AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Insurance: పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? అయితే ముందు ఇది తెలుసుకోండి..

ఒక అపోహ ప్రచారంలో ఉంది. అదేంటంటే లైఫ్‌ ఇన్సురెన్స్‌ అనేది కేవలం పన్ను ప్రయోజనాల కోసమే. అయితే ఇది చాలా తప్పని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం పన్ను ప్రయోజనాల కోసమే కాదని, కుటుంబానికి సురక్షితమైన భద్రతను, భవిష్యత్తును అందించడమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు లైఫ్‌ ఇన్సురెన్స్‌ అంటే ఏమిటి? తెలుసుకుందాం..

Life Insurance: పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? అయితే ముందు ఇది తెలుసుకోండి..
Insurance Policy
Madhu
|

Updated on: May 03, 2024 | 4:45 PM

Share

లైఫ్‌ ఇన్సురెన్స్‌ అనేది జీవితానికి భద్రతనిస్తుంది. మీకేదైనా జరగకూనిది జరిగితే మీ కుటుంబానికి భరోసానిస్తుంది. ఇటీవల కాలంలో మన దేశంలో ఈ లైఫ్‌ ఇన్సురెన్స్‌ అనేది వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో భాగంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఒక అపోహ ప్రచారంలో ఉంది. అదేంటంటే లైఫ్‌ ఇన్సురెన్స్‌ అనేది కేవలం పన్ను ప్రయోజనాల కోసమే. అయితే ఇది చాలా తప్పని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం పన్ను ప్రయోజనాల కోసమే కాదని, కుటుంబానికి సురక్షితమైన భద్రతను, భవిష్యత్తును అందించడమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు లైఫ్‌ ఇన్సురెన్స్‌ అంటే ఏమిటి? తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? అది ఎలా ఉపయోగపడుతుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రక్షణ స్తంభం..

మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా జీవిత బీమా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనుకున్నారనుకోండి.. లేదా మంచి ఇల్లు నిర్మించుకోవాలని కలలు కంటున్నారనుకోండి.. ఈ మధ్యలోనే ఒక దురదృష్టకర సంఘటన వల్ల మీకు జరగరానిది ఏదైనా జరిగితే.. ఆ కలలు అక్కడితో ఆగిపోకుండా.. మీ కుటుంబానికి మీ కలలను అందుకునే అవకాశాన్ని ఈ జీవిత బీమా అందిస్తుంది. వారికి ఆర్థికంగా అన్ని అవసరాలను తీర్చుతుంది. అంతేకాక మీ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉంటుందని మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు.

పన్ను ప్రయోజనాలు బోనస్‌..

జీవిత బీమా పథకాలపై పలు ప్రయోజనాలు అందుతాయి. వీటిని బోనస్‌గానే చూడాలని నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు జీవిత బీమా ద్వారా వస్తాయి. అయితే పన్ను ఆదా అనేది వార్షిక ప్రయోజనం. సాధారణంగా చెల్లించిన మొత్తం ప్రీమియంలో కొంత భాగం. దీనికి విరుద్ధంగా, జీవిత బీమా అందించే ఆర్థిక రక్షణ మీపై ఆధారపడిన వారికి జీవితకాల హామీ. అందుకే దీర్ఘకాలిక భద్రతా జీవిత బీమా అందించే వాటి కంటే స్వల్పకాలిక పన్ను ఆదాలకు ప్రాధాన్యత ఇవ్వవద్దని నిపుణులు చెబుతున్నారు.

మంచి బీమాను ఎంచుకోవడం కీలకం..

అయితే బీమా ప్రయోజనాలు పూర్తిగా అందాలంటే మంచి బీమా ఎంపిక చాలా కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా సరైన కవరేజిని ఎంచుకోవడం. మీ ప్రస్తుతం జీవిత దశను బట్టి తీసుకోవాలి. మార్కెట్లో టర్మ్‌ ప్లాన్లు, రక్షణ, పొదుపు కలయికతో వచ్చే ఎండోమెంట్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీ జీవిత దశ, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బీమా పాలసీ ఉండాలి. యులిప్‌ల వంటి పన్ను-పొదుపు సాధనాలు బీమా, పెట్టుబడి మిశ్రమాన్ని అందిస్తున్నప్పటికీ, స్వచ్ఛమైన టర్మ్ ప్లాన్‌లతో పోలిస్తే అవి తరచుగా అధిక ప్రీమియంలతో వస్తాయి. పన్ను ప్రయోజనాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వలన మీ కుటుంబ ఆర్థిక భద్రతకు హాని కలిగించే అవకాశం ఉంది. మీ వార్షిక ఆదాయానికి 10 రెట్లు లేదా మీ కుటుంబ భవిష్యత్తును కాపాడే నిర్దిష్ట మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఒక సాధారణ విధానం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..