Own House: సొంతింటి కల నెరవేరాలా..? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే స్వగృహ ప్రాప్తి పక్కా..!

ముందుగా మీరు సంపాదిస్తున్న ఆదాయం, మీరు చేస్తున్న ఖర్చులను పరిశీలించండి. మీకు అయ్యే ఖర్చులను లెక్కలను వేసుకోండి. వాటిలో కొన్ని ఖర్చులను తగ్గించుకుని పొదుపు పెంచుకునే చర్యలు తీసుకోండి. సక్రమమైన ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. ఇప్పటికే ఉన్న రుణాలను సక్రమంగా చెల్లించండి.

Own House: సొంతింటి కల నెరవేరాలా..? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే స్వగృహ ప్రాప్తి పక్కా..!
Buying Home
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 22, 2024 | 11:48 AM

సొంతిల్లు అనేది నేడు ప్రతి ఒక్కరి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. మీరు సంపాదించే ఆదాయం, ఖర్చులపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఆ కల సాకారం అవుతుంది. అనసవర ఖర్చులపై నియంత్రణ ఉంటే పొదుపు పెరుగుతుంది. అది కొంత కాలానికి పెద్ద మొత్తంగా మారి ప్రయోజనం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిన తర్వాత సొంతిల్లు సమకూర్చకోవడం దాదాపు సాధ్యంగానే మారింది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు అపార్టుమెంట్లను కట్టి వాటిలో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. వాటికి బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఆ రుణం ద్వారా ఫ్లాట్ ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంకుల ప్రతినెలా ఈఎంఐ రూపంలో వాయిదాలు చెల్లించవచ్చు. ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ముందుగా కొంత డబ్బును డౌన్ పేమెంట్ గా కట్టాలి. మిగిలిన దానిని బ్యాంకు రుణంగా ఇస్తుంది. డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువ ఉండే అంత లాభం ఉంటుంది. వడ్డీ ఎక్కువగా చెల్లించే అవసరం ఉండదు. సాధారణంగా ఫ్లాట్ ఖరీదులో దాదాపు 20 శాతం డౌన్ పేమెంట్ గా ఉంటుంది. కాబట్టి ఆ డౌన్ పేమెంట్ కోసం సొమ్ములు పొదుపు చెయ్యాలి. కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే అది సాధ్యమవుతుంది. ఆ పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశీలన.. ముందుగా మీరు సంపాదిస్తున్న ఆదాయం, మీరు చేస్తున్న ఖర్చులను పరిశీలించండి. మీకు అయ్యే ఖర్చులను లెక్కలను వేసుకోండి. వాటిలో కొన్ని ఖర్చులను తగ్గించుకుని పొదుపు పెంచుకునే చర్యలు తీసుకోండి. సక్రమమైన ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. ఇప్పటికే ఉన్న రుణాలను సక్రమంగా చెల్లించండి. దాని ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరిగి, త్వరగా రుణం మంజూరు కావడానికి దోహద పడుతుంది.

అనువైన ఎంపిక.. సాధారణంగా డౌన్ పేమెంట్ 20 శాతం ఉంటుంది. అయితే ఇంకా తక్కువ డౌన్ పేమెంట్‌లతో లోన్ ఆప్ష న్లు కూడా ఉన్నాయి. వాటినన్నింటినీ పరిశీలించి, మీకు అనువుగా ఉన్న దానిని ఎంపిక చేసుకోండి. మీ పొదుపు లక్ష్యాలను పెంచుకోవడం ద్వారా మీ కలను తొందరగా సాకారం చేసుకోవచ్చు.

పొదుపునకు ప్రాధాన్యం.. పొదుపునకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. మీ తనిఖీ ఖాతా నుంచి మీ డౌన్ పేమెంట్ సేవింగ్స్ ఖాతాకు పొదుపులను బదిలీ చేయండి. ఈ విధానం మీరు పొదుపుకు ప్రాధాన్యం ఇస్తున్నారని నిర్ధారిస్తుంది.

ఖర్చుల నియంత్రణ.. మీ ఖర్చు అలవాట్లను విశ్లేషించండి. వాటిని తగ్గించుకునే విధానాలనూ ఆలోచించండి. రోజూ బయట తినే అలవాటు ఉంటే మార్చుకోండి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు పొదుపు కూడా పెరుగుతుంది. అలాగే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను వెతకండి. ఫ్రీలాన్స్ అవకాశాలను అన్వేషించండి. మీ ఆదాయంలో చిన్న పెరుగుదల కూడా మీ పొదుపును కాలక్రమాన్ని గణనీయంగా వేగవంతం చేస్తుంది

అదనపు పొదుపులు.. పన్ను రీఫండ్‌లు, పని బోనస్‌, ఊహించని బహుమతులు మీ పొదుపులను సూపర్‌ ఛార్జ్ చేస్తాయి. అంటే గణనీయంగా పెంచుతాయి. ఇలాంటి వాటిని ఒక ప్రత్యేక ఖాతా తెరిచి జమ చేయండి.

దీర్ఘకాలిక లక్ష్యాలు.. మీ పొదుపు పురోగతిని క్రమం తప్పకుండా పరిశీలించండి. దానిని పెంచడానికి అవసరమైన విధంగా మీ ప్లాన్‌ను సర్దుబాటు చేయండి. ఊహించని ఖర్చులకు తాత్కాలిక సర్దుబాట్లు అవసరం కావచ్చు, కానీ మీ దీర్ఘకాలిక లక్ష్యాన్ని వదులుకోవద్దు.

ఆర్థిక నిబద్ధత.. ఆర్థిక నిబద్ధతతోనే సొంతింటి కలను సాకారం చేసుకోగలం. దానికి చక్కని ప్రణాళిక, సంకల్పం, పట్టుదల అవసరం. పొదుపు లక్ష్యం వైపు మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని సొంతింటికి దగ్గరగా తీసుకువెళుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!