లెనోవో ట్యాబ్ ప్లస్.. లెనోవో ట్యాబ్ ప్లస్ ట్యాబ్ ను విద్యార్థులు, ఉద్యోగుల కోసం రూపొందించారు. దీనిలో 11.5 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా జేబీఎల్ హై ఫై స్పీకర్లు, 8600 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ఆకట్టుకుంటున్నాయి. మీడియా టెక్ హెలియో జీ99 ఆక్టా ప్రాసెసర్‌తో పని చేస్తుంది. యూఎస్ బీ టైప్- సీ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, ఎస్ డీ కార్డ్ స్లాట్, ఫేస్ అన్‌లాక్, 8 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ధర రూ.20,500