Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: చౌక.. చౌక.. 2017 జనవరిలో 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు ఎంతో గుర్తుందా..?

పసిడి ప్రియులకు ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. పట్టపగ్గాల్లేకుండా పెరుగుతుంది బంగారం ధర. ట్రంప్ ఎఫెక్ట్‌ తో తగ్గేదే లే అంటుంది. ఇప్పుడే కాదు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్నప్పుడు కూడా బంగారం ధరలు ఇలానే పెరిగాయి. ఆ డేటా ఇప్పుడు చెక్ చేద్దాం...

Gold: చౌక.. చౌక..  2017 జనవరిలో 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు ఎంతో గుర్తుందా..?
Gold Price
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 31, 2025 | 6:18 PM

ఎడాపెడా గోల్డ్‌ రేట్‌ పెరిగిపోతోంది. ట్రంప్‌ చెడామడా మాట్లాడాడంటే…గోల్డ్‌ రేటు రాకెట్‌లా ఆకాశానికి దూసుకుపోతుంది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌కి గోల్డ్‌కి ఏదో తెలియని సంబంధం ఉంది. అసలు ట్రంప్‌కి, గోల్డ్ రేట్లకు సంబంధం ఏంటి? ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పుడల్లా గోల్డ్‌ రేట్లు పెరుగుతాయా? చరిత్ర ఏం చెబుతోంది? గతంలో ఏం జరిగింది? ఇకముందు ఏం జరగబోతోంది? ఇవి నేను చెప్పే మాటలు కావు…ట్రంప్‌కి గోల్డ్‌ రేట్లకు మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఇప్పుడు క్లియర్‌ కట్‌గా తెలుసుకుందాం. మనం ముందుగా 2017లోకి వెళ్దాం. అప్పుడే డొనాల్డ్ ట్రంప్‌, మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అప్పుడు పసిడి రేట్లు ఎలా పరుగులు తీశాయో మీకు సవిరంగా వివరిస్తాం…

  • –2017 జనవరిలో 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు రూ. 3,008
  • — 22 క్యారెట్ల గ్రాము గోల్డ్‌ రేటు రూ. 2,698
  • –ఇక మొదటిసారి ట్రంప్‌ పదవీకాలం ముగిసిపోయేనాటికి అంటే 2020 చివరిలో..–24 క్యారెట్ల గ్రాము గోల్డ్‌ రూ. 5,134
  • –22 క్యారెట్ల గ్రాము గోల్డ్‌ రూ. 4,700
  • –అంటే ట్రంప్‌ ఫస్ట్‌ టెర్మ్‌లో గోల్డ్‌ రేట్లలో 70 శాతం దాకా పెరుగుదల కనిపించింది.

ట్రంప్‌ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో 70 శాతం దాకా గోల్డ్‌ రేట్లు పెరిగాయి. 22 కేరట్ల గ్రాము బంగారం 2017 జనవరిలో రూ. 2,698 ఉంటే, అది ఆ నాలుగేళ్లలో ఏకంగా రూ. 4700కి ఎగబాకింది. ఇక ఆ తర్వాత, ఈమధ్య కాలంలో ట్రంప్‌ ఎఫెక్ట్‌తో, అంటే ఆయన ఎన్నికల ప్రచార సమయంలో, ప్రెసిడెంట్‌గా గెలిచిన సమయంలో, ఈమధ్యే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత… బంగారం రేట్లపై ఆ ప్రభావం ఎలా పడిందో తెలుసుకుందాం…

అక్టోబర్‌ 6, 2024 ట్రంప్‌ ప్రచార సమయంలో గోల్డ్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

–24 క్యారెట్ల గ్రాము బంగారం – రూ. 7784

–22 క్యారెట్ల గ్రాము బంగారం రేటు – రూ. 7137

–అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలుపు – నవంబర్‌ 6, 2024

–ఆ రోజు 24 కేరట్ల గ్రాము బంగారం – రూ. 8,035

–అదే రోజు 22 కేరట్ల గ్రాము బంగారం – రూ. 7,365

అదే రోజున ట్రంప్‌ గెలుపు అంచుల్లో ఉన్నారని తెలియగానే గోల్డ్‌ రేట్లలో ర్యాలీ ప్రారంభమైంది. అప్పటినుంచి పగ్గాలే లేనట్టుగా పరుగులు పెడుతోంది గోల్డ్. ట్రంప్‌ ఏం మాట్లాడినా…గో గో అంటూ గోల్డ్‌ రేట్లు దూసుకుపోతున్నాయి. ఇక ఆ తర్వాత బంగారం రేట్లపై ట్రంప్‌ గారి ఎఫెక్ట్‌ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

–ట్రంప్‌ ప్రమాణ స్వీకారం- జనవరి 20 –ఆ రోజు 24 కేరట్ల గ్రాము బంగారం రేటు – రూ. 8,209

–అదే రోజు 22 కేరట్ల గ్రాము బంగారం రేటు – రూ. 7,525

–ఇవాళ అంటే..జనవరి 31న 24 కేరట్ల గ్రాము బంగారం రేటు – రూ 8,433

–22 కేరట్ల గ్రాము బంగారం రేటు – రూ. 7,730

చూశారుగా. ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేశాక మళ్లీ గోల్డ్‌ రేట్లు దూసుకుపోయాయి. ఇక తాజాగా గోల్డ్‌ రేటు ఆల్‌టైమ్‌ హైకి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు సుమారుగా రూ. 84,500ని టచ్‌ చేసింది. ట్రంప్‌ వార్నింగుల నేపథ్యంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయంటున్నారు అనలిస్టులు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోకుంటే కొలంబియా మీద భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. ఇక ఇండియా మెంబర్‌గా ఉన్న బ్రిక్స్‌కి కూడా ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. డాలర్‌కి బదులుగా వేరే కరెన్సీలో వాణిజ్యం చేస్తే, బ్రిక్స్‌ దేశాల మీద 100 శాతం సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించారు. దీంతో గోల్డ్‌ రేట్లు రాకెట్‌లా పెరిగిపోతున్నాయి

ట్రంప్‌ ఫస్ట్‌ టెర్మ్‌లో గోల్డ్‌ రేట్లు దాదాపు 70 శాతం దాకా పెరిగాయి. మరి రాబోయే నాలుగేళ్లలో అవి ఎంత పెరగబోతున్నాయి అనేది, ఇప్పుడు అందరిని హడలెత్తిస్తోంది. అంటే రాబోయే నాలుగేళ్లలో 10 గ్రాముల గోల్డ్‌ రేటు లక్షా 50వేలు అయ్యే చాన్స్‌ అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి