AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా రెండూ ఒకటేనా? తేడాలున్నాయా? వాటి ప్రాధాన్యం ఏమిటి?

ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు వేర్వేరు అయినప్పటికీ రెండూ కలిసే మీ స్టాక్ మార్కెట్ లావాదేవీలను నిర్వహిస్తాయి. సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం, హోల్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి. షేర్ హోల్డర్లు ఈ రెండు ఖాతాల గురించి సమగ్రంగా అవగాహన పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో వాటి గురించి సమగ్రంగా ఇప్పుడు తెలుసుకుందాం..

Stock Market: ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా రెండూ ఒకటేనా? తేడాలున్నాయా? వాటి ప్రాధాన్యం ఏమిటి?
Stock Trading
Madhu
|

Updated on: May 31, 2024 | 6:21 PM

Share

స్టాక్ మార్కెట్‌పై ప్రతి ఒక్కరికీ ఆసక్తి పెరిగింది. వాటిలో షేర్లు కొనడం, అమ్మడం వంటివి ఎలా చేయాలో తెలుసుకుంటున్నారు. షేర్ మార్కెట్‌లో ప్రవేశించే కొత్త పెట్టుబడి దారులకు దానిపై సమగ్ర అవగాహన ఉండాలి. షేర్ల‌ను కొనాలన్నా, అమ్మాలన్నా ట్రేడింగ్, డీమ్యాట్ అనే ఖాతాలు అవసరం. ట్రేడింగ్ ఖాతా అనేది షేర్లను కొనడానికి, విక్రయించడానికి ఉపయోగపడుతుంది. కొనుగోలు చేసిన షేర్లను డిజిటల్ రూపంలో నిల్వ చేయడానికి డీమ్యాట్ ఖాతా సహాయ పడుతుంది.

రెండూ కీలకమే..

ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు వేర్వేరు అయినప్పటికీ రెండూ కలిసే మీ స్టాక్ మార్కెట్ లావాదేవీలను నిర్వహిస్తాయి. సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం, హోల్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి. షేర్ హోల్డర్లు ఈ రెండు ఖాతాల గురించి సమగ్రంగా అవగాహన పెంచుకోవాలి.

ట్రేడింగ్ ఖాతా ..

స్టాక్ మార్కెట్‌కి మీ గేట్‌వేగా ట్రేడింగ్ ఖాతాను చెప్పవచ్చు. స్టాక్‌లు, బాండ్లు, డెరివేటివ్‌ తదితర సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి దీని ద్వారా వీలవుతుంది. మీరు కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, ఆర్డర్ చేయడానికి ట్రేడింగ్ ఖాతాను ఉపయోగించాలి. ఆర్డర్‌ అమలు చేసిన తర్వాత, షేర్‌లు డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్‌లను ఉంచడానికి ట్రేడింగ్ ఖాతా అవసరం.

డీమ్యాట్ ఖాతా..

డీమెటీరియలైజ్డ్ ఖాతాను డీమ్యాట్ ఖాతా అంటారు. ఇది సెక్యూరిటీల కోసం మీ డిజిటల్ వాల్ట్‌గా పనిచేస్తుంది. మీ పెట్టుబడులను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుతుంది. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్లను కొనుగోలు చేసినప్పుడు, అవి డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. మీరు షేర్లను విక్రయించినప్పుడు మీ డీమ్యాట్ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి.

ప్రయోజనాలు..

  • షేర్లను కొనడానికి ఆర్డర్ చేయడం కోసం ట్రేడింగ్ ఖాతా అవసరం. లావాదేవీ అనంతరం కొనుగోలు చేసిన షేర్లు డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. అలాగే షేర్లను విక్రయించినప్పుడు ట్రేడింగ్ ఖాతా ద్వారా ఆర్డర్ చేయాలి. లావాదేవీ పూర్తయిన తర్వాత మీ డీమ్యాట్ ఖాతా నుంచి షేర్లు డెబిట్ అవుతాయి. రుసుము, కమీషన్ కోసం స్టాక్ బ్రోకర్‌తో ట్రేడింగ్ ఖాతాను తెరవాలి.
  • ఎలక్ట్రానిక్ రూపంలో సెక్యూరిటీలు, షేర్లను ఉంచడానికి డీమ్యాట్ ఖాతా ఉపయోగపడుతుంది. ఫిజికల్ షేర్ సర్టిఫికెట్ల అవసరం లేకుండా చేస్తుంది. మీ సెక్యూరిటీలకు రిపోజిటరీగా ఉపయోగపడుతుంది. షేర్లను కొనుగోలు చేసినప్పుడు డీమ్యాట్ ఖాతాలో నిల్వ చేస్తారు. వాటిని విక్రయించినప్పుడు మీ డీమ్యాట్ ఖాతా నుంచి కొనుగోలుదారుడి డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. మీరు డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో (డీపీ) డీమ్యాట్ ఖాతాను తెరవాలి. అది బ్యాంక్, ఆర్థిక సంస్థ, డిపాజిటరీలలో (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) నమోదు చేసుకున్న స్టాక్‌బ్రోకర్ తో అయినా పర్వాలేదు.
  • సెక్యూరిటీల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి ఆర్డర్లు ఇవ్వడానికి ట్రేడింగ్ ఖాతా, కొనుగోలు చేసిన వాటిని ఉంచడానికి డీమ్యాట్ ఖాతా సహాయపడతాయి.
  • స్టాక్ మార్కెట్లో ట్రేడ్‌లను అమలు చేయడానికి ట్రేడింగ్ ఖాతా, మీ షేర్లు, సెక్యూరిటీలను నిల్వ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం.
  • కొనుగోలు, అమ్మకం ప్రక్రియలో ట్రేడింగ్ ఖాతా ప్రత్యక్షంగా పాల్గొంటుంది. లావాదేవీ జరిగిన తర్వాత హోల్డింగ్‌లు, మార్పులు డీమ్యాట్ ఖాతాలో కనిపిస్తాయి.
  • స్టాక్ మార్కెట్ పెట్టుబడి, విక్రయాలు తదితర ప్రక్రియలకు ఈ రెండు ఖాతాలు అవసరమవుతాయి. ఒకదానితో ఒకటి ఆధారపడి పనిచేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..