State Bank Of India: ఒక్క మిస్డ్ కాల్‌తో పర్సనల్ లోన్ పొందొచ్చు.. ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్.!
State Bank Of India: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు మరో అదిరిపోయే ఆఫర్‌ను అందించింది...
State Bank Of India: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు మరో అదిరిపోయే ఆఫర్‌ను అందించింది. ముఖ్యంగా త్వరితగతిన లోన్ అవసరమయ్యే వారి కోసం ఈ సదుపాయం ఉపయోగపడునుంది. ‘ఎస్‌బీఐ’ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ పేరుతో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎస్‌బీఐ.. కనీస డాక్యుమెంటేషన్‌తో ఖాతాదారులు లోన్‌కు ఆమోదం పొందవచ్చునని తెలిపింది. రుణం కోసం 7208933145 అనే నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం, లేదా 7208933145 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలని సూచించింది.
మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి…
- కనిష్టంగా రుణం రూ. 25,000.. గరిష్టం రూ. 20 లక్షలు పొందొచ్చు
- తక్కువ ప్రాసెసింగ్ ఫీజు
- 9.6 శాతం వడ్డీ రేటు
- కనీస డాక్యుమెంటేషన్
- సెక్యూరిటీ, హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు
- మీ శాలరీ అకౌంట్ ఎస్‌బీఐలో ఉండటంతో పాటు నెలసరి ఆదాయం రూ. 15,000 ఉండాలి
- సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు, పాక్షిక ప్రభుత్వ సర్వీసుల్లో చేస్తున్న వారై ఉండాలి
- జాతీయ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా అర్హులే
కాగా, పూర్తి వివరాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరిన్ని చదవండి:
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…
భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!
All it takes is an SMS, to begin with your personal loan process. SMS <PERSONAL> on 7208933145. To know more: https://t.co/TH5bnGWu1V pic.twitter.com/EJin90BhxV
— State Bank of India (@TheOfficialSBI) February 16, 2021