AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టవద్దు.. లేదంటే ఆర్థిక సమస్యలు తప్పవు..!

Dining Table Vastu: డైనింగ్ టేబుల్ విషయంలో కొన్ని చిన్న పొరపాట్లు కూడా కుటుంబంలో ఉద్రిక్తతలు, ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips: డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టవద్దు.. లేదంటే ఆర్థిక సమస్యలు తప్పవు..!
Vastu Tips Dining Table
Rajashekher G
|

Updated on: Feb 17, 2026 | 4:06 PM

Share

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం, వస్తువుల అమరిక ఉంటే.. ఇంట్లో సానుకూల వాతావరణంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. అందుకే ఇంట్లోని ప్రతి నిర్మాణం, అమరిక కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అందుకే, ఇంట్లో ప్రతి గదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసే డైనింగ్ ప్రాంతం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉండాలి. డైనింగ్ టేబుల్ విషయంలో కొన్ని చిన్న పొరపాట్లు కూడా కుటుంబంలో ఉద్రిక్తతలు, ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డైనింగ్ టేబుల్‌పై పెట్టకూడని వస్తువులు

1. మందులు, టాబ్లెట్లు

డైనింగ్ టేబుల్‌పై మందులు లేదా వైద్య సంబంధిత వస్తువులు ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి ఆరోగ్య సమస్యలను సూచించే వాటిగా భావిస్తారు. దీని వలన ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని చెబుతారు.

2. ఉప్పు:

సాధారణంగా చాలామంది అలవాటుగా టేబుల్‌పై ఉప్పు డబ్బా ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని నమ్మకం. అవసరమైనప్పుడు మాత్రమే ఉప్పు డబ్బాను ఉంచడం మంచిది.

3. పర్స్, మొబైల్ ఫోన్:

డైనింగ్ టేబుల్‌పై పర్స్, మొబైల్ ఫోన్ లేదా ఇతర వ్యక్తిగత వస్తువులు ఉంచడం శుభం కాదు. భోజనం చేసే స్థలాన్ని ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచడం అవసరం.

4. పాడైపోయిన లేదా మిగిలిపోయిన ఆహారం

టేబుల్‌పై పాడైన ఆహారం లేదా ఎక్కువసేపు ఉంచిన వంటకాలు పెట్టకూడదు. ఇవి ప్రతికూలతను ఆకర్షిస్తాయని భావిస్తారు.

5. విరిగిన పాత్రలు

విరిగిన గ్లాసులు, ప్లేట్లు లేదా పాడైన వస్తువులు టేబుల్‌పై ఉంచకండి. ఇవి దురదృష్టాన్ని సూచిస్తాయని నమ్మకం.

డైనింగ్ టేబుల్ దిశ ఎలా ఉండాలి?

వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్‌ను పడమర లేదా నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరం. ఈ విధంగా ఉంచితే కుటుంబంలో ఐక్యత, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని అంటారు. డైనింగ్ టేబుల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. చెక్కతో చేసిన టేబుల్ ఉంటే మరింత శుభప్రదంగా భావిస్తారు.

పనికిరాని వస్తువులను వెంటనే తొలగించడం మంచిది. భోజన సమయంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించగలరని విశ్వాసం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు, జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us
డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టవద్దు.. లేదంటే..
డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టవద్దు.. లేదంటే..
కేవలం రూ.60 వేల లోపే iPhone 16 Pro.. బంపర్ ఆఫర్..!
కేవలం రూ.60 వేల లోపే iPhone 16 Pro.. బంపర్ ఆఫర్..!
పాక్ ప్రభుత్వానికి దిగ్గజాలు గవాస్కర్, కపిల్ దేవ్ లేఖ.. ఎందుకంటే
పాక్ ప్రభుత్వానికి దిగ్గజాలు గవాస్కర్, కపిల్ దేవ్ లేఖ.. ఎందుకంటే
నా బిడ్డకు నిజమైన న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి
నా బిడ్డకు నిజమైన న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి..!
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి..!
JEE Mainలో 300కి 300 స్కోర్.. టాప్ ర్యాంకర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
JEE Mainలో 300కి 300 స్కోర్.. టాప్ ర్యాంకర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
ఈ చీరల క్రేజ్‌ చూస్తే మైండ్ బ్లాంకే.. తెల్లవారుజామున 4 నుంచే..
ఈ చీరల క్రేజ్‌ చూస్తే మైండ్ బ్లాంకే.. తెల్లవారుజామున 4 నుంచే..
గోంగూర చికెన్ కర్రీ లాభాలు తెలిస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..
గోంగూర చికెన్ కర్రీ లాభాలు తెలిస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..
కాలసర్ప యోగం.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త!
కాలసర్ప యోగం.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త!
కేవలం రూ.20 వేల పెట్టుబడితో లక్షాధికారి కావచ్చు..సులభమైన వ్యాపారం
కేవలం రూ.20 వేల పెట్టుబడితో లక్షాధికారి కావచ్చు..సులభమైన వ్యాపారం