AC Cleaning Tips: టెక్నీషియన్‌తో పనిలేదు.. మీ ఏసీ మీరే శుభ్రం చేసుకోవచ్చు.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
అవి సక్రమంగా పనిచేయాలన్నా.. సమర్థంగా ఇంటిని కూల్ చేయాలన్నా వాటిని సమయానుకూలమైన మెయింటెనెన్స్ అవసరం. ముఖ్యంగా ఏసీల్లో ఉండే ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే వాటి పనితీరు దెబ్బతింటుంది. అయితే ప్రతి రెండు మూడు నెలలకు ఏసీ కంపెనీ నుంచి ప్రతినిధులు వచ్చి సర్వీస్ చేయాలంటే ఇబ్బంది.
ఇటీవల కాలంలో ఎయిర్ కండీషనర్(ఏసీ)ల వినియోగం గణనీయంగా పెరిగింది. అంతకంతకూ పెరిగిపోతున్న వేడి వాతావరణం కారణంగా అందరూ ఏసీలను వినియోగిస్తున్నారు. అయితే అవి సక్రమంగా పనిచేయాలన్నా.. సమర్థంగా ఇంటిని కూల్ చేయాలన్నా వాటిని సమయానుకూలమైన మెయింటెనెన్స్ అవసరం. ముఖ్యంగా ఏసీల్లో ఉండే ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే వాటి పనితీరు దెబ్బతింటుంది. అయితే ప్రతి రెండు మూడు నెలలకు ఏసీ కంపెనీ నుంచి ప్రతినిధులు వచ్చి సర్వీస్ చేయాలంటే ఇబ్బంది. అందుకోసం వారు చార్జ్ చేసే మొత్తం కూడా చాలా అధికంగా ఉంటుంది. అయితే ఏసీ క్లీనింగ్‌ను ఇంట్లోనే మనమే నిర్వహించుకునే అవకాశం ఉంది. అందుకు ఉపయోగపడే టిప్స్ మీకు అందిస్తున్నాం.
ఏసీని శుభ్రం చేయడానికి గైడ్..
మీరు ఏసీని శుభ్రం చేయాలని నిర్ణయించుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ప్రధానమైనది పవర్ స్విచ్ఛాఫ్ చేయడం. సాధారణంగా ఏసీలో రెండు యూనిట్లు ఉంటాయి. ఒకటి అవుట్‌డోర్ యూనిట్ కాగా.. మరొకటి ఇన్‌డోర్ యూనిట్. ఈ రెండింటికీ మెయింటెన్స్ చేయడం అసవరం.
ఇన్‌డోర్ యూనిట్.. మీ ఏసీ పవర్ సప్లైని స్విచ్ ఆఫ్ చేసి, ఇన్‌డోర్ యూనిట్ ప్యానెల్‌ని తెరవాలి. ఫిల్టర్లను గుర్తించి దానిని బయటకు తీయాలి. యూనిట్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫిల్టర్‌లు ఉంటే, వాటిని ఒక్కొక్కటిగా తీయాలి. దానికి సాధారణంగా దుమ్మూ, ధూళి పట్టి ఉంటుంది. దానిని తొలగించడానికి టూత్ బ్రష్ తీసుకోండి. ఎవాపొరేటర్‌ను సున్నితంగా శుభ్రం చేయాలి. ఎవాపొరేటర్ కాయిల్ పదునైన రెక్కలు మీ చేతి చర్మాన్ని కత్తిరించగలవు కాబట్టి మీరు దీన్ని చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. టూత్ బ్రష్ ఉపయోగించిన తర్వాత, శుభ్రమైన గుడ్డను తీసుకొని, దుమ్మును శుభ్రం చేయాలి. అనంతరం వాటిని ట్యాప్ కింద ఉంచి శుభ్రంగా కడగాలి. ఫిల్టర్‌లను ఆరనిచ్చి.. వాటిని తిరిగి యథాస్థానంలో ఉంచాలి. తర్వాత ఏసీ ప్యానల్‌ను మూసివేయాలి. ఇక ఏసీ ఆన్ చేసుకుని వాడుకోవచ్చు.
అవుట్‌డోర్ యూనిట్.. ఏసీ బయట ఉండే భాగం అవుట్ డోర్ యూనిట్. దీనిని శుభ్రం చేయడం కొంచెం కష్టం. దీనిని చేయడానికి ముందుగా మీరు ఎయిర్ కండీషనర్‌ను నియంత్రించే ఫ్యూజ్‌ను ఆఫ్ చేయాలి. ఎయిర్ కండీషనర్ పైన ఉన్న కండెన్సర్ ఫిన్‌లను వాక్యూమ్ చేయాలి. దీని తర్వాత, గాలి ప్రవాహాన్ని నిరోధించే ఏదైనా దుమ్ము లేదా చెత్తను తొలగించడానికి మృదువైన-బ్రిస్టల్ వాక్యూమ్ అటాచ్‌మెంట్‌ను ఉపయోగించాలి. మీరు ఎక్స్‌టర్నల్ యూనిట్‌ను డీప్ క్లీన్ చేయాలనుకుంటే, టాప్ గ్రిల్‌ను ఓపెన్ చేయాలి. ఎలక్ట్రికల్ కనెక్షన్‌లు దెబ్బతినకుండా ఫ్యాన్‌ను తీసివేయాలి. ఫ్యాన్ నుంచి ఏదైనా దుమ్ము లేదా చెత్తను తుడిచివేయడానికి తడిగా ఉన్న వస్త్రాన్ని ఉపయోగించండి. మితమైన ఒత్తిడితో కూడిన నీటితో ఖాళీ ఎయిర్ కండీషనర్ యూనిట్ లోపలి భాగాన్ని కడగాలి. మిగిలిన భాగాలను నెమ్మదిగా యథాస్థానంలో పెట్టాలి. యూనిట్ బాగా ఆరనిచ్చి తిరిగి ఆన్ చేసుకోవాలి. అయితే అవుట్ డోర్ యూనిట్‌ను శుభ్రం చేసుకోడం కొంచెం కష్టం. జాగ్రత అవసరం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..