Budget 2024 LIVE: నేడు మోదీ 3.0 తొలి బడ్జెట్‌.. ఎప్పటికప్పుడు లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..

|

Updated on: Jul 23, 2024 | 8:33 AM

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ కావడతో సర్వత్రా...

Budget 2024 LIVE: నేడు మోదీ 3.0 తొలి బడ్జెట్‌.. ఎప్పటికప్పుడు లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..
Nirmala Sitharaman (file Photo)

LIVE NEWS & UPDATES

  • 23 Jul 2024 08:33 AM (IST)

    ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సిడీ..

    2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే వాహనాల్లో 30 వాతం ఎలక్ట్రిక్‌వే ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు డిస్కౌంట్లు, వెసులుబాట్లూ కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో ఈవీల విస్తరణకు కేంద్రం సబ్సిడీల స్కీములు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • 23 Jul 2024 07:19 AM (IST)

    సరికొత్త రికార్డు..

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. ఈరోజు ప్రవేశపెట్టనున్న బడ్జట్‌తో కలిపి మొత్తం వరుసగా ఏడు ఫుల్ టైమ్ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ అరుదైన రికార్డును క్రియేట్ చేయనున్నారు.

  • 23 Jul 2024 06:54 AM (IST)

    3 గంటల పాటు ప్రసంగం..

    ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మంత్రి ప్రసంగం ఏకంగా 2 నుంచి 3 గంటల పాటు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మధ్యంతర బడ్జెట్‌ సమయంలో ఆమె తన ప్రసంగాన్ని కేవలం 87 నిమిషాలు మాత్రమే చేసింది. తాజాగా బడ్జెట్‌కు సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేయనున్న నేపథ్‌యంలోనే బడ్జెట్‌ ప్రసంగం ఎక్కువ సేపు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

  • 23 Jul 2024 06:48 AM (IST)

    ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుందా.?

    ఎన్టీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదనే విషయం తెలిసిందే. దీంతో కూటమిలోని కొన్ని పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. మరి ఇలాంటి తరుణంలో ప్రవేశ పెడుతోన్న బడ్జెట్‌లో కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఏమైనా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారా.? ఆయా రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేస్తారా.? అన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Budget Session 2024 Parliament LIVE: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ కావడతో సర్వత్రా ఉత్కంఠ నెలకొది. తమను మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలపై ఎలాంటి వరాలు కురిపించనున్నారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఎక్కువగా మౌలిక సదుపాయాలు, వ్యవసాయంపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే పన్నుల శ్లాబుల విషయంలో కూడా ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ చూడండి..

బడ్జెట్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టీవీ9లో చూడండి..

Published On - Jul 23,2024 6:45 AM

Follow us
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!