AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Maintenance: వర్షంలో బైక్ నడుపుతున్నారా బ్రో? ఈ సేఫ్ టిప్స్ మీ కోసమే..

వానాకాలంలో ద్విచక్ర వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు సురక్షితంగా ప్రయాణించడానికి, వాహనం సక్రమంగా పనిచేయడానికి ఇది తప్పనిసరి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు వాహనం పట్టుతప్పి పడిపోకుండా, ఎక్కడ బడితే అక్కడ ఆగిపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలను ఎప్పటి కప్పుడు పరిశీలించాలి.

Bike Maintenance: వర్షంలో బైక్ నడుపుతున్నారా బ్రో? ఈ సేఫ్ టిప్స్ మీ కోసమే..
Bike Tips In Rainy Season
Madhu
|

Updated on: Jul 06, 2024 | 7:47 PM

Share

వర్షాకాలం ప్రారంభం కావడంతో జోరుగా వానలు పడుతున్నాయి. నిన్నటి వరకూ ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు వానలు ఉపశమనం కలిగిస్తున్నాయి. వాతావరణం చల్లబడడంతో హాయిగా ఉంటోంది. అయితే వాతావరణం మారడంతో ప్రజల ఆరోగ్యంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. జ్వరాలు, జలుబు తదితర అనారోగ్యాలు కలుగుతున్నాయి. వాటి నుంచి రక్షణకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మనం ఉపయోగించే ద్విచక్ర వాహనాలు కూడా వానల వల్ల పాడవుతాయి. ఈ కాలంలో వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.

జాగ్రత్తలు అవసరం..

వానాకాలంలో ద్విచక్ర వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు సురక్షితంగా ప్రయాణించడానికి, వాహనం సక్రమంగా పనిచేయడానికి ఇది తప్పనిసరి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు వాహనం పట్టుతప్పి పడిపోకుండా, ఎక్కడ బడితే అక్కడ ఆగిపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలను ఎప్పటి కప్పుడు పరిశీలించాలి. వానాకాలంలో ద్విచక్ర వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

టైర్లు..

వాహనం రోడ్డుపై సక్రమంగా ప్రయాణించాలంటే దానికి తగినంత పట్టు చాలా అవసరం. మీ వాహనం టైర్లు అరిగిపోయి ఉంటే వెంటనే మార్చేయండి. ఎందుకంటే అరిగిపోయిన టైర్ల వల్ల వర్షాకాలంలో రోడ్డపై జారిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుంతలలో బండి దిగితే టైర్ కు రాళ్లు గుచ్చుకుని పంక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

బ్రేక్ లు..

వానలు కురిసినప్పుడు బ్రేక్ ల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి బ్రేక్ నొక్కిన వెంటనే ముందు, వెనుక టైర్లు ఆగేలా చూసుకోవాలి. వాటికి అవసరమైన మరమ్మతులు చేయించాలి. వర్షంలో ఎక్కువగా తిరిగితే చైన్ లోని లూబ్రికేషన్ పోతుంది. దానివల్ల తుప్పు పట్టడంతో పాటు పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి యాంటీ వాటర్ చైన్ లూబ్రికెంట్‌ ను ఉపయోగించడం చాలా అవసరం.

బ్యాటరీ..

మోటారు సైకిల్ బ్యాటరీ పూర్తిగా చార్జి అయ్యేలా చూసుకోవాలి. వర్షం పడినప్పుడు బండిలోని విద్యుత్ భాగాలపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. మలుపులు తిరిగినప్పుడు సిగ్నల్ బల్బులు ఉపయోగించడం చాలా అవసరం. కాబట్టి బల్బులు, ఇతర ఇండికేటర్లు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. పాడైపోయిన బల్బులను వెంటనే మార్చుకోవాలి.

పరిమిత వేగం..

బండి నిర్వహణ సక్రమంగా ఉన్నప్పటికీ మీరు ప్రయాణించే విధానం కూడా ప్రమాదాల నివారణకు సాధ్యపడుతుంది. ముఖ్యంగా తడి పరిస్థితులలో పరిమిత వేగంతోనే వెళ్లాలి. అధిక వేగంతో వెళితే రోడ్లపై టైర్లు జారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎవరైనా సడెన్ గా అడ్డవస్తే బ్రేక్ వేసినప్పుడు బండి బోల్తా పడే అవకాశం కూడా ఉంది. మలుపులు తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై బురద ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

దూరం పాటించండి..

ఇతర వాహనాల వెనుక వెళుతున్నప్పుడు తగినంత దూరం పాటించాలి. ఎందుకంటే తడి రోడ్లపై బ్రేక్ వేసినప్పుడు బండి ముందుకు జారీ అవకాశం ఉంది. అలాగే గుంతలలో బండిని దింపకూడదు. వాటి చుట్టూ ఉన్న నేలపై వెళ్లడానికి ప్రయత్నించాలి.

ప్రత్యేక శ్రద్ధ..

వర్షంలో రాకపోకలు సాగించిన తర్వాత మోటారుసైకిల్ కు బురద, మట్టి అంటుకుంటుంది. దానిని ఏ రోజు కారోజు కడిగేయాలి. లేకపోతే పెయింట్, ఇతర సున్నితమైన భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా చైన్, బ్రేక్‌లు, ఎలక్ట్రికల్ భాగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాటికి ఉన్న తడిని తుడవడానికి గుడ్డ, ఎయిర్ బ్లోవర్‌ని ఉపయోగించాలి. చైన్ తో పాటు ఇతర కదిలే భాగాలను శుభ్రం చేసిన తర్వాత వాటిని లూబ్రికేట్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..