AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit card: ఉపయోగంలో లేని క్రెడిట్‌ కార్డ్‌ను ఎలా క్లోజ్‌ చేయాలో తెలుసా..?

ఒకొనొక సందర్భంగా నిరూపయోగంగా ఉన్న కార్డులను తొలగించుకోవాలనే ఆలోచన మనకు వస్తుంది. మరి అలాంటి సమయాల్లో కార్డును ఎలా క్లోజ్‌ చేయాలి.? ఇందుకోసం ఎలాంటి విధానాన్ని పాటించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్‌లైన్‌ సైట్స్‌లో క్రెడిట్ కార్డులతో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో చాలా మంది క్రెడిట్‌ కార్డులను తీసుకుంటున్నారు. అయితే...

Credit card: ఉపయోగంలో లేని క్రెడిట్‌ కార్డ్‌ను ఎలా క్లోజ్‌ చేయాలో తెలుసా..?
Creditcard
Narender Vaitla
|

Updated on: Apr 12, 2024 | 5:23 PM

Share

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డులను ఇవ్వడానికి ఎన్నో రకాల అంశాలను పరిగణలోకి తీసుకున్న బ్యాంకులు ప్రస్తుతం మాత్రం పెరిగిన పోటీ నేపథ్యంలో క్రెడిట్ కార్డులను సులభంగా ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకులు రకరకాల ఆఫర్లతో కూడిన క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. దీంతో అవసరానికి మించి క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది.

అయితే ఒకొనొక సందర్భంగా నిరూపయోగంగా ఉన్న కార్డులను తొలగించుకోవాలనే ఆలోచన మనకు వస్తుంది. మరి అలాంటి సమయాల్లో కార్డును ఎలా క్లోజ్‌ చేయాలి.? ఇందుకోసం ఎలాంటి విధానాన్ని పాటించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్‌లైన్‌ సైట్స్‌లో క్రెడిట్ కార్డులతో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో చాలా మంది క్రెడిట్‌ కార్డులను తీసుకుంటున్నారు. అయితే ప్రతీ ఏటా క్రెడిట్ కార్డ్‌ చార్జీ చెల్లించడంలో మాత్రం ఇబ్బందిగా మారుతుంది. అందుకే అవసరం లేని కార్డులను క్లోజ్‌ చేయాలనుకుంటారు.

మీ క్రెడిట్ కార్డును ఒకవేళ క్లోజ్‌ చేయాలనుకుంటే ముందుగా మీ బ్యాంక్‌ కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. అనంతరం క్రెడిట్ కార్డును క్లోజ్‌ చేయాలని అనుకుంటున్నట్లు కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌కు తెలియజేయాలి. కార్డ్‌ క్లోజ్‌ చేయడానికి గల కారణం ఏంటన్న ప్రశ్నకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ మెయిల్‌ ఐడీ, పుట్టిన తేదీ వంటి వివరాలను అడుగుతారు. ఇక ఆన్‌లైన్‌లో కూడా కార్డ్‌ను క్లోజ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం క్రెడిట్ విభాగానికి సంబంధించిన వెడ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత లింక్‌ ఓపెన్‌ చేయడం ద్వారా కార్డ్‌ను క్లోజ్ చేసుకోవచ్చు.

అయితే మీ కార్డును క్లోజ్‌ చేయాలనుకునే ముందు కొన్ని విషయాలు గమనించాలి. ముందుగా మీ కార్డ్‌పై ఏమైనా డ్యూ ఉంటే వెంటనే చెల్లించాలి. ఒకవేళ చెల్లించకుండా కార్డును క్లోజ్‌ చేస్తే సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వడ్డీ కూడా పడుతుంది. ఇక రీడిమ్‌ పాయింట్స్‌ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటిని ఉపయోగించుకోవాలి. ఇక మీ క్రెడిట్‌ కార్డ్‌పై ఏవైనా ఈఎమ్‌ఐ పేమెంట్స్, ఆటో డెబిట్ ఉన్నాయా చూసుకొని వాటిని క్లోజ్‌ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..