AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా దిగివచ్చిన బంగారం ధర.. అదే స్థాయిలో తగ్గిన వెండి.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే…

బంగారం కొనాలనుకునే వారికీ గుడ్‌న్యూస్.. దేశీయ మార్కెట్లో పసిడి ధర భారీగా దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.717 తగ్గింది.

భారీగా దిగివచ్చిన బంగారం ధర.. అదే స్థాయిలో తగ్గిన వెండి.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే...
Balaraju Goud
|

Updated on: Feb 17, 2021 | 6:40 PM

Share

Gold and Silver Rate : బంగారం కొనాలనుకునే వారికీ గుడ్‌న్యూస్.. దేశీయ మార్కెట్లో పసిడి ధర భారీగా దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.717 తగ్గింది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12న తగ్గిన బంగారం ధరలు తర్వాత నాలుగు రోజులు స్థిరంగా కొనసాగింది. మళ్లీ నాలుగు రోజుల తర్వాత పసిడి ధరలు నేల చూపుతు చూస్తున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,102కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రేడ్ కొనసాగింది. అయితే, దేశీయంగా బంగారం అభరణాలు, నాణేలు కొనేవారి సంఖ్య తగ్గడంతో పసిడి ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వెండి కూడా అదే దారిలో పయనించింది. ఇవాళ వెండి ఏకంగా రూ.1,274 మేర తగ్గడంతో బలియన్ మార్కెట్ కేజీ వెండి ధర 68,239 పలికింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 క్షీణించింది. దీంతో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రేటు రూ.47,730కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 పైగా క్షిణించి రూ.43,750కు పడిపోయింది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.1,400 పడిపోయి రూ.73,600కు చేరుకుంది. అయితే, గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్ సుంకం తగ్గించింది. దీంతో దేశంలో బంగారం ధరలు తగ్గువస్తుయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.

ఇదీ చదవండి.. IRMASAT 2021: PGDRMలో ప్రవేశానికి IRMASAT ఎగ్జామ్‏కు ప్రిపేర్ అవుతున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించండి..