Cibil score: లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? మీ స్కోర్ అమాంతం పెరగాలంటే ఏం చేయాలి?

గతంలో మీరు తీసుకున్న రుణాలు చెల్లించిన విధానం, క్రెడిట్ వినియోగం, ఇతర విషయాల ఆధారంగా సిబిల్ స్కోర్ ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికీ 300 నుంచి 900 లోపు ఏదో ఒక నంబర్ వస్తుంది. అయితే ఈ స్కోర్ 750 పైన ఉండడం చాలా అవసరం. లేకపోతే రుణాల మంజూరులో ఇబ్బందులు కలుగుతాయి. ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రయోజనం చేకూరుతుంది.

Cibil score: లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? మీ స్కోర్ అమాంతం పెరగాలంటే ఏం చేయాలి?
Credit Score
Follow us

|

Updated on: Apr 30, 2024 | 7:47 AM

జీవితంలో మనం వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకుంటాం. వ్యక్తిగత పనులు, వ్యాపారానికి పెట్టుబడి, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు వాటిపై ఆధారపడతాం. ఇందుకోసం ప్రధానంగా బ్యాంకులను ఆశ్రయిస్తాం. మన దరఖాస్తులను, అవసరాన్ని పరిశీలించి బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. ఆ సమయంలో మన సిబిల్ స్కోర్ అనేది అత్యంత కీలకంగా మారుతుంది. అది సక్రమంగా ఉన్నప్పుడే మీకు రుణం త్వరగా మంజూరు అవుతుంది. లేకపోతే తిరస్కరించే ప్రమాదం కూడా ఉంది.

ఎక్కువ ఉంటే ప్రయోజనం..

గతంలో మీరు తీసుకున్న రుణాలు చెల్లించిన విధానం, క్రెడిట్ వినియోగం, ఇతర విషయాల ఆధారంగా సిబిల్ స్కోర్ ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికీ 300 నుంచి 900 లోపు ఏదో ఒక నంబర్ వస్తుంది. అయితే ఈ స్కోర్ 750 పైన ఉండడం చాలా అవసరం. లేకపోతే రుణాల మంజూరులో ఇబ్బందులు కలుగుతాయి. ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రయోజనం చేకూరుతుంది.

స్కోర్ ను దెబ్బతీసే అంశాలు..

  • ఆలస్య చెల్లింపులు, డిఫాల్ట్ ల కారణంగా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. దాని ప్రభావం సిబిల్ స్కోర్ పై పడుతుంది.
  • అధిక క్రెడిట్ వినియోగం మరో కారణం. తరచూ పూర్తి క్రెడిట్ పరిమితి వినియోగం మీ ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది.
  • లిమిటెడ్ క్రెడిట్ హిస్టరీ కూడా మీకు ప్రతికూలంగా మారుతుంది. అది స్కోర్ మూల్యాంకనానికి ఆటంకం కలిగిస్తుంది.
  • రుణాల కోసం తరచుగా దరఖాస్తు చేయడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అది మీ ఆర్థిక అస్థిరత్వన్ని సూచిస్తుంది.
  • దివాలా, పన్ను సమస్యలు స్కోర్‌కు హాని చేస్తాయి.
  • సెటిల్‌మెంట్లు కూడా మీ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి.
  • తరచుగా బ్యాలెన్స్ ను బదిలీ చేయడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది.
  • మీరుండే నివాసం, పని చేసే స్థలం కూడా స్కోర్‌కు హాని చేయవచ్చు, లేదా సహాయపడవచ్చు.
  • క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి, సకాలంలో చెల్లింపులు చేయడం, క్రెడిట్ వినియోగాన్ని తగ్గించడం, విభిన్న క్రెడిట్ మిశ్రమాన్ని నిర్వహించడం చాలా అవసరం.
  • క్రెడిట్ నివేదికలో ఏవైనా లోపాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. డిఫాల్ట్‌ల నుంచి అధిక క్రెడిట్ వినియోగం వరకూ అనేన అంశాలు క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి కారణమవుతాయి.

సిబిల్ స్కోర్ పెంచుకునే విధానం..

  • సిబిల్ స్కోర్ మెరుగుపరచడానికి స్థిరమైన బాధ్యతాయుతమైన ఆర్థిక పద్ధతులు పాటించడం చాలా అవసరం. ఈ పద్ధతులను పాటించడం వల్ల చాలా మేలు కలుగుతుంది.
  • మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేయండి, స్కోర్‌ను ప్రభావితం చేసే లోపాలను గుర్తించాలి.
  • సకాలంలో బిల్లులు చెల్లించండి, ఇందుకోసం రిమైండర్‌లను సెట్ చేసుకోండి.
  • క్రెడిట్ వినియోగాన్ని తగ్గించండి.
  • క్రెడిట్ మిశ్రమాన్ని వైవిధ్యపరచండి.
  • బహుళ అప్లికేషన్లను నివారించండి, తక్కువ వ్యవధిలో ఎక్కువ అప్లికేషన్‌లను పెట్టకండి.
  • సురక్షిత క్రెడిట్‌ని ఉపయోగించండి, సురక్షిత ఎంపికలతో పునర్నిర్మించండి.
  • రుణ చెల్లింపు, పొదుపులకు ప్రాధాన్యం ఇవ్వండి.
  • సానుకూల అలవాట్లు క్రమంగా మంచి ఫలితాలను ఇస్తాయి.
  • బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన, తెలివైన క్రెడిట్ మేనేజ్ మెంట్ కారణంగా అనుకూల ఫలితాలు వస్తాయి. అవి మీ సిబిల్ స్కోర్ పెరిగేందుకు కారణమవుతాయి. మీరు కొత్త రుణగ్రహీత అయినప్పటికీ మీ స్కోర్ కాలక్రమేణా పెరుగుతుంది.

సిబిల్ స్కోర్ ను తనిఖీ చేసుకుండి ఇలా..

  • సిబిల్ ఎటువంటి చార్జీ లేకుండా ఏడాదికి ఒక నివేదికను అందిస్తుంది. దానిని ఆన్‌లైన్‌లో ఇలా తనిఖీ చేయవచ్చు. ఈ సిబిల్  వెబ్ సైట్ కి వెళ్లండి.
  • గెట్ యువర్ సిబిల్ స్కోర్ ను ఎంపిక చేసుకోండి.
  • యాన్యువల్ స్కోర్ ను చెక్ చేసుకోవడం కోసం క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్‌ టైప్ చేయండి. ఐడీ రుజువు (పాస్‌పోర్ట్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ లేదా ఓటర్ ఐడీ)ని జత చేయండి. ఆపై మీ పిన్ కోడ్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి.
  • యాక్సెప్ట్ అండ్ క్లిక్ ఆప్షన్ ను ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కొనసాగించండి.
  • గో టు డాష్‌బోర్డ్ ను ఎంచుకోండి, మీరు ఈ వెబ్‌సైట్‌లోకి వెళతారు.
  • సభ్యుల లాగిన్ పై క్లిక్ చేసి, మీ సిబిల్ స్కోర్ ను తెలుసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్