా లేకనో..మరేదైనా కారణంగానో ఓటర్‌ కార్డు రాదు. ఇలాంటి సమయంలో జిల్లా ఎన్నికల కార్యాలయం నుండి మీకు కాల్ రాకుంటే, మీరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఓటర్ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. దాని కోసం, మీరు నివసిస్తున్న రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేయండి. జాబితాలో మీ పేరు ఉంటే, ఓటరు కార్డును సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పట్టదని గుర్తించుకోండి.

ఓటర్‌ ఐడి కార్డు కోసం ఏయే పత్రాలు కావాలి?

  • ఆధార్ కార్డ్
  • జనన ధృవీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్ కార్డ్, క్లాస్ X, XII మార్క్ షీట్
  • ఓటర్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్

ఆధార్ కార్డు ఆధారంగా ఓటరు కార్డు రూపొందించబడని పౌరులు. వారు ఆధార్ కార్డు, ఓటరు కార్డును లింక్ చేయాలి. ఓటింగ్ సమయంలో అక్రమాలు, బోగస్ ఓటర్లను గుర్తించడానికి లేదా మీ పేరుపై నకిలీ ఓటరు కార్డులను వెలికితీసేందుకు అవసరం అవుతుంది. మీరు మీ ఓటరు కార్డు, ఆధార్ కార్డును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో లింక్ చేయవచ్చు. దాని కోసం ఎన్‌విఎస్‌పి పోర్టల్‌ని సందర్శించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి