Success Story: చదివింది 8వ తరగతే.. కానీ సంపాదన మాత్రం రూ.10 వేల కోట్లు.. ఆయన ఎవరో తెలుసా?

దేశంలో చాలా మంది పేరుమోసిన వ్యాపారవేత్తలు ఉన్నారు. అనేక మంది కనీసం పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేని వారు కూడా ఈ రోజుల్లో కోట్లాది రూపాయలకు యజమానులుగా ఉన్నారు. పెద్దగా చదువుకోని వారు కూడా వ్యాపార రంగంలో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. అటువంటి వారు నేడు బిలియన్ల విలువైన కంపెనీలకు..

Success Story: చదివింది 8వ తరగతే..  కానీ సంపాదన మాత్రం రూ.10 వేల కోట్లు.. ఆయన ఎవరో తెలుసా?
Bikaji Bhujia
Follow us
Subhash Goud

|

Updated on: Apr 12, 2024 | 5:04 PM

దేశంలో చాలా మంది పేరుమోసిన వ్యాపారవేత్తలు ఉన్నారు. అనేక మంది కనీసం పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేని వారు కూడా ఈ రోజుల్లో కోట్లాది రూపాయలకు యజమానులుగా ఉన్నారు. పెద్దగా చదువుకోని వారు కూడా వ్యాపార రంగంలో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. అటువంటి వారు నేడు బిలియన్ల విలువైన కంపెనీలకు యజమానులుగా ఉన్నారు. దేశంలోని విజయవంతమైన వ్యాపారవేత్త శివ రతన్ అగర్వాల్. ఈ రోజు 72 సంవత్సరాల వయస్సులో రూ. 13,430 కోట్ల విలువైన కంపెనీకి యజమాని. ఇటీవల అతను ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్ 2024లో కూడా చేరారు.

శివ రతన్ అగర్వాల్ బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. అలాగే ఛైర్మన్. 8వ తరగతి వరకే చదివి మానేశాడు. శివరతన్ సంస్థ నేడు చిరుధాన్యాల మార్కెట్‌లో పెప్సీకో, ఫ్రిటో-లే వంటి పెద్ద కంపెనీలతో పోటీ పడుతున్నారు. అతను భారతదేశంలోని ప్రతి ఇంటికి బికాజీ నమ్‌కీన్‌ను ఎలా తీసుకువచ్చాడో తెలుసుకుందాం.

బికాజీ కథ 80 సంవత్సరాల క్రితం 1940 సంవత్సరంలో రాజస్థాన్‌లోని బికనీర్ నగరంలో ఒక చిన్న కొలిమిలో భుజియాను తయారు చేయడం ద్వారా ప్రారంభమైంది. అతని దుకాణం పేరు అంతకుముందు ‘హల్దీరామ్ భుజివాలా’, దీనిని గంగాభీషన్ ‘హల్దీరామ్’ అగర్వాల్ ప్రారంభించారు. మొదట్లో ఇది చిన్న దుకాణం. అదే దుకాణంలో భుజియా తయారు చేసి విక్రయించారు. హల్దీరామ్ స్వయంగా తన చేతులతో భుజియాను తయారు చేసేవాడు. అతని దుకాణం క్రమంగా నగరం అంతటా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత నగరాలు, రాష్ట్రాలకు విస్తరించింది. హల్దీరామ్ తర్వాత కోల్‌కతా వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. శివరతన్ అగర్వాల్ ‘హల్దీరామ్’ భుజివాలా మనవడు. అతని తండ్రి మూల్‌చంద్ కూడా రాజస్థాన్‌లో భుజియా తయారీ వ్యాపారం చేసేవాడు. 8వ తరగతి పాసయ్యాక చదువుపై ఆసక్తి లేకపోవడంతో చదువు మానేసి తండ్రితో కలిసి భుజియా తయారీలో పని చేశాడు.

శివరతన్ బికాజీకి పునాది వేశాడు హల్దీరామ్

తర్వాత ‘హల్దీరామ్ భుజివాలా’ వ్యాపారం అతని కొడుకు మూల్‌చంద్ అగర్వాల్‌కి చేరింది. మూల్‌చంద్ అగర్వాల్‌కు శివకిసన్ అగర్వాల్, మనోహర్ లాల్ అగర్వాల్, మధు అగర్వాల్, శివరతన్ అగర్వాల్ అనే నలుగురు కుమారులు ఉన్నారు. శివకిసన్, మనోహర్‌లాల్, మధు కలిసి భుజియా కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు. దానికి వారి తాత పేరు – ‘హల్దీరామ్’ అని పేరు పెట్టారు. కానీ ముగ్గురు సోదరులతో కలిసి వ్యాపారం చేయకుండా, నాల్గవ కుమారుడు శివరతన్ అగర్వాల్ 1980లో కొత్త బ్రాండ్‌ను ప్రారంభించాడు. దానికి బికాజీ అని పేరు పెట్టాడు.

నికర విలువ రూ. 10,000 కోట్ల కంటే ఎక్కువ

శివరతన్ అగర్వాల్ బికాజీ బ్రాండ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్. అతని కంపెనీ భుజియా, నమ్కీన్, క్యాన్డ్ స్వీట్లు, పాపడ్, అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. బికాజీ భారతదేశపు మూడవ అతిపెద్ద సాంప్రదాయ స్నాక్స్ తయారీదారు. బికాజీ 1992లో నేషనల్ అవార్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఎక్సలెన్స్‌తో సత్కరం అందుకున్నాడు. నేడు బికాజీ 250కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. బికాజీ ఉత్పత్తులను విదేశాలకు కూడా పంపుతారు. వారి ఉత్పత్తులలో పాశ్చాత్య స్నాక్స్, ఇతర ప్రోడక్ట్‌లు కూడా ఉన్నాయి. నేడు బికాజీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా 8 లక్షల కంటే ఎక్కువ దుకాణాలలో అందుబాటులో ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం.. శివరతన్ అగర్వాల్ నికర విలువ దాదాపు రూ.10,830 కోట్లు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి