TVS Radeon: సూపర్‌ కలర్‌ ఆప్షన్‌తో నయా వేరియంట్‌ రిలీజ్‌ చేసిన టీవీఎస్‌.. ధరెంతో తెలుసా..?

భారతదేశంలో ఇటీవల కాలంలో బడ్జెట్‌ బైక్స్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమకు అనువుగా ఉండే బైక్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు బడ్జెట్‌ ఫ్రెండ్లీ బైక్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. హోండా, హీరో, టీవీఎస్‌ వంటి కంపెనీలు బడ్జెట్‌ బైక్స్‌ అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్‌ మోటర్‌ తన బడ్జెట్‌ బైక్‌ అయిన రేడియన్‌లో కొత్త బేస్‌ వేరియంట్‌ను రిలీజ్‌ చేసింది.

TVS Radeon: సూపర్‌ కలర్‌ ఆప్షన్‌తో నయా వేరియంట్‌ రిలీజ్‌ చేసిన టీవీఎస్‌.. ధరెంతో తెలుసా..?
Tvs Radeon
Follow us

|

Updated on: Oct 08, 2024 | 7:48 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో బడ్జెట్‌ బైక్స్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమకు అనువుగా ఉండే బైక్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు బడ్జెట్‌ ఫ్రెండ్లీ బైక్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. హోండా, హీరో, టీవీఎస్‌ వంటి కంపెనీలు బడ్జెట్‌ బైక్స్‌ అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్‌ మోటర్‌ తన బడ్జెట్‌ బైక్‌ అయిన రేడియన్‌లో కొత్త బేస్‌ వేరియంట్‌ను రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా కొనుగోలుదారులకు సరసమైన ధరలో ఉండేలా ఈ బేస్‌ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. టీవీఎస్‌ రేడియాన్‌ ఇప్పుడు ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్). ఇది బైక్‌ వెర్షన్ కంటే రూ. 2,525 తక్కువగా ఉంది. ముఖ్యంగా బేస్ వేరియంట్ మిడ్-టైర్ మోడల్ కంటే రూ. 17,514 తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో టీవీఎస్‌ రేడియాన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కొత్త బేస్ మోడల్ కాంట్రాస్ట్ కోసం బ్రాంజ్ ఇంజిన్ కవర్తో ఆల్-బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై  టీవీఎస్‌ రేడియాన్‌ బ్రాండ్‌ వస్తుంది. ఈ అప్‌డేట్స్‌ కాకుండా ఈ బైక్ సరికొత్త డిజైన్‌తో ఫుల్‌ బ్లాక్ షేడ్‌తో సహా మొత్తం ఏడు రంగు ఎంపికలతో వస్తుంది. టీవీఎస్‌ రేడియాన్‌ బైక్‌ 109.7 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ 7,350 ఆర్‌పీఎం వద్ద 8.08 బీహెచ్‌పీ, 4,500 ఆర్‌పీఎం వద్ద 8.7 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.4 స్పీడ్ గేర్బాక్స్‌తో వచ్చే ఈ బైక్ సింగిల్ క్రెడిల్ ట్యూబ్యులర్ ఫ్రేమ్‌పై నిర్మించారు. 

టీవీఎస్‌ రేడియాన్‌ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్స్‌ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ బైక్‌ 10-లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌తో వస్తుంది. ఈ బైక్‌ డ్రమ్ వేరియంట్‌ బరువు 113 కిలోలు ఉంటే డిస్క్ వేరియంట్‌ బరువు 115 కిలోలు ఉంటుంది. ఈ బైక్ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్సుతో ఆకట్టుకుంటుంది. అందువల్ల రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. బేస్ వేరియంట్లో 130 మిమీ ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. టాప్ మోడల్లో 240 మిమీ ఫ్రంట్ డిస్క్ లభిస్తుంది. వెనుక బ్రేక్ సెటప్ అన్ని వేరియంట్లలో 110 ఎంఎం డ్రమ్‌తో వస్తుంది. ఈ బైక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది. అలాగే కలర్ ఎల్‌సీడీ స్క్రీన్, యూఎస్‌బీ పోర్ట్స్‌ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..