2026-27 బడ్జెట్‌కు డేట్ ఫిక్స్! ఈ సారి బడ్జెట్‌తో చరిత్ర సృష్టించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
2026-27 కేంద్ర బడ్జెట్ తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తారు. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. ఈ బడ్జెట్‌లో బీమా రంగం గురించి కీలక అంశాలు ఉండొచ్చు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి డేట్ ఫిక్స్ అయింది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29న ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 28న సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అగ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి ప్రసంగానికి హాజరు కానున్నారు. ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఫిబ్రవరి 28, 1999న అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999–2000 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బీమా రంగం..
2026 కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతున్న కొద్దీ బీమా రంగం కూడా అధిక కేటాయింపులు లేదా పన్ను ప్రోత్సాహకాలు వంటి స్వల్పకాలిక చర్యలకు మించి తన అంచనాలను మారుస్తోంది. దీర్ఘకాలిక వృద్ధిని నడిపించే నిర్మాణాత్మక సంస్కరణల కోసం చూస్తోంది. బీమా వ్యాప్తిని విస్తరించడం, పదవీ విరమణ భద్రతను బలోపేతం చేయడం, అన్ని విభాగాలలో రిస్క్ రక్షణను మెరుగుపరచడంపై ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని పరిశ్రమ వాటాదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
