Loan Apps: లోన్ యాప్‌ల గురించి ఇవి తెలుసుకోకపోతే మోసపోతారు.. తస్మాత్ జాగ్రత్త!
వ్యక్తిగత రుణాలు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మంజూరు చేస్తాయి. అయితే ఈ రోజుల్లో క్రెడిట్‌బీ, లెండింగ్‌కార్ట్, పేటీఎం, మనీట్యాప్, గ్రో వంటి అనేక ఫిన్‌టెక్ కంపెనీలు కూడా యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణ సేవలను అందిస్తున్నాయి. మీరు ఈ లోన్ యాప్‌లలో ఒకదాని నుంచి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో.. డబ్బు అవసరాలను తీర్చేందుకు పర్సనల్ లోన్(వ్యక్తిగత రుణం)లు బాగా ఉపకరిస్తాయి. వివాహమైనా, హాలీడే ట్రిప్ లేదా అత్యవసరమైనా పర్సనల్ లోన్ బాగా ఉపకరిస్తుంది. బ్యాంకర్లు ఈ లోన్లను విరవిగా మంజూరు చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రైవేటు యాప్స్ కూడా ఈ లోన్లు మంజూరు చేస్తున్నాయి. ఈ విధానాన్ని ఫిన్‌టెక్ ప్లాట్ ఫారం అని పిలుస్తున్నారు. ఇలాంటి ప్లాట్ ఫారం నుంచి నగదు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. వారికి షేర్ చేసే సమాచారం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక వడ్డీలు, హైడ్ చేసిన ఉంచిన చార్జీలు, పెనాల్టీలు తదితరాలు లోన్లు మంజూరైన తర్వాత ఉంటాయని చెబుతున్నారు. ఏమాత్రం లోన్ చెల్లింపుల్లో ఇబ్బంది ఎదురైనా.. రికవరీ విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, దీనిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని వివరిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
యాప్ ఆధారిత లోన్లు..
వ్యక్తిగత రుణాలు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మంజూరు చేస్తాయి. అయితే ఈ రోజుల్లో క్రెడిట్‌బీ, లెండింగ్‌కార్ట్, పేటీఎం, మనీట్యాప్, గ్రో వంటి అనేక ఫిన్‌టెక్ కంపెనీలు కూడా యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణ సేవలను అందిస్తున్నాయి. మీరు ఈ లోన్ యాప్‌లలో ఒకదాని నుంచి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
ఆర్బీఐ గుర్తింపు ముఖ్యం..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రుణాలు అందించడానికి అధికారం కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల (ఎన్‌బీఎఫ్‌సీలు) జాబితాను ప్రచురించింది. మీరు రిజిస్టర్డ్ ఎన్‌బీఎఫ్‌సీ లేదా అధీకృత ఎన్‌బీఎఫ్‌సీతో భాగస్వాములైన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ నుంచి మాత్రమే లోన్ తీసుకోవాలి. లోన్ పొందే ముందు, ఆ యాప్ ఆర్బీఐచే గుర్తించబడిందని, రుణాలను అందించడానికి చట్టబద్ధంగా అనుమతించబడిందని ధ్రువీకరించుకోండి. ప్లే స్టోర్లో ఎక్కువ యాప్ డౌన్‌లోడ్లు ఉన్నాయి కదా అని దానిని గుడ్డిగా నమ్మకూడదు.
కస్టమర్ సర్వీస్..
2023 ఆర్థిక సంవత్సరంలో, నకిలీ రుణ యాప్‌లపై 1,062 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇంకా, అద్భుతమైన కస్టమర్ సేవను అందించే ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా కీలకం. డిజిటల్ యాప్‌ల ద్వారా రుణాలను సులభంగా పొందవచ్చు. సమస్యల విషయంలో కస్టమర్ సర్వీస్‌ను పొందడం చాలా ముఖ్యం. ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్ సేవా విభాగం లేకుంటే, ఏవైనా సమస్యలను పరిష్కరించడం సవాలుగా ఉండవచ్చు.
డేటా గోప్యత.. యాప్ మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తుందని, డేటా గోప్యతా నిబంధనలకు కట్టుబడి ఉందని నిర్ధారించుకోండి.
సమాచారంలో పారదర్శకత.. యాప్ వడ్డీ రేట్లు, ఫీజులు మరియు రీపేమెంట్ నిబంధనల గురించి స్పష్టమైన, పారదర్శక వివరాలను అందించాలి. వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి.
రుణ వితరణ.. ఆమోదం పొందిన తర్వాత రుణం ఎంత త్వరగా, సురక్షితంగా మంజూరవుతుందో సమీక్షించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..