AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4జీ సేవలు.. ప్లాన్స్‌ ఎలా ఉండనున్నాయంటే..

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రధాన టెలికం కంపెనీలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆగస్టు నాటికి దేశంలో 4జీ సేవలను తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది...

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4జీ సేవలు.. ప్లాన్స్‌ ఎలా ఉండనున్నాయంటే..
Bsnl 4g
Narender Vaitla
|

Updated on: Jul 06, 2024 | 7:10 PM

Share

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రధాన టెలికం కంపెనీలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆగస్టు నాటికి దేశంలో 4జీ సేవలను తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 4జీ సేవలకు సంబంధించిన ప్లాన్స్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వివరాలను వెల్లడించారు. ఇంతకీ BSNL అందిస్తోన్న ప్లాన్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రూ. 2,399 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌తో ప్రతి రోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు ప్రతీ రోజూ 2 జీబీ డేటా పొందొచ్చు.

* రూ. 1,999 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు.

* రూ. 997 ప్లాన్‌..

రూ. 997 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 160 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ప్రతీరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.

* రూ. 599 ప్లాన్‌..

రూ. 599 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రూ. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ప్రతీ రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 347 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 54 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ప్రతీరోజూ 2 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్‌ పొందొచ్చు.

* రూ. 199 ప్లాన్‌..

రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ 2 బీబీ లభిస్తుంది.

* రూ. 153 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 26 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. మొత్తం 26జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు.

* రూ. 118 ప్లాన్‌..

రూ. 118 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 20 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. 10 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!