ఇక డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ఇంటర్నెట్..!

ఇప్పటి వరకు ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌లోనే అందుబాటులో ఉన్న డేటా(ఇంటర్నెట్ ) సర్వీసులు.. ఇకనుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో కూడా రానున్నాయి. ఈ సర్వీసులను అందించేందుకు విస్తారా ఎయిర్‌లైన్స్ కంపెనీ సిద్ధమైంది. త్వరలోనే సంస్థ విమానాల్లో డేటా సర్వీసులను అందించనుంది. దీంతో దేశంలో దేశీయ విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి ఎయిర్‌లైన్స్ విస్తారా కానుంది. ఈ సర్వీసులను అందించేందుకు విస్తారా కంపెనీ.. టాటా గ్రూప్‌కు చెందిన నెల్కోతో డీల్ కుదుర్చుకుంది. దీనిపై టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ కూడా […]

ఇక డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ఇంటర్నెట్..!
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 4:01 PM

ఇప్పటి వరకు ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌లోనే అందుబాటులో ఉన్న డేటా(ఇంటర్నెట్ ) సర్వీసులు.. ఇకనుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో కూడా రానున్నాయి. ఈ సర్వీసులను అందించేందుకు విస్తారా ఎయిర్‌లైన్స్ కంపెనీ సిద్ధమైంది. త్వరలోనే సంస్థ విమానాల్లో డేటా సర్వీసులను అందించనుంది. దీంతో దేశంలో దేశీయ విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి ఎయిర్‌లైన్స్ విస్తారా కానుంది.

ఈ సర్వీసులను అందించేందుకు విస్తారా కంపెనీ.. టాటా గ్రూప్‌కు చెందిన నెల్కోతో డీల్ కుదుర్చుకుంది. దీనిపై టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ కూడా స్పందించారు. డేటా సర్వీసుల కోసం.. ఈ సంస్థలు ఇస్రో నుంచి ఒక ట్రాన్స్‌పాండర్‌ను తీసుకున్నాయన్నారు. ఇందుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను కూడా కేటాయించాలని తమను కోరడంతో.. అంగీకరించినట్లు తెలిపారు. త్వరలోనే విస్తార విమానయాన సంస్థ, తన విమానాల్లో డేటా సర్వీసులను అందించబోతుందని అన్షు ప్రకాశ్ పేర్కొన్నారు.

అయితే వాయిస్ కాల్స్‌ కంటే ముందు డేటా సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. డేటా సర్వీసులు అందుబాటులోకి వస్తే.. ఓవర్‌ ద టాప్‌ సేవలు పొందవచ్చని, దీని ద్వారా వాట్సాప్‌ కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఈ డేటా సర్వీసుల టారిఫ్‌ల నియంత్రణ మాత్రం ప్రభుత్వ పరిధిలో ఉండదన్నారు. ఈ సర్వీసులను ఫ్రీగా అందిస్తారో.. లేక ఛార్జీలు వసూలు చేస్తారో అన్నది ఆయా సంస్థలే నిర్ణయిస్తాయన్నారు. ఇదిలా ఉంటే.. విమానాల్లో ఈ డేటా సర్వీసులను ఎప్పటి నుంచి అందుబాటులోకి తేవాలన్నదానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు.