AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump vs Musk: ట్రంప్‌పై సెటైర్లు.. కుప్పకూలిన టెస్లా షేర్లు

Trump vs Musk: ఎలాన్‌ మస్క్‌ తీరు విసుగు కలిగిస్తోందని, అందుకే తాను అతన్ని వెళ్లమని కోరానని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌ లో పోస్ట్‌ చేశారు. ఎవరూ కోరుకోని ఎలక్ట్రిక్ కార్లను అందరూ కొనేలా చేసిన..

Trump vs Musk: ట్రంప్‌పై సెటైర్లు.. కుప్పకూలిన టెస్లా షేర్లు
Subhash Goud
|

Updated on: Jun 06, 2025 | 10:34 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య చెలరేగిన వివాదం టెస్లా షేర్లపై పెను ప్రభావాన్ని చూపింది. గురువారం ఒక్కరోజే టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పతనమయ్యాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ నుంచి 150 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైపోయింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో నాలుగు సార్లు టెస్లా షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఈ భారీ పతనంతో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి, రోజు ముగిసే సమయానికి 916 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది. కంపెనీ చరిత్రలో ఒక్కరోజులో ఇంతటి భారీ నష్టాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా, మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో ఈ వివాదం మొదలైంది. మస్క్‌తో వ్యవహరించడం కష్టంగా మారిందని, ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

ఎలాన్‌ మస్క్‌ తీరు విసుగు కలిగిస్తోందని, అందుకే తాను అతన్ని వెళ్లమని కోరానని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌ లో పోస్ట్‌ చేశారు. ఎవరూ కోరుకోని ఎలక్ట్రిక్ కార్లను అందరూ కొనేలా చేసిన అతడి ఈవీ ఆదేశాన్ని తాను తీసివేశానని, ఈ విషయం అతనికి చాలా నెలలక్రితమే తెలుసని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయినా అతడు పిచ్చివాడిలా ప్రవర్తించాడు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ ఎలాన్, తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నామని, ఇకపై ఉంటాయో లేదో తనకు తెలియదని అన్నారు. కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రెడిట్స్ లేకపోవడంపై మస్క్ అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే ఎలాన్‌ మస్క్ ఎక్స్ వేదికగా “ఏదైతేనేం” అని క్లుప్తంగా స్పందించారు. అంతేకాకుండా తాను లేకపోతే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని,, డెమొక్రాట్లు హౌస్‌ను నియంత్రించేవారు, సెనేట్‌లో రిపబ్లికన్లు 51-49 వద్ద ఉండేవారు అంటూ మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Trump-Musk: మాటల యుద్ధం.. ట్రంప్‌పై మస్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఇటీవలి కాలంలో ఎలాన్ మస్క్ రాజకీయంగా మరింత క్రియాశీలక వైఖరిని తీసుకుంటున్నారు. కొత్త బడ్జెట్ బిల్లును ‘అసహ్యకరమైన చెత్తబిల్లు’ అని అభివర్ణించిన ఆయన, దానిని సమర్థించే చట్టసభ సభ్యులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే బృందానికి అధిపతిగా ట్రంప్ ప్రభుత్వంలో పాలుపంచుకున్నప్పటి వైఖరికి ఇది భిన్నంగా ఉంది. ఆ ప్రత్యేక పదవిలో ఆయన పదవీకాలం మే 30తో ముగిసింది. టెస్లా అమ్మకాల గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ మే నెలలో కంపెనీ షేర్లు 22 శాతం మేర పెరిగాయి. అయితే, మస్క్, ట్రంప్ మధ్య బహిరంగ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఈ వారం ఒక్కరోజే స్టాక్ విలువ దాదాపు 18 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్లా షేర్లు దాదాపు 30 శాతం క్షీణించాయి. డిసెంబర్ 18న నమోదైన గరిష్ట స్థాయి 488.54 డాలర్ల నుంచి ఇది తీవ్ర పతనం.

ఇది కూడా చదవండి: Trump-Musk: నిన్నటి వరకు జాన్‌ జిగ్రీలు.. ఇప్పుడు బద్ద శత్రువులు.. ఇంతకీ ఎప్‌స్టీన్‌ ఎవరు?