Ultraviolette F77 E-Bike: ఈ-బైక్ బ్యాటరీ టెన్షన్లన్నింటికీ చెక్.. ఏకంగా 8లక్షల కి.మీ. వరకూ వారంటీ..
అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ నుంచి వచ్చిన ఎఫ్77 బైక్‌పై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ బైక్ లోని బ్యాటరీపై అదనపు వారంటీని కంపెనీ ప్రకటించింది. ఏకంగా 8లక్షల కిలోమీటర్ల వరకూ బ్యాటరీకి వారంటీ ఉంటుంది. ఈ కొత్త వారంటీలో మూడు ప్యాకేజీలు ఉన్నాయి. యూవీ కేర్, యూవీ కేర్ ప్లస్, యూవీ కేర్ మ్యాక్స్. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ బాగా ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ బైక్ లు అదే తరహాలో విక్రయాలు పెంచేలా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా గ్లోబల్ ఈవీ కంపెనీ అయిన అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. తన ఫ్లాగ్ షిప్ అయిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయిన ఎఫ్77 బ్యాటరీపై ఈ ఆఫర్ అందిస్తోంది. 8లక్షల కిలోమీటర్ల వరకూ డ్రైవ్ ట్రెయిన్ వారంటీని పొడిగించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆఫర్ ఇది..
అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ నుంచి వచ్చిన ఎఫ్77 బైక్‌పై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ బైక్ లోని బ్యాటరీపై అదనపు వారంటీని కంపెనీ ప్రకటించింది. ఏకంగా 8లక్షల కిలోమీటర్ల వరకూ బ్యాటరీకి వారంటీ ఉంటుంది. ఈ కొత్త వారంటీలో మూడు ప్యాకేజీలు ఉన్నాయి. యూవీ కేర్, యూవీ కేర్ ప్లస్, యూవీ కేర్ మ్యాక్స్. యూవీ కేర్, యూవీ కేర్ ప్లస్ ప్యాకేజీలో రెండింతలు కిలోమీటర్ల కాగా.. యూవీ కేర్ మ్యాక్స్ లో ఎనిమిది రెట్లు అధిక కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ సందర్భంగా అల్ట్రావయోలెట్ సీటీఓ, సహ వ్యవస్థాపకుడు నీరజ్ రాజ్ మోహన్ మాట్లాడుతూ బ్యాటరీ, డ్రైవ్‌ట్రెయిన్ కొత్త వారంటీ స్ట్రక్చర్ బ్యాటరీ ఇంజనీరింగ్‌లో కఠినమైన ప్రయత్నాల ద్వారా అందించామన్నారు. ఇందులో ఐదు స్థాయిల భద్రత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న బ్యాటరీ సాంకేతికతతో సహా కచ్చితమైన ధ్రువీకరణ ప్రక్రియలు ఉన్నాయన్నారు.
ఎఫ్77 టెస్ట్ మోటార్‌సైకిళ్లలో ఒకటి ఇటీవలే 100,000 కిలోమీటర్లను అధిగమించింది. దాని అసలు రేటింగ్ సామర్థ్యంలో 95 శాతానికి పైగా నిలుపుకుంది. ఇటీవలి పరీక్ష తర్వాత, ఇదే మోటార్‌సైకిల్ అసాధారణమైన ఐడీసీ (ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) శ్రేణిని ప్రదర్శించింది, కంపెనీ ప్రకారం దాదాపు రూ. 441,000 విలువైన ఇంధన ఆదాతో పాటు సింగ్ చార్జ్ పై 304 కిలోమీటర్ల పరిధిని అందించింది.
అల్ట్రావయోలెట్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా తాము బ్యాటరీ సాంకేతికత, ప్రమాణాలపై కృషి చేసి, గణనీయంగా అభివృద్ధి సాధించామన్నారు. ఈ కొత్త ఆఫర్‌తో ఎఫ్77 కేవలం వేగంగా, సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా సొంతం చేసుకునేందుకు భరోసానిస్తుందని అన్నారు. అల్ట్రావయోలెట్ (యూవీ) అనేది భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్‌ఫారమ్‌లు, బ్యాటరీ టెక్నాలజీలో ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ అల్ట్రావయోలెట్ కంపెనీకి ఎక్సోర్ ఎన్వీ లింగొట్టో, క్వాల్కమ్ వెంచర్స్, జోహో కార్పొరేషన్, టీవీఎస్ మోటార్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీల మద్దతు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




