ETF’s Vs Mutual Funds: అధిక రాబడినిచ్చే రెండు టాప్ పెట్టుబడి పథకాలు ఇవి.. బెస్ట్ ఏది అంటే..

అధిక రాబడి కావాలంటే ఎక్కువ మంది మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అదే సమయంలో కాస్త మార్కెట్‌ పరిజ్ఞానం ఉన్న వారు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఎంచుకుంటారు. ఈ రెండు విధానాలు చాలా ప్రాధాన్యమైన పెట్టుబడి ఎంపికలు. రెండూ మీ డబ్బును పెంచడానికి ఉపకరిస్తాయి. కానీ ఇవి రెండూ వేర్వేరు మార్గాల్లో పనిచేస్తాయి.

ETF's Vs Mutual Funds: అధిక రాబడినిచ్చే రెండు టాప్ పెట్టుబడి పథకాలు ఇవి.. బెస్ట్ ఏది అంటే..
Etf's Vs Mutual Funds
Follow us

|

Updated on: Oct 01, 2024 | 3:21 PM

పెట్టుబడుల విషయానికి వస్తే చాలా ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కానీ వాటిల్లో అధిక రాబడి కావాలంటే ఎక్కువ మంది మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అదే సమయంలో కాస్త మార్కెట్‌ పరిజ్ఞానం ఉన్న వారు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఎంచుకుంటారు. ఈ రెండు విధానాలు చాలా ప్రాధాన్యమైన పెట్టుబడి ఎంపికలు. రెండూ మీ డబ్బును పెంచడానికి ఉపకరిస్తాయి. కానీ ఇవి రెండూ వేర్వేరు మార్గాల్లో పనిచేస్తాయి. స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టడానికి, అధిక రాబడిని ఆర్జించడానికి ఈ రెండింటిలో ప్రధాన తేడాలను తెలుసుకోవాలి. అందుకే అసలు ఈటీఎఫ్‌లు అంటే ఏమిటి? మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎలా పనిచేస్తాయి? పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏమిటి? వంటి వివరాలు గురించి తెలుసుకుందాం..

మ్యూచువల్‌ ఫండ్స్‌ అంటే..

మ్యూచువల్ ఫండ్స్ అనేక రకాల స్టాక్‌లు, బాండ్‌లు లేదా ఇతర సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి చాలా మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును పూల్ చేస్తాయి. ఒక ప్రొఫెషనల్ మేనేజర్ ఈ ఫండ్‌ను పర్యవేక్షిస్తారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దానిపై నిర్ణయాలు తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ నికర అసెట్ వాల్యూ (ఎన్‌ఏవీ)గా పిలువబడే ధరకు ట్రేడింగ్ రోజు చివరిలో కొనుగోలు, విక్రయాలు చేస్తారు.

ఈటీఎఫ్‌లు అంటే..

ఎక్స్‌చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) కూడా బహుళ పెట్టుబడిదారుల నుంచి డబ్బును పూల్ చేస్తాయి. అయితే అవి వ్యక్తిగత స్టాక్‌ల వంటి స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేస్తాయి. దీనర్థం మీరు మార్కెట్ ధరలకు ట్రేడింగ్ రోజు అంతటా ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. ఇది ఎన్‌ఏవీకి భిన్నంగా ఉంటుంది. ఈటీఎఫ్‌ ఫండ్‌లు నిఫ్టీ 50 వంటి నిర్దిష్ట సూచికలను ట్రాక్ చేస్తుంది. లేదా నిర్దిష్ట రంగాలు, వస్తువులు లేదా ప్రాంతాలపై దృష్టి పెడుతుంది. ఈ సౌలభ్యం వారి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరచాలని చూస్తున్న పెట్టుబడిదారులకు బెస్ట్ ఎంపికగా మారుతుంది.

ఈటిఎఫ్‌లు వర్సెస్‌ మ్యూచువల్ ఫండ్‌లు..

