AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Truck: దేశంలో ఎలక్ట్రిక్‌ ట్రక్కులు.. అమెరికా సంస్థతో జతకట్టిన గుజరాత్‌ కంపెనీ ట్రిటాన్

Electric Truck: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తు్న్నాయి. గత కొంత కాలంగా చమురు ధరలు పెరుగుతుండటంతో ..

Electric Truck: దేశంలో ఎలక్ట్రిక్‌ ట్రక్కులు.. అమెరికా సంస్థతో జతకట్టిన గుజరాత్‌ కంపెనీ ట్రిటాన్
Subhash Goud
|

Updated on: May 02, 2022 | 6:48 PM

Share

Electric Truck: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తు్న్నాయి. గత కొంత కాలంగా చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక వాహనదారులు కూడా ఆ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కార్లు, స్కూటర్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీతో జతకట్టిన గుజరాత్‌ (Gujarat) కంపెనీ ట్రిటాన్.. దేశంలోనే మొట్టమొదటి ఈ-ట్రక్కును గుజరాత్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకులు హిమాన్షు పటేల్ (Himanshu Patel)ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. ఈ ఏడాది నుంచే ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తయారీ యూనిట్‌ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

దీనికి సంబంధించిన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం బ్యాటరీలు, సర్క్యూట్‌లు, సెమీకండక్టర్‌లు, కాంపోనెంట్‌లతో సహా 9 కంపెనీల విడిభాగాల తయారీ సంస్థలతో జతకట్టినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే ఈ-ట్రక్కులను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం 3.7 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ తయారీ ప్లాంట్‌ ఉంటుందని తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: మే 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. పలు ప్రొడక్టులపై 80 శాతం వరకు డిస్కాంట్‌..!

Royal Enfield: వాహనదారుల భద్రత కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కీలక నిర్ణయం.. ఇటాలియన్ బ్రాండ్ ఆల్పైన్‌స్టార్స్‌తో ఒప్పందం!

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?