AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI: జియో, ఎయిర్‌టెల్‌ రూ.249 ప్లాన్ తొలగింపుపై స్పందించిన ట్రాయ్‌.. ఏం చెప్పిందో తెలుసా?

TRAI: టెలికాం కంపెనీలు రూ. 249 రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించడంపై వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇంటర్నెట్‌లో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇది దాదాపు ఒక నెల పాటు ఇంటర్నెట్, అపరిమిత కాల్ ఉన్నందున సామాన్యులకు సైతం ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా..

TRAI: జియో, ఎయిర్‌టెల్‌ రూ.249 ప్లాన్ తొలగింపుపై స్పందించిన ట్రాయ్‌.. ఏం చెప్పిందో తెలుసా?
Subhash Goud
|

Updated on: Sep 14, 2025 | 6:50 PM

Share

TRAI: గత నెలలో దేశంలోని రెండు ప్రధాన టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ తమ చౌకైన 1 GB రోజువారీ డేటా ప్లాన్‌ను తొలగించినప్పుడు తమ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకున్న లక్షలాది మంది షాక్ అయ్యారు. రూ. 249 రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించడంపై వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇంటర్నెట్‌లో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇది దాదాపు ఒక నెల పాటు ఇంటర్నెట్, అపరిమిత కాల్ ఉన్నందున సామాన్యులకు సైతం ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ విషయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుండి నివేదిక కోరింది. ఆ రీఛార్జ్ ప్లాన్ తొలగింపుపై స్పందించాలని TRAI జియో, ఎయిర్‌టెల్‌లను కోరింది.

ఇది కూడా చదవండి: Metro Rail: 11 స్టేషన్లు.. 17కి.మీ.. రూ. 2,991 కోట్లు వ్యయం.. మరో కొత్త మెట్రో రైల్‌ లైన్

టెలికాం కంపెనీలు ఇలా ఎందుకు చేశాయో, దాని ప్రభావం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో TRAI తెలుసుకోవాలనుకుంటోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం గత నెలలో వెలుగులోకి వచ్చింది. జియో, ఎయిర్‌టెల్ తమ ప్రసిద్ధ రూ. 249 మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేశాయి. ఈ ప్లాన్ రోజుకు 1 GB డేటా, కాలింగ్, SMS ప్రయోజనాలను అందించింది. జియో ప్లాన్ చెల్లుబాటు 28 రోజులు. అదే ఎయిర్‌టెల్ ప్లాన్ 24 రోజులు. మొదట జియో వెబ్‌సైట్ నుండి రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ కూడా ప్లాన్‌ను తొలగించింది.

ఇవి కూడా చదవండి

తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు: ట్రాయ్‌

ఇదిలా కంపెనీల ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్లపై తలెత్తిన వివాదంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పందించింది. ఈ విషయంలో ప్రస్తుతం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రాయ్‌ వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ కంపెనీలు రూ.249 ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ తొలగింపుపై తమ సమాధానం ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. ఈ కంపెనీల్లో ఒక ప్లాన్ ఉపసంహరణను ధ్రువీకరిస్తూ అవసరమైన పత్రాలను ట్రాయ్‌కి సమర్పించగా.. మరొక కంపెనీ ఈ ప్లాన్‌ ఇప్పటికీ అందుబాటులో ఉందని, కానీ స్టోర్స్‌లో మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఈ ప్లాన్‌ జియో రిటైల్‌ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. మరో వైపు ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి రూ.249 ఎంట్రీ ప్లాన్‌ను తొలగించింది. రెండు కంపెనీలు సమర్పించిన సమాధాలను పరిశీలించి.. రెగ్యులేటరీ ప్రమాణాల ఆధారంగా దర్యాప్తు చేస్టున్నట్లు ట్రాయ్‌ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Vehicle Colour: ఏ రాశి వారికి ఎలాంటి రంగు వాహనం మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి: 5 ఏళ్లలో అద్భుతాలు చేసిన 15 రూపాయల స్టాక్‌.. రూ.1 లక్షకు రూ.12 కోట్ల రాబడి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి