AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి.. ఏకంగా 8.5శాతం వరకూ..

అధిక రాబడి కావాలనుకునే వారు ఎక్కువగా ఫిక్స్ డ్ డిపాజిట్ల వైపు చూస్తారు. వీటిల్లో వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీరేటు ఉంటుంది. అందరూ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులనే ఎక్కువగా ఎంపికచేసుకుంటారు. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అన్నింటి కన్నా అధిక వడ్డీ రేటు వస్తుంది. వీటిల్లో ప్రస్తుతం ఎఫ్డీలపై వడ్డీరేటు 8% నుంచి 8.5% వరకూ ఉంటోంది.

FD Interest Rates: ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి.. ఏకంగా 8.5శాతం వరకూ..
Fd Rate
Madhu
|

Updated on: Feb 21, 2024 | 8:53 AM

Share

సాధారణంగా మన జీవితాలు సాఫీగా ముందుకు సాాగాలంటే డబ్బులు పొదుపు చేయడం చాలా ముఖ్యం. కష్టబడే వయసులో చేసిన పొదుపు మనకు జీవితం చివరి దశలో ఆదుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయంపై చాలా ఆలోచిస్తారు. పొదుపు అనగానే మనకు గుర్తుకువచ్చేవి బ్యాంకులు. కేవలం సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు వేస్తే వాటిల్లో వడ్డీ రేటు చాలా తక్కువ కాబట్టి రిటర్న్స్ అంతగా రావు. ఒకవేళ అధిక రాబడి కావాలనుకునే వారు ఎక్కువగా ఫిక్స్ డ్ డిపాజిట్ల వైపు చూస్తారు. వీటిల్లో వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీరేటు ఉంటుంది. అందరూ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులనే ఎక్కువగా ఎంపికచేసుకుంటారు. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అన్నింటి కన్నా అధిక వడ్డీ రేటు వస్తుంది. వీటిల్లో ప్రస్తుతం ఎఫ్డీలపై వడ్డీరేటు 8% నుంచి 8.5% వరకూ ఉంటోంది. ఈ క్రమంలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీనిచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ బ్యాంకు 3.75 % నుంచి 8 % వరకూ వడ్దీ అందజేస్తోంది. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే 18 నెలల కాలపరిమితితో ముగిసే వాటికి అత్యధిక వడ్డీరేటు అయిన 8 % వర్తిస్తుంది. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఈ వడ్డ రేటు అందుబాటులోకి తెచ్చింది.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఈ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని 3.5% నుంచి 8.50% వరకూ అందజేస్తోంది. పైన చెప్పిన విధంగానే ఏడు రోజుల నుంచి సుమారు పదేళ్ల కాలపరిమితితో కూడిన డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. 444 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు అత్యధిక వడ్డీ అయిన 8.50% లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ బ్యాంకు అందించే వడ్డీరేట్లు 4% నుంచి 8.25 % వరకూ ఉన్నాయి. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాల పరిమితితో డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధికి అత్యధిక వడ్డీ రేటు అయిన 8.25% వడ్డీని అందిస్తుంది.

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఈ బ్యాంకు ఇచ్చే వడ్డీ రేట్లు 3 % నుంచి 8.61% వరకూ ఉంటున్నాయి. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చసే వారికి ఈ వడ్డీ రేట్లు వస్తాయి. అత్యధిక వడ్డీ 8.61 శాతాన్ని 750 రోజులకు ముగిసే డిపాజిట్లకు అందిస్తుంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఈ బ్యాంకు ఇస్తున్న వడ్డీ రేట్లు 3% నుంచి 8.50% వరకూ ఉన్నాయి. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితితో వచ్చే డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు అందిస్తుంది. 365 రోజుల పరిమితి కలిగిన డిపాజిట్లపై గరిష్ట వడ్డీరేటు 8.50% అందిస్తుంది.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఈ బ్యాంక్ ఫి‍​క్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు 4% నుంచి 8.65% వరకూ లభిస్తాయి. ఇక కాలపరిమితి అన్ని బ్యాంకులు ఇచ్చిన విధంగానే ఉంది. అయితే రెండేళ్ల రెండు రోజులకు మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లకు గరిష్ట వడ్డీరేటు (8.65%) లభిస్తుంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

మిగిలిన బ్యాంకుల మాదిరిగానే ఈ బ్యాంకు ఎఫ్డీలపై 3.75% నుంచి 8.25 % వరకూ వడ్డీ రేటు అందజేస్తోంది. ఏడు రోజుల నుంచి పదేళ్ల మధ్య డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు ఉంటుంది. అయితే గరిష్ట వడ్డీరేటును 560 రోజులకు మెచ్యూరయ్యే డిపాజిట్లకు అందిస్తుంది.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఈ బ్యాంకు ఖాతాదారులకు 4.50% నుంచి 9% వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని అందజేస్తోంది. కాలపరిమితి మాత్రం పైన బ్యాంకుల మాదిరిగానే ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకూ ఉంది. గరిష్ట వడ్డీరేటు 9 శాతాన్ని 1001 రోజులు పూర్తయిన వాటికి అందిస్తుంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఈ బ్యాంకుఇక్కడ 4% నుంచి 8.50% వరకూ వడ్డీ రేటు అందిస్తుంది. ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. రెండు నుంచి మూడేళ్ల మధ్య మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు 8.50% లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్