AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero electric splendor: ముహూర్తం ఫిక్స్.. ఎలక్ట్రిక్ స్ల్పెండర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తారా?

ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఏ కంపెనీ మోడల్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీ అందరికీ గుడ్ న్యూస్. హీరో కంపెనీ నుంచి కొత్త స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వాహనం త్వరలో విడుదల కానుంది. రైడ్ టెస్టింగ్ కూడా పూర్తయిన ఈ బండి త్వరలో మార్కెట్ లో సందడి చేయనుంది. స్ల్పెండర్ లుక్ తోనే ఆకట్టుకుంటున్న ఈ కొత్త ఈవీలోని ఇంజిన్, గేర్ బాక్స్‌లను శక్తివంతమైన లిథియం అయాన్ బ్యాటరీతో  భర్తీ చేశారు. 

Hero electric splendor: ముహూర్తం ఫిక్స్.. ఎలక్ట్రిక్ స్ల్పెండర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తారా?
Hero Electric Splendor
Madhu
|

Updated on: Apr 30, 2024 | 12:18 PM

Share

దేశంలోనే ప్రముఖ టూ వీలర్ కంపెనీ అయిన హీరో సంస్థకు ప్రజలలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ విడుదల చేసిన అనేక మోడళ్లు అమ్మకాలలో సంచలనం రేపాయి. ఇప్పటికీ ప్రజలందరి నమ్మకం చూరగొన్న బ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హీరో సంస్థ ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఈ కంపెనీ నుంచి హీరో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ త్వరలో విడుదల కానుంది. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే దాదాపు 160 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ బండి రూ.70 వేలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

కొనుగోలుదారులకు శుభవార్త..

ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఏ కంపెనీ మోడల్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీ అందరికీ గుడ్ న్యూస్. హీరో కంపెనీ నుంచి కొత్త స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వాహనం త్వరలో విడుదల కానుంది. రైడ్ టెస్టింగ్ కూడా పూర్తయిన ఈ బండి త్వరలో మార్కెట్ లో సందడి చేయనుంది. స్ల్పెండర్ లుక్ తోనే ఆకట్టుకుంటున్న ఈ కొత్త ఈవీలోని ఇంజిన్, గేర్ బాక్స్‌లను శక్తివంతమైన లిథియం అయాన్ బ్యాటరీతో  భర్తీ చేశారు.

ఫీచర్లు సూపర్..

హీరో ఎలక్ట్రిక్ స్ల్పెండర్ లో అద్భుత, అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీనిని చార్జింగ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం సరిపోతుంది. దాదాపు 150 కిలోమీటర్ల వరకూ హాయిగా ప్రయాణం సాగించవచ్చు. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంగా వెళ్లవచ్చు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మాదిరిగా వేగం, బ్యాటరీ స్థాయి, రీడింగ్ మోడ్, ఉష్ణోగ్రతల సమాచారం తెలుసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, మెసేజ్‌లు, సైడ్ స్టాండ్ సెన్సార్, ఎల్ ఈడీ హెడ్‌లైట్, ఎల్ ఈడీ టెయిల్ లైట్, సేఫ్టీ ఫీచర్లు, ముందు,  వెనుక డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

మైలేజీకి ప్రాధాన్యం

గతంలో వచ్చిన హీరో స్ప్లెండర్ అత్యంత ప్రజాదరణ పొందటానికి దాని మైలేజీ ప్రధానం కారణం. కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా కంపెనీ ఆ ప్రత్యేకతను కొనసాగించింది. రేంజ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. తద్వారా తన కస్టమర్లకు మెరుగైన ప్రయాణం అందించనుంది. ఎలక్ట్రిక్  స్ప్లెండర్ ను సుమారు 4 నుంచి 6 గంటల్లో పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. గరిష్టంగా 140 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల దూరం వెళుతుంది.  గంటలకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగించే వీలుంది.  ఎలక్ట్రిక్ స్ప్లెండర్‌లో 9 కేడబ్ల్యూ మిడ్ షిప్ మౌంటెన్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఏర్పాటు చేశారు. ఇది 170 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇక  4 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ సమర్థంగా పనిచేస్తుంది.

డిసెంబర్ లో విడుదల?

ఎలక్ట్రిక్ స్ప్లెండర్‌ తయారీపై హీరో కంపెనీ చాలా కాలంగా పనిచేస్తోంది. దాని డ్రైవింగ్ పరీక్ష కూడా నిర్వహించింది. త్వరలోనే బండిని మార్కెట్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా సామ్యాన్య, మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించిన ఈ వాహనం ధర రూ.70 వేలకు (ఎక్స్ షోరూమ్ ) ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తారని సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..