ITR Filing: ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి.. చాలా ఈజీ..
గతంతో పోలిస్తే ఇటీవల మన దేశంలో ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా సులభతరం అయ్యింది. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా ఈ-ఫైలింగ్‌ను ప్రవేశపెట్టడం అతిపెద్ద మార్పుగా చెప్పొచ్చు. ఇది పేపర్ ఫారమ్‌లు, మాన్యువల్ సమర్పణల అవసరాన్ని తొలగిస్తుంది. సమయాన్ని ఆదా చేయడంతో పాటు శ్రమను తగ్గిస్తుంది.

ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఏడాది ఒకసారి తన ఆదాయానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. ఇది ప్రభుత్వానికి, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చే విధానం. ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారులు బాధ్యతగా చేయాల్సిన విధి. ఇది ఆరోగ్యకరమైన పన్ను వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఆర్థిక పారదర్శకతను నిర్ధారిస్తుంది. అంతేకాక ఇది పన్ను చెల్లింపుదారులకు పలు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రస్తుతం ఆదాయ పన్ను దాఖలు చేసే సమయం. పన్ను చెల్లింపుదారులు అందరూ ఐటీఆర్ దాఖలు చేసే పనిలో బిజీగానే ఉన్నారు. అయితే ఒకప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం అంటే అదో బ్రహ్మపదార్థం అన్నట్లు ఉండేది. అయితే ఇప్పుడు దానిని చాలా సరళతరం చేశారు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ దాఖలు ఎలా చేయాలి? దానికి కావాల్సిన పత్రాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
చాలా సులభం..
గతంతో పోలిస్తే ఇటీవల మన దేశంలో ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా సులభతరం అయ్యింది. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా ఈ-ఫైలింగ్‌ను ప్రవేశపెట్టడం అతిపెద్ద మార్పుగా చెప్పొచ్చు. ఇది పేపర్ ఫారమ్‌లు, మాన్యువల్ సమర్పణల అవసరాన్ని తొలగిస్తుంది. సమయాన్ని ఆదా చేయడంతో పాటు శ్రమను తగ్గిస్తుంది. మీరు 24/7 ఎప్పుడైనా, ఎక్కడైనా కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. పన్ను కార్యాలయాల వద్ద క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ స్టెప్-బై-స్టెప్ గైడ్‌లు, ట్యుటోరియల్‌లతో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు ఐటీఆర్-1 (సహజ్) ను ఎలా దాఖలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఐటీఆర్ 1 సహజ్ ను ఎవరు ఫైల్ చేయాలంటే..
ఐటీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఐటీఆర్-1ని దేశీయ నివాసి అయిన వ్యక్తి.. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50లక్షలలోపు ఉన్న వారు దాఖలు చేయాలి. వీటిలో జీతం నుంచి వచ్చే ఆదాయం, ఒక హౌస్ ప్రాపర్టీ, కుటుంబ పింఛను ఆదాయం, వ్యవసాయ ఆదాయం (రూ. 5000 వరకు), సేవింగ్స్ ఖాతాల నుంచి వడ్డీ, డిపాజిట్ల నుండి వడ్డీ (బ్యాంక్ / పోస్ట్ ఆఫీస్ / కోఆపరేటివ్ సొసైటీ), ఆదాయపు పన్ను రిటర్న్స్ నుంచి వడ్డీ, మెరుగుపరిచిన పరిహారంపై పొందిన వడ్డీ, ఏదైనా ఇతర వడ్డీ ఆదాయం వంటివి ఉంటాయి.
ఐటీఆర్ 1 ఫైలింగ్ కోసం అవసరమైన పత్రాలు
మీరు ఏఐఎస్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫారమ్ 16, ఇంటి అద్దె రసీదు (వర్తిస్తే), పెట్టుబడి చెల్లింపు ప్రీమియం రసీదులు (వర్తిస్తే) కాపీలను ఉంచుకోవాలి. అయితే, ఐటీఆర్ లు అనెక్జర్ లెస్ ఫారమ్‌లు కాబట్టి మీరు మీ రిటర్న్‌తో పాటు (మాన్యువల్‌గా లేదా ఎలక్ట్రానిక్‌గా ఫైల్ చేసినా) ఏ డాక్యుమెంట్‌ను (పెట్టుబడి రుజువు, టీడీఎస్ సర్టిఫికెట్‌ల వంటివి) జోడించాల్సిన అవసరం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




