IT Intimation Letter: ఐటీ ఇన్టిమేషన్ లెటర్ మీకూ వచ్చిందా? కారణం ఇదేనేమో?
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ జోరుగా జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31 వరకూ మాత్రమే గడువు ఉంది. ఐటీఆర్ దాఖలు చేసిన వారికి ఆన్‌లైన్‌లో ఒక పత్రం పంపుతారు. దానిని ఇన్టిమేషన్ లెటర్ అంటారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) కింద దీనిని పంపిస్తారు. ఇది ఎప్పుడూ జరిగే ఒక సాధారణ ప్రక్రియే.

దేశంలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారందరూ ఏటా ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. ఇది తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ. మీ ఐటీఆర్ ను ఆదాయపు పన్నుశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనంతరం మీకు ఇన్టిమేషన్ లెటర్ వస్తుంది. అయితే దీనికి భయడాల్సిన అవసరం లేదు. మీ ఐటీఆర్ వివరాలను డిపార్ట్‌మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతో సరిపోల్చుతారు. ఆ వివరాలతో పాటు ఏవైనా లోటుపాట్లు ఉంటే మీకు తెలియజేస్తారు.
జూలై 31 వరకూ గడువు..
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ జోరుగా జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31 వరకూ మాత్రమే గడువు ఉంది. ఐటీఆర్ దాఖలు చేసిన వారికి ఆన్‌లైన్‌లో ఒక పత్రం పంపుతారు. దానిని ఇన్టిమేషన్ లెటర్ అంటారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) కింద దీనిని పంపిస్తారు. ఇది ఎప్పుడూ జరిగే ఒక సాధారణ ప్రక్రియ అని చెప్పవచ్చు.
ఇన్టిమేషన్ లెటర్.. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత పన్ను చెల్లింపు దారులకు ఐటీ డిపార్ట్ మెంట్ ఇన్టిమేషన్ లెటర్ పంపిస్తుంది. దానిలో ఈ క్రింది తెలిపిన వివరాలు ఉంటాయి. వివిధ విభాగాలు సమగ్ర సమాచారాన్ని ఈ లెటర్ లో తెలియజేస్తాయి.
చెల్లింపుదారుల వివరాలు.. ఇన్టిమేషన్ లెటర్ లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలు ఉంటాయి. పేరు, పాన్ నంబర్, అసెస్‌మెంట్ సంవత్సరం వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేస్తారు.
ఐటీఆర్ ఫైల్లింగ్.. మీ రశీదు సంఖ్య, ఫైలింగ్ తేదీ, మీరు ఎంచుకున్న ఐటీఆర్ ఫారం తదితర వివరాలన్నీ ఉంటాయి.
ఆదాయ మార్గాలు.. ఇన్టిమేషన్ లెటర్ లో మీ ఆదాయానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. మీకు అన్ని మార్గాల ద్వారా వస్తున్న రాబడి వివరాలు నమోదు చేస్తారు.
పన్ను లెక్కింపు.. పన్ను గణనకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మీరు లెక్కించిన పన్ను, అలాగే శాఖ లెక్కించిన వివరాలను తెలియజేస్తుంది.
డిమాండ్, వాపసు.. నిర్ధిష్ట పన్ను డిమాండ్ గురించి ఈ విభాగం తెలియజేస్తుంది. మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే రీఫండ్ వివరాలు కూడా దీనిలో ఉంటాయి.
ప్రాసెసింగ్ కోడ్.. మీ ఇన్టిమేషన్ లెటర్ లో ఇది చాలా కీలకం ఉంటుంది. దీనిలో మూడు రకాల కోడ్ లు ఉంటాయి. ఇవి మూడు రకాల సూచనలు చేస్తాయి. 143 ప్రకారం వస్తే ఎలాంటి మార్పులు లేకుండా ఇంటిమేషన్ లెటర్ పంపించారని అర్థం చేసుకోవచ్చు. 143(1)(ఎ) అంటే మీరు అదనపు పన్ను చెల్లించాలని సూచన. అలాగే 143(1)(బి) అంటే డిపార్ట్‌మెంట్ నుంచే మీకు రీఫండ్ వస్తుందని తెలియజేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




