Room Heater: రూమ్ హీటర్ కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి..
ఇటీవల కాలంలో చాలా మంది ఈ రూమ్ హీటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండటంతో ఇంట్లో ఏసీలతో పాటు హీటర్లు కూడా పెట్టుకుంటున్నారు. సాధారణ స్వెటర్లు, ఉన్ని దుప్పట్లతో నియంత్రించలేని చలిని ఈ హీటర్లు కంట్రోల్ చేస్తాయి. ఇంట్లో సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా చేస్తాయి. అయితే రూమ్ హీటర్ కొనుగోలు చేసేవారు కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం..

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఉశమనాన్ని ఇచ్చేవి ఎయిర్ కండిషనర్లు(ఏసీ). అదే విధంగా తీవ్రమైన శీతాకాలంలో ఎముకలు కొరిగే చలిలో సాంత్వన చేకూర్చేవి రూమ్ హీటర్లు. ఇటీవల కాలంలో చాలా మంది ఈ రూమ్ హీటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండటంతో ఇంట్లో ఏసీలతో పాటు హీటర్లు కూడా పెట్టుకుంటున్నారు. సాధారణ స్వెటర్లు, ఉన్ని దుప్పట్లతో నియంత్రించలేని చలిని ఈ హీటర్లు కంట్రోల్ చేస్తాయి. ఇంట్లో సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా చేస్తాయి. అయితే రూమ్ హీటర్ కొనుగోలు చేసేవారు కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే హీటర్లు మీ గది పరిమాణాన్ని బట్టి దాని సామర్థ్యాలు, హీటింగ్ ఎలిమెంట్ లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ రూమ్ హీటర్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలను మీకు అందిస్తున్నాం.
హీటర్లలో రకాలు..
రూమ్ హీటర్లలో చాలా రకాలు ఉంటాయి. ఇన్ ఫ్రారెడ్ హీటర్లు, ఫ్యాన్ హీటర్లు, ఆయిల్ ఫిల్డ్ హీటర్ల వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మరి వీటిలో ఎలాంటి హీటర్లు ఉపయుక్తంగా ఉంటాయి? అంటే సాధారణంగా గదుల పరిమాణాన్ని బట్టి హీటర్ రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో హీటర్ వాటేజ్, హీటింగ్ సామర్థ్యం, ఫీచర్లు, సేఫ్టీ కోసం అందిస్తున్న సదుపాయాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది.
ఇన్‌ఫ్రారెడ్ రూమ్ హీటర్లు..
మీరు చిన్నగదిలో నివశిస్తుంటే ఈ ఇన్‌ఫ్రారెడ్ హీటర్లు సరిపోతాయి. వీటి ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. చిన్న గదులను వెచ్చగా ఉంచడానికి ఈ హీటర్లు ఓకే అయినా పెద్ద గదులకు మాత్రం సరిపోదు. తక్కువ ధరలో చిన్న గదికి ఇది కావాలంటే మాత్రం ఇదే బెస్ట్ ఆప్షన్.
ఫ్యాన్ రూమ్ హీటర్లు..
మీడియం సైజ్ రూమ్ లకు ఈ ఫ్యాన్ హీటర్లు నమ్ముతాయి. వీటిని సెరామిక్ హీటర్లు అని కూడా పిలుస్తారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఇవి భద్రతను కూడా ఇస్తాయి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఫ్యాన్ హీటర్లనే వాడుతున్నారు. దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ ఏర్పడుతోంది.
ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్లు..
పెద్ద హాళ్లు, లేదా ఎక్కువ వెడల్పుగా ఉండే బెడ్ రూమ్ లలో అయితే ఈ ఆయిల్ ఫిల్డ్ హీటర్లు తీసుకోవడం ఉత్తమం. ఇది పెద్ద ప్రాంతంలో చాలా సేపటి వరకూ వేడిగా ఉంచడంలో సాయపడుతుంది. అయితే ఇది గదిని హీట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ ఎక్కువ సేపు వేడి నిలిచి ఉండేలా చేస్తుంది. దీనిని స్విచ్ఛాఫ్ చేసేసినా దాని ప్రభావం చాలా సేపటి వరకూ ఉండేలా చేస్తుంది. విద్యుత్ వాడకం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కొంత మంది మీడియం సైజ్ రూమ్ లకు కూడా వీటిని వినియోగిస్తున్నారు.
వాటేజ్, హీటింగ్ సామర్థ్యం..
రూమ్ హీటర్ ను మీ గది పరిమాణాన్ని బట్టి ఏ రకం కావాలో నిర్ణయించుకున్న తర్వాత తప్పనిసరిగా సరిచూసుకోవాల్సిన అంశాలు దాని వాటేజ్, హీటింగ్ కెపాసిటీ. వాటేజ్ ని బట్టి వేగంగా వేడిని కలిగించడంతో పాటు అధిక వేడిని ఇస్తుంది. అదే సమయంలో విద్యుత్ వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో తక్కువ సమయంలో అధిక వేడిని కలిగించే హీటర్లు కూడా ఉంటాయి. సాధారణంగా 100 చదరపు అడుగులు ఉన్న గది కోసం 750వాట్ల రూమ్ హీటర్ సరిపోతుంది.
ఈ ఫీచర్లు ఉండాలి..
ఏసీల్లో టెంపరేచర్ కంట్రోల్స్ ఉన్నట్లు గానే రూమ్ హీటర్లలో కూడా ఉంటాయి. టెంపరేచర్ కంట్రోల్ కోసం ప్రత్యేకమైన నాబ్ ఉండేటట్లు చూసుకోవాలి. దీని సాయంతో బయటి ఉష్ణోగ్రతను బట్టి హీటర్ టెంపరేచర్ ను సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా హీటర్లో ఇన్ బిల్ట్ టైమర్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. కొంత సమయం తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయేటట్లు ఉంటే మీరు విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు.
సేఫ్టీ మస్ట్..
ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఎప్పుడు కొన్నా కూడా తప్పనిసరిగా చూసుకోవాల్సిన మరో అంశం స్టార్ రేటింగ్. రూమ్ హీటర్ కొనుగోలు చేసేటప్పుడు దీనిని సరిచూసుకోవాలి. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉంటే అది తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. అదే సమయంలో హీటర్ కు మెష్ లేదా గ్రిడ్ రక్షణ ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో హీటర్ కొనుగోలు చేయాలంటే ఇవి తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో ఎర్తింగ్ కూడా సరిగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