ట్రేడింగ్, లిక్విడిటీ: ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో రిలయ్‌ టైం ట్రేడింగ్ ఎంపికలను అందిస్తాయి. ఈటీఎఫ్‌లను ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ట్రేడింగ్ రోజు కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ వారి ఎన్‌ఏవీ ఆధారంగా రోజు చివరిలో విలువను కలిగి ఉంటాయి, ఇది ఇంట్రా-డే ధరల నుంచి భిన్నంగా ఉండవచ్చు.

పెట్టుబడి విధానం: ఈటీఎఫ్ లు ఒక నిర్దిష్ట సూచికను ట్రాక్ చేస్తాయి. ఇది పారదర్శకతతో పాటు నష్టాన్ని తక్కువ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్‌లు ఫండ్ మేనేజర్‌లు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడతాయి. ఇవి అధిక రాబడిని ఇవ్వగలవు. అదే సమయంలో ఎక్కువ నష్టాన్ని కూడా కలిగి ఉంటాయి.

పెట్టుబడి ప్రక్రియ: ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడానికి, మీకు డీమ్యాట్ ఖాతా అవసరం. మ్యూచువల్ ఫండ్‌లను మ్యూచువల్ ఫండ్ హౌస్, డిస్ట్రిబ్యూటర్ లేదా అగ్రిగేటర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

డైవర్సిఫైడ్ స్ట్రక్చర్: ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు రెండూ పెట్టుబడిదారులకు విభిన్నమైన ఆస్తుల పోర్ట్‌ఫోలియోకు యాక్సెస్‌ను అందిస్తాయి. వివిధ హోల్డింగ్‌లలో రిస్క్‌ను వ్యాప్తి చేయడంలో సహాయపడతాయి.

రిస్క్ టాలరెన్స్: యాక్టివ్‌గా నిర్వహించే మ్యూచువల్ ఫండ్‌లు ఆల్ఫాను ఉత్పత్తి చేసే ప్రయత్నంలో అధిక నష్టాలను కలిగి ఉండవచ్చు. దీనికి విరుద్ధంగా ఈటీఎఫ్ లు, వాటి నిష్క్రియ వ్యూహంతో, మొత్తం మార్కెట్ ట్రెండ్‌లతో తమ పెట్టుబడులను సమలేఖనం చేయాలని చూస్తున్న వారికి మరింత సముచితంగా ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్లీ రెండు తుఫాన్లు.! ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
మళ్లీ రెండు తుఫాన్లు.! ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
దసరా పండుగ వేళ ఫ్రీగా నాటుకోడి, మందు బాటిల్..!
దసరా పండుగ వేళ ఫ్రీగా నాటుకోడి, మందు బాటిల్..!
మహారాజ దర్శకుడికి బహుమతిగా కాస్ట్లీ కారు..
మహారాజ దర్శకుడికి బహుమతిగా కాస్ట్లీ కారు..
ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు మహేష్.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో !
ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు మహేష్.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో !
మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్న PCOD.. జాగ్రత్త సుమా!
మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్న PCOD.. జాగ్రత్త సుమా!
ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి నెల ఆదాయం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి నెల ఆదాయం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
సరదా కోసం సముద్రతీరానికి యువకుడు.. ఇంతలో..!
సరదా కోసం సముద్రతీరానికి యువకుడు.. ఇంతలో..!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
హైదరాబాద్‌లో 'గిన్నీస్ ఫ్యామిలీ' నయా ట్రెండ్.. ఏకంగా 20రికార్డులు
హైదరాబాద్‌లో 'గిన్నీస్ ఫ్యామిలీ' నయా ట్రెండ్.. ఏకంగా 20రికార్డులు
పక్షుల కోసం పెట్టిన వలలో చిక్కిన వింత ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా
పక్షుల కోసం పెట్టిన వలలో చిక్కిన వింత ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..