Gold and Silver Cost Today: పండగ సీజన్ వేళ దిగివస్తున్న వెండి.. స్వల్ప ఊరటనిచ్చిన పసిడి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
గత రెండు నెలలు నుంచి పసిడి ధరలు పైపైకి పోతూనే ఉన్నాయి. రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణించడం డాలర్ విలువ బలపడంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. నేడు, బంగారం , వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దసరా పండగ వస్తుందంటే చాలు ఎక్కువ మంది బంగారం, వెండి కొనాలనే ఆసక్తి ఉంటుంది. మహిళలు బంగారం నగలు కొనే సంప్రదాయాన్ని పాటిస్తారు. దసరా నవరాత్రులు మొదలయ్యాయి. ఈ పండగ సీజన్‌లో బంగారానికి, వెండికి డిమాండ్ ఉన్నా.. మరోవైపు ధరలు పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత రెండు నెలలు నుంచి పసిడి ధరలు పైపైకి పోతూనే ఉన్నాయి. రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణించడం డాలర్ విలువ బలపడంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. నేడు, బంగారం , వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారెట్ల బంగారం రూ. 10 మేర తగ్గి ప్రస్తుతం 10. గ్రాముల బంగారం ధర రూ. 70,990వద్ద ఉంది. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ రేటు కూడా రూ. 10 మేర తగ్గి 10 గ్రాములకు రూ. 77,440లు వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10. గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల రూ. 71,350 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 77,100 వద్ద కొనసాగుతోంది.
వెండి ధర:
బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే లోహం వెండి. గత 10 రోజులుగా వెండి ధరలు గరిష్టంగానే కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర కేజీ లక్ష లోపు అంటే రూ. 97 వేలు ఉండగా.. హైదరాబాద్ నగరంలో మాత్రం లక్ష దాటింది. తాజాగా హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,03,000లుగా కొనసాగుతోంది.
అయితే ఈ బంగారం, వెండి ధరలు స్థానిక పన్నులను బట్టి.. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. అందుకనే పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..