Personal Loan: అతి తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ కావాలా? అయితే ఇది ఫాలో అయిపోండి..
ఎటువంటి తనఖా అవసరం లేకుండా పెద్ద మొత్తంలో కూడా నగదు మంజూరు అవుతాయి కాబట్టి అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే సాధారణంగా ఇవి అసురక్షిత రుణాలు కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పర్సనల్ లోన్లను తక్కువ వడ్డీతోనే మీరు తీసుకోవచ్చు. అందుకు సంబంధించిన కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాం.

పర్సనల్ లోన్లు అత్యవసర పరిస్థితుల్లో బాగా ఉపకరిస్తాయి. అందుకే ఇటీవల కాలంలో అందరూ వీటిని తీసుకుంటున్నారు. మీరు ఊహించని ఖర్చులను మేనేజ్ చేసుకోవడానికి, మీ వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఇవి సహాయపడతాయి. పైగా ఎటువంటి తనఖా అవసరం లేకుండా పెద్ద మొత్తంలో కూడా నగదు మంజూరు అవుతాయి కాబట్టి అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే సాధారణంగా ఇవి అసురక్షిత రుణాలు కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పర్సనల్ లోన్లను తక్కువ వడ్డీతోనే మీరు తీసుకోవచ్చు. అందుకు సంబంధించిన కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాం.
క్రెడిట్ స్కోర్ ప్రధానం..
పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తులు ఏ వస్తువులు లేదా ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇవి మంజూరవ్వాలంటే మాత్రం వ్యక్తుల క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి. ఇది 750కి పైగా ఉంటే మంచి వడ్డీ రేటుకు లోన్లు సులభంగా మంజూరవుతాయి. ఈ క్రెడిట్ స్కోర్ నే సిబిల్ స్కోర్ అని కూడా పిలుస్తారు. ఈ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు మీ ఆర్థిక స్థితిని, మీరు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని లెక్కిస్తారు. పాత రుణాల చెల్లింపులు, అకౌంట్లో నగదు నిల్వలు, ఏమైనా డిఫాల్టులు ఉన్నాయా? అనే అంశాలను క్రెడిట్ స్కోర్ చూపిస్తుంది. ఈ క్రెడిట్ రేటింగ్ సాధారణంగా 650 నుంచి 850 మధ్య ఉంటుంది. ఎవరికైనా 750 కన్నా ఎక్కువ ఉంటే అది మంచి క్రెడిట్ స్కోర్ గా పరిగణిస్తారు. అప్పుడు తక్కువ వడ్డీకే రుణం పొందుకునే వీలుంటుంది.
రుణదాతలను సరిపోల్చాలి.. సరైన ఆర్థిక ఆఫర్‌ను పొందడానికి ఆన్‌లైన్‌లో వ్యక్తిగత రుణాలను అందించే రుణదాతలను సరిపోల్చడం చాలా ముఖ్యం. మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, చాలా మంది రుణదాతలు తమ ఆర్థిక ఉత్పత్తులు, సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, వడ్డీ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ మొత్తాలు, ఇతర నిబంధనలు, షరతుల ఆధారంగా రుణదాతలను పోల్చడం ముఖ్యం.
ఫీజులు తెలుసుకోండి.. వ్యక్తిగత రుణాల కింద ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ చార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు మరిన్ని వంటి అనేక ఖర్చులు ఉండవచ్చు. అందువల్ల, వినియోగదారులు ముందుగా అన్ని ఖర్చులను తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి.
తిరిగి చెల్లించే సామర్థ్యం.. ఒక చిన్న పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు చేయవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తిరిగి చెల్లించే సామర్థ్యం అంచనా వేయాలి. కస్టమర్‌లు వారి స్థిర నెలవారీ ఆదాయాన్ని తప్పనిసరిగా అంచనా వేయాలి. స్థిర వ్యయాలను తీసివేయాలి. చివరికి ఎంత డబ్బు మిగిలి ఉందో తెలుసుకోవాలి. ఈ గణన ప్రకారం రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని నిర్ణయించాలి.
పర్సనల్ లోన్లపై వడ్డీ రేటు ఇలా..
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వార్షిక వడ్డీ రేటు 10.5శాతం నుంచి 24శాతం వరకూ ఉంటుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు 2.50శాతం ఉంటుంది.
- ఐసీఐసీఐ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 10.50% నుంచి 16.00% నుంచి ఉంటుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు 2.50%శాతం వరకు ఉంటుంది.
- ఎస్ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 10.99% నుంచి 20% వరకూ ఉంటుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు ఉంటుంది.
- కోటక్ మహీంద్రా బ్యాంకులో వార్షిక వడ్డీరేటు10.99% నుంచి మొదలవుతుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు 3% వరకు ఉంటుంది.
- యాక్సిస్ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 10.49% నుంచి 22% వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు ఉంటుంది.
- ఇండస్ఇండ్ బ్యాంక్ వార్షిక వడ్డీ రేటు 10.25% నుంచి 26% వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 3% వరకూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








