AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: కోటి రూపాయలు సంపాదించడం కష్టమేం కాదు! ఇలా చేస్తే మీ కల సాకారం..

మ్యూచువల్ ఫండ్స్ అనే మాట చాలామందికి తెలిసినప్పటికీ వాటిలో డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టాలో అవగాహన ఉండదు. మనకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా ఉండే ఫండ్ ను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీకు నెలకు రూ.50 వేల జీతం వస్తుందనుకోండి. దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పదేళ్లలో రూ.కోటి రూపాయలను సంపాదించవచ్చు. దీనికి క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం.

Mutual Funds: కోటి రూపాయలు సంపాదించడం కష్టమేం కాదు! ఇలా చేస్తే మీ కల సాకారం..
Sip Investment Tips
Madhu
|

Updated on: Jul 06, 2024 | 8:23 PM

Share

జీవితంతో భద్రతకు, భవిష్యత్తు అవసరాలకు డబ్బు అనేది చాలా అవసరం. మనకు వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకుని కొంత పొదుపు చేసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం బ్యాంకులు, పోస్టాఫీసులలో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. వాటిలో చాలామంది తమ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో మన పెట్టుబడికి అధిక రాబడి వచ్చే అవకాశం ఉంది.

అవగాహన అవసరం..

మ్యూచువల్ ఫండ్స్ అనే మాట చాలామందికి తెలిసినప్పటికీ వాటిలో డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టాలో అవగాహన ఉండదు. మనకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా ఉండే ఫండ్ ను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీకు నెలకు రూ.50 వేల జీతం వస్తుందనుకోండి. దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పదేళ్లలో రూ.కోటి రూపాయలను సంపాదించవచ్చు. దీనికి క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. రూ.కోటి సంపాదించడానికి ఏ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ (సిప్)ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.

రూ.కోటి సంపాదించాలంటే..

పదేళ్లలో కోటి రూపాయాలు సంపాదించడం అనేది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ ప్రణాళిక ప్రకారం వెళితే అది సాధ్యమే. అందుకోసం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ల మిశ్రమాన్ని ఎంచుకోవాలి. ఈ వ్యూహం ప్రకారం ఏటా సిప్ లో పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవాలి. పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాలి. తద్వారా మీ మూలధనం గణనీయంగా పెరుగుతుంది.

సిప్ లో పెట్టుబడి..

మీరు రూ.25,500 లతో సిప్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఏటా పదిశాతం పెరుగుదలతో ఇన్వె స్ట్ చేస్తున్నారు. తద్వారా పదేళ్లలో ఒక కోటి రూపాయల రాబడిని పొందవచ్చు. అంతర్లీన పెట్టుబడులు తదుపరి పదేళ్లకు 15 శాతం వార్షిక రాబడిని సమకూర్చుతాయి.

సమన్వయం..

పెట్టుబడి దారులు అధిక రాబడి కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లార్జ్ , మిడ్, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ల మిశ్రమాన్ని ఎంచుకోవాలి. వీటిలో లార్జ్ క్యాప్ ఫండ్స్ సురక్షితమైనవే. కానీ రాబడి మితంగా ఉంటుంది. మిగిలిన మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రిస్క్‌తో కూడుకున్నవి. అయినా అధిక రాబడిని అందించగలవు. కాబట్టి రిస్క్, రిటర్న్ రెండింటిని సమన్వయం చేయడం కోసం పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపర్చడం చాలా అవసరం.

రాబడి ఇలా..

మీ జీతం 50 వేలు అనుకున్నాం కదా. దానిలో నెలవారీ ఎస్ఐపీ రూ. 25,500 సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వేర్వేరు ఎస్ఐపీలతో ప్రారంభించవచ్చు.  ఏటా పదిశాతం పెంచే విధానంలో మీరు రూ.15 వేలు పెట్టుబడి పెడితే 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే రూ.50 లక్షలు, 15 శాతం రిటర్న్స్ ఆశిస్తే 59 లక్షల రాబడి ఉంటుంది. రూ.20 వేలు చొప్పున పెట్టుబడి పెడితే 67 లక్షలు (12 శాతం), 79 లక్షలు (15 శాతం) అందుతాయి. అలాగే ఏటా ఐదు శాతం పెంచే విధానంలో రూ.15 వేలు పెట్టుబడి పెడితే 12 శాతం రిటర్న్స్ తో 42 లక్షలు, 15 శాతం రిటర్న్స్ తో 50 లక్షలు అందుతాయి. అలాగే రూ.20 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 56 లక్షలు (12 శాతం), 66 లక్షలు (15 శాతం) పొందే అవకాశం ఉంది.

పదేళ్లలో సాధ్యమే..

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను గమనించడం చాలా అవసరం. ప్రధానంగా ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి. స్థిరమైన పెట్టుబడి పెట్టడం ద్వారా, సక్రమమైన అంచనాల ద్వారా పదేళ్లలో రూ.కోటి సంపాదించడం సాధ్యమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..