Electric bike: క్రటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ 2.0.. ఇప్పుడు సింగిల్ చార్జ్‌పై 180 కి.మీ., అప్ గ్రేడెడ్ వెర్షన్ పూర్తి వివరాలు ఇవి..
ఇప్పటికే అందుబాటులో ఉన్న టోర్క్ క్రటోస్ ఆర్ మోడల్ ను కంపెనీ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి రీలాంచ్ చేసింది. ప్రస్తుతం ఉన్న రేంజ్ ను పెంచుతూ కొత్త ఎకో ప్లస్ డ్రైవింగ్ మోడ్ ను తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం అర్బన్ పరిధిలో ఈ బైక్ సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. అయితే టోర్క్ కంపెనీ అయితే ఏకంగా 180 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ప్రకటించింది.

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు పెద్ద సంఖ్యలో లాంచ్ అవుతున్నాయి. ఈ స్కూటర్లతో పోల్చితే బైక్ లు ఆ స్థాయిలో మార్కెట్లోకి రావడం లేదు. కొన్ని టాప్ బ్రాండ్లు మాత్రమే ఎలక్ట్రిక్ బైక్ లను లాంచ్ చేసింది. అందులో టోర్క్ మోటార్స్ ఒకటి. ఇప్పటికే అందుబాటులో ఉన్న టోర్క్ క్రటోస్ ఆర్ మోడల్ ను కంపెనీ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి రీలాంచ్ చేసింది. ప్రస్తుతం ఉన్న రేంజ్ ను పెంచుతూ కొత్త ఎకో ప్లస్ డ్రైవింగ్ మోడ్ ను తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం అర్బన్ పరిధిలో ఈ బైక్ సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. అయితే టోర్క్ కంపెనీ అయితే ఏకంగా 180 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ప్రకటించింది.
టోర్క్ క్రటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్..
ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 9కేడబ్ల్యూ అగ్జియల్ ఫ్లక్స్ మోటార్ బ్యాటరీకి జోడించి ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 38ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అది కూడా 96శాతం ఎఫిషీయన్సీతో. దీనిలోని బ్యాటరీ ఐపీ67 రేటింగ్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 180 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని టోర్క్ కంపెనీ ప్రకటించింది.
కొత్త మోడ్ ఏంటంటే..
టోర్క్ క్రటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ లో ఇప్పటికే ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. వీటి సాయంతో బైక్ ప్రయాణం చేయగలగుతుంది. అయితే వీటితో రేంజ్ సక్రమంగా రావడం లేదని వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఓ మోడ్ ను బైక్ కు జోడించింది. అది ఎకో ప్లస్ డ్రైవింగ్ మోడ్. దీనిని ఎనేబుల్ చేస్తే కేవలం గంటకు 35కిలోమీటర్ల వేగంతోనే బైక్ ప్రయాణించగలుగుతుంది. ఇది సిటీ పరిధికి సరిపోతుంది. దీంతో అధిక రేంజ్ లభిస్తుంది. సింగిల్ చార్జ్ పై ఏకంగా 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టోర్క్ కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న బైక్ లకు కూడా..
ప్రస్తుతం టోర్క్ క్రటోస్ బైక్ లను కలిగి ఉన్న వినియోగదారులు కూడా ఈ ఎకో ప్లస్ మోడ్ ను తీసుకోవచచని, అందుకోసం సర్వీస్ సెంటర్ ను సంప్రదించాలని టోర్క్ మోటార్స్ ఫౌండర్ అండ్ సీఈఓ కపిల్ షెల్కే చెప్పారు. ఈ ఎకో ప్లస్ రైడింగ్ మోడ్ తో వినియోగదారులు అధిక రేంజ్ పొందగలరని పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే దీనిని ఈ కొత్త మోడ్ ను తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..