Best Mileage Cars: అధిక మైలేజీ.. అతి తక్కువ ధర.. రూ. 10 లక్షలలోపు టాప్ కార్లు ఇవే..

మన దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో మైలేజీ అధికంగా ఇచ్చే కార్లు ఏవి అని అడిగితే అందరూ మారుతి సుజుకీ అని చెబుతారు. ఈ కంపెనీకి చెందిన అన్ని కార్లు మంచి మైలేజీని అందిస్తాయి. పైగా ఇవన్నీ చాలా తక్కువ ధరకే లభ్యమవుతాయి. తక్కువ ధరతో పాటు అధిక మైలేజీ ఇస్తుండటంతో సహజంగానే ఈ కార్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో మారుతి సుజుకీ నుంచి రూ. 10లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ మైలేజీ కార్లను మీకు పరిచయం చేస్తున్నాం.

Best Mileage Cars: అధిక మైలేజీ.. అతి తక్కువ ధర.. రూ. 10 లక్షలలోపు టాప్ కార్లు ఇవే..
Best Mileage Cars
Follow us

|

Updated on: May 26, 2024 | 2:56 PM

ఇటీవల మన దేశంలో కారు కొనుగోళ్లు బాగా పెరిగాయి. నగరాల్లో ఎక్కువ శాతం మంది తమకు సొంత కారు కలిగి ఉండాలని భావిస్తున్నారు. అయితే ఎవరైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ప్రధానం కొన్ని అంశాలను సరిచూసుకుంటూ ఉంటారు. వాటిల్లో కారు లుక్, ఫీచర్స్, ఇంజిన్ సామర్థ్యంతో పాటు మైలేజీని కూడా ప్రధానంగా తనిఖీ చేస్తారు. ముఖ్యంగా మన దేశంలో మైలేజీ వచ్చే కార్లకు మంచి డిమాండే ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను మంచి మైలేజీ ఇచ్చే వాహనాలుగా మార్చుతున్నాయి. అయితే మన దేశంలో అందుబాటులో ఉన్న కార్లలో మైలేజీ అధికంగా ఇచ్చే కార్లు ఏవి అని అడిగితే అందరూ మారుతి సుజుకీ అని చెబుతారు. ఈ కంపెనీకి చెందిన అన్ని కార్లు మంచి మైలేజీని అందిస్తాయి. పైగా ఇవన్నీ చాలా తక్కువ ధరకే లభ్యమవుతాయి. తక్కువ ధరతో పాటు అధిక మైలేజీ ఇస్తుండటంతో సహజంగానే ఈ కార్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో మారుతి సుజుకీ నుంచి రూ. 10లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ మైలేజీ కార్లను మీకు పరిచయం చేస్తున్నాం.

మారుతి సెలెరియో..

ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అన్ని ఇతర పెట్రోల్ కార్ల కన్నా సెలెరియో అగ్రస్థానంలో ఉంది. దీనిలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారితమైన సెలెరియో మాన్యువల్ వేరియంట్లో ఏఆర్ఏఐ- ఆమోదించిన మైలేజీతో 25.24 కేఎంపీల్ వరకు వస్తుంది. హ్యాచ్ బ్యాక్ ఆటోమేటిక్ వేరియంట్ 26.68 కేఎంపీఎల్ వరకు మరింత మెరుగైన ఇంధనాన్ని అందిస్తుంది. మారుతి సెలెరియోను రూ. 5.36 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) విక్రయిస్తోంది.

మారుతీ ఎస్-ప్రెస్సో..

ఈ కారు మారుతి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. దీనిలో 1.0- లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ వేరియంట్లో 25.3 కేఎంపీఎల్ మైలేజీని, మాన్యువల్ వేరియంట్లో 24.76 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ. 4.26 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ. 6.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

మారుతి ఆల్టో కే10..

ఈ హ్యాచ్ బ్యాక్ అత్యంత సరసమైన కార్లలో ఒకటి. ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 24.9 కేఎంపీల్ మైలేజీని అందిస్తుంది. మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 24.39 కేఎంపీఎల్ వాగ్దానం చేస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు రూ. 4 లక్షల ప్రారంభ ధర, ఇది టాప్-ఎండ్ వేరియంట్ రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మారుతీ వ్యాగన్ఆర్..

మారుతి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా దాని బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా ఈ కారు ఉంది. దీనిలో 1.0-లీటర్, మూడు-సిలిండర్ పెట్రోల్, 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లలో ఇది వస్తుంది. మాన్యువల్ గేర్ బ్యాక్స్ అయితే 24.35 కేఎంపీఎల్, ఆటోమేటిక్ వేరియంట్ అయితే 25.19 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 5.54 లక్షల నుంచి రూ.8.50 లక్షలు (ఎక్స్- షోరూమ్) వరకూ ఉంటుంది.

మారుతి స్విఫ్ట్..

మారుతి సుజుకి ఇటీవలే కొత్త తరం స్విఫ్ట్ ను కొత్త ఇంజిన్ తో పరిచయం చేసింది. ఇది మునుపటి తరం మోడళ్ల కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ 25.75 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్ 24.8 కేఎంపీఎల్ వరకు అందిస్తుంది. 2024 స్విఫ్ట్ కొత్త 1.2-లీటర్ కే సిరీస్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 6.50 లక్షలు(ఎక్స్-షోరూమ్).

మారుతి డిజైర్..

మారుతి సుజుకి నుంచి సబ్-కాంపాక్ట్ సెడాన్ ఇది. దీనిలో 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ వేరియంట్లలో 23.26 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్లు 23.69 కేఎంపీఎల్ వరకు అందిస్తాయి. ఈ కారు సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. డిజైర్ ధర 6.56 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి బాలెనో..

మారుతి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్ బ్యాక్లలో ఇది ఒకటి. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. బాలెనో మాన్యువల్ వేరియంట్లో 22.35కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. అయితే ఆటోమేటిక్ వెర్షన్లు 22.94 కేఎంపీఎల్ వరకు అందిస్తాయి. బాలెనో ధర రూ.6.66 లక్షల నుంచి రూ. 9.88 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతీ ఫ్రాంక్స్..

మారుతి నుండి ఇటీవల వచ్చిన ఎస్యూవీ ఇది. మైలేజీ పరంగా భారతదేశంలోని అత్యుత్తమ కార్లలో ఒకటి. ఈ కారు మాన్యువల్ వెర్షన్ అయితే 21.79కేఎంపీఎల్, ఆటోమేటిక్ వేరియంట్ అయితే 22.89కేఎంపీఎల్ దీని ధర రూ. 7.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.