Ayushman Card: వృద్ధుల ఆరోగ్యానికి భరోసా.. కేంద్ర ఆరోగ్య పథకంలో కీలక మార్పులు..

దీని పేరు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై). ఇప్పటికే చాలా మందికి ఈ పథకం గురించి అవగాహన ఉంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ అంటే అర్థం అవుతుంది. ఇది అత్యంత సమగ్రమైన ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి. వైద్య చికిత్సకు అయ్యే అధిక ఖర్చుల నుంచి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

Ayushman Card: వృద్ధుల ఆరోగ్యానికి భరోసా.. కేంద్ర ఆరోగ్య పథకంలో కీలక మార్పులు..
Ayushman Card
Follow us

|

Updated on: Sep 22, 2024 | 4:56 PM

కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్య శ్రీ తరహాలో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని పేరు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై). ఇప్పటికే చాలా మందికి ఈ పథకం గురించి అవగాహన ఉంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ అంటే అర్థం అవుతుంది. ఇది అత్యంత సమగ్రమైన ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి. వైద్య చికిత్సకు అయ్యే అధిక ఖర్చుల నుంచి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ప్రత్యేకమైన కార్డులను అందిస్తోంది. దీనిలో ఎప్పటికప్పుడు ఆయుష్మాన్ కార్డును అప్ డేట్ చేస్తోంది. కవరేజ్ పరిధిని పెంచుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 11వ తేదీన ఈ పథకాన్ని మరింత మంది వినియోగించుకునేలా విస్తరించింది. కేంద్ర మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లతో సహా దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు.. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా పథకం ప్రయోజనాలను పొందగలుగుతారు.

అప్‌డేట్లు ఇలా..

విభిన్నంగా కార్డు: 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అర్హతగల సీనియర్ సిటిజన్‌లు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కొత్త, విభిన్నమైన కార్డ్‌ని అందుకుంటారు.

టాప్-అప్ కవరేజ్: ఇప్పటికే పథకం ద్వారా కవర్ చేయబడిన కుటుంబాలలోని సీనియర్ సిటిజన్‌లు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అదనపు టాప్-అప్ కవర్‌ని అందుకుంటారు. ఈ టాప్-అప్ ఒక వ్యక్తికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 70 ఏళ్లలోపు ఇతర కుటుంబ సభ్యులతో దీన్నిషేర్ చేయవలసిన అవసరం లేదు.

కుటుంబ కవరేజీ: ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ కవరేజీలో భాగం కాని సీనియర్ సిటిజన్‌లకు కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు కవర్ అందుతుంది.

పథకాల ఎంపిక: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) లేదా ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ల నుంచి ఇప్పటికే లబ్ది పొందుతున్న సీనియర్ సిటిజన్‌లు ఈ రెండింటిలో ఏదో ఒక ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ప్రైవేట్ బీమాతో అర్హత: ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా కవర్ చేయబడిన సీనియర్ సిటిజన్‌లు కూడా ఈ పథకం నుండి ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది

ఆయుష్మాన్ కార్డ్ అంటే ఏమిటి?

ఆయుష్మాన్ కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ పథకం కింద జారీ చేసే గుర్తింపు కార్డు. ఇది అర్హత కలిగిన వ్యక్తులు ఎంప్యానెల్డ్ ఆస్పత్రులలో ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కార్డుతో ప్రతి కుటుంబం సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని పొందుతుంది. ఆయుష్మాన్ కార్డ్ భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన జనాభాకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం.

ఆయుష్మాన్ కార్డ్‌కు ఎవరు అర్హులు?

ఈ పథకం ప్రారంభించినప్పుడు 2011 సామాజిక-ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) ద్వారా గుర్తించబడిన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డ్ అందించేవారు. అప్పుడు నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా కుటుంబాలు ఎంపిక జరిగిదే. దాని ప్రకారం వయోజన పురుషులు లేని గ్రామీణ కుటుంబాలు, కుటుంబాలు వంటి అత్యంత హాని కలిగించే వారిపై దృష్టి సారించారు. వికలాంగ సభ్యులు, తాత్కాలిక నివాసాలలో నివసిస్తున్న లేదా చేతితో పని చేసే కార్మికులుగా పనిచేస్తున్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, రిక్షా పుల్లర్లు వంటి తక్కువ-ఆదాయ కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. గృహ సభ్యుల వృత్తి ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. అయితే, కాలక్రమేణా, ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్థిక సహాయం అవసరమయ్యే మరిన్ని సమూహాలను చేర్చడానికి ప్రభుత్వం ఈ ప్రమాణాలను అప్ డేట్ చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం వలస కార్మికులు, పట్టణ అనధికారిక కార్మికులు, గ్రామీణ కళాకారులు, భూమిలేని కార్మికులు, ఇతర తక్కువ-ఆదాయ వర్గాలు, వితంతువులు లేదా ఒంటరి తల్లులు, వారి పిల్లలు, వృద్ధులు, వికలాంగులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..